ముస్లిం దేశాలలో భారతీయ తులసికి భలే డిమాండ్.. ఎందుకంటే!

Publish Date:Jun 5, 2026

Advertisement


 భారతదేశ  పరిమళం ఇప్పుడు సప్త సముద్రాల ఆవలి దేశాల వాతావరణంతో మేళవిస్తోంది. ఆ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మనకంటే పూర్తిగా భిన్నమైనవి. మనం మన పెరటి మొక్కగా అంతకంటే ఎక్కువ ఇంటి దేవతగా  భావించి, ప్రతి ఉదయం, సాయంత్రం నీళ్ళు పోసి పూజించే  తులసి, ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాల మొదటి ఎంపికగా మారింది. ఈ మాట తెలియగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది.  కానీ  ఇటీవలి డేటా , వాణిజ్య నివేదికలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్, మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో భారతీయ తులసికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భారతీయులుగా తెలుసుకోవాల్సిన విషయం. తులసిని కేవలం మొక్కగా బావించే ఎంతోమంది విదేశీయులు కూడా తులసికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

విదేశాలలో తులసి..

సనాతన ధర్మంలో, తులసిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, "సాక్షాత్తు లక్ష్మీదేవి" స్వరూపంగా భావిస్తారు. పెరట్లో తులసి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేడు, ఈ నమ్మకం అన్ని హద్దులను దాటింది. ఇటీవలి నివేదికల ప్రకారం, తులసి,  దాని సారాలు భారతదేశం నుండి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశాలు దీనిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, ఒక "దివ్య ఔషధం"గా స్వీకరిస్తున్నాయి.

విదేశాలలో తులసికి ఆదరణ..

విదేశాలలో తులసి ఆదరణ  వెనుక విజ్ఞానం  ఆధ్యాత్మికతల కలయికను ప్రతిబింబించే అనేక లోతైన , తార్కిక కారణాలు ఉన్నాయి. నయంకాని వ్యాధులకు సర్వరోగ నివారిణిగా తులసి పనిచేస్తుంది. ఈ దేశాలలో ఆయుర్వేదంపై నమ్మకం పెరిగింది. అక్కడి శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్, మధుమేహం , శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించి దాన్ని వైద్యంలో భాగం చేస్తున్నారట.

హలాల్ గుర్తించిన మూలిక..

మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో, "హలాల్" ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఉత్పత్తులు సహజమైనవి , స్వచ్ఛమైనవి, వీటిలో నిషేధిత రసాయనాలు ఏవీ ఉండవు. ఈ కారణంగానే అక్కడి ముస్లిం సమాజంలో వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది.

తులసి టీ..

భారతీయ "తులసి టీ" కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు కెఫిన్‌ను వదిలిపెట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి , రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తులసి సారాన్ని ఆశ్రయిస్తున్నారు. తులసితో టీ తయారు చేసుకుని తాగుతున్నారు.

మతపరమైన దృక్కోణం నుండి చూస్తే ప్రతి భారతీయుడు దీన్ని  గర్వంగా భావించాలి. మనం విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనదిగా  పిలుచుకునే మొక్క పరిమళం ఇప్పుడు విభిన్నమైన ప్రార్థనా పద్ధతులున్న ఇళ్లకు చేరుతోంది. సనాతన సంస్కృతి పూజించే ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఎంతో మేలు చేసేది, ఆరోగ్యం చేకూర్చేది అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం.  

ప్రపంచ మార్కెట్లో తులసికి ప్రాధాన్యత..

భవిష్యత్తులో తులసి ప్రపంచ మూలికా మార్కెట్‌కు బిలియన్ల డాలర్ల మేర దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్లలో గల్ఫ్ దేశాలకు తులసి ఎగుమతులు 30-40% పెరిగాయట.

దుబాయ్ , సౌదీ అరేబియాలోని విలాసవంతమైన స్పా మరియు బ్యూటీ పార్లర్లలో ఇప్పుడు తులసి ఆధారిత ఫేస్ మాస్క్‌లు , నూనెలను ప్రీమియం ట్రీట్మెంట్ లో భాగంగా గా అందిస్తున్నారట.

భారతీయులకు ఎంతో పవిత్రమైన,  ఆయుర్వేదంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నట్టు పేర్కొన్న తులసిని భారతీయులు చిన్నతనం చేయకుండా ఉపయోగించుకోవాలి.

                                     *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం..
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం...
పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు...
సినిమాలు, సోషల్ మీడియా , సొసైటీ  తరచుగా వివాహాన్ని ఒక అందమైన చిత్రంగా చూపిస్తాయి. కానీ వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది..
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.