ప్రతి తల్లి కూతురికి ఇవి నేర్పిస్తే.. ఎంత కష్టంలో అయినా బలంగా నిలబడతారు!

Publish Date:May 28, 2026

Advertisement

ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వివాహం తర్వాత అమ్మాయిల జీవితం తమ చేతుల్లో నుండి జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలు తరచుగా ఇతరులను సంతోషపెట్టడానికి తమ కోరికలను, భావోద్వేగాలను అణచివేసుకుంటారు. ఈ అలవాటు క్రమంగా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే అమ్మాయిలకు విలువలు,  మంచి విద్య మాత్రమే కాదు.. ఎంత కష్టంలో అయినా నిలబడాలంటే.. ప్రతి తల్లి తన కూతురికి కొన్ని నేర్పించాలి. వాటిలో  ముఖ్యమైనది.. ఏదైనా కరెక్ట్ కాని విషయానికి " నో " చెప్పడం.  ఇలా ఏదైనా సరికాని విషయానికి నో చెప్పడం అమ్మాయిలను ఎందుకు బలంగా ఉంచుతుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

"నో" అని చెబితే..

ఒక అమ్మాయి 'కాదు' అని చెప్పడం నేర్చుకున్నప్పుడు, ఆమె సంబంధాలలో, వృత్తిలో , సమాజంలో తనను తాను గౌరవించుకోవడం కూడా నేర్చుకుంటుంది. ఈ ఒక్క అలవాటే ఆమెను మానసికంగా దృఢంగా, స్వయం సమృద్ధిగా , ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. ఇది  జీవితంలో ముందుకు సాగడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఆత్మగౌరవం పెరుగుతుంది..

ఆడపిల్ల తన ఇష్టాయిష్టాలను బయటకు  వ్యక్తపరిచినప్పుడు, ఆమె తన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుంది. దీనివల్ల ఆమెకు ఆత్మగౌరవం పెరుగుతుంది.

తప్పుడు వ్యక్తుల నుండి దూరం..

మొహమాటంతోనో లేక ఇతరులను సంతోషపెట్టాలనో ప్రతి దానికి సరే అని చెప్పే అలవాటు.. ఎదుటివారు అమ్మాయిలను  స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. 'కాదు' అని చెప్పడం  భద్రతను ఇస్తుంది. అమ్మాయిలకు ఏదైనా సరికాదు అనిపిస్తే మొహమాటం లేకుండా నో చెప్పడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను నివారించవచ్చు.

నిర్ణయాలలో ఆత్మవిశ్వాసం..

తన మనసులోని మాటను చెప్పడానికి భయపడని అమ్మాయి జీవితంలోని అతిపెద్ద నిర్ణయాలను కూడా ఆత్మవిశ్వాసంతో తీసుకోగలదు.

మానసిక ఒత్తిడి తగ్గుతుంది..

అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నించడం ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ప్రతి అమ్మాయి తన  స్వంత బౌండరీస్ ను నిర్దేశించుకోవడం మనశ్శాంతిని ఇస్తుంది.

బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది..

స్పష్టమైన ఆలోచన , ముక్కుసూటితనం ఉన్న అమ్మాయిలు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తారు. పొగరు, లెక్కలేనితనం.. ఇలాంటి మాటలు అనుకునేవారు కూడా ఉంటారు.  కానీ వ్యక్తిత్వం, మంచితనం,  నిర్ణయాలు సరిగా తీసుకోవడం వంటివి జరుగుతూ ఉంటే.. విమర్శించిన వారే మెచ్చుకునే రోజులు వస్తాయి. దీని వల్ల వ్యక్తిత్వం బలంగా మారుతుంది.

ఎలా నేర్పాలి..

ఏదైనా విషయం సరికాదు అనిపిస్తే దానికి నో చెప్పడం ఎలా అనే విషయాన్ని తల్లులు తమ కూతురికి నేర్పాలి.  కానీ ఎలా నేర్పాలో కొందరికి అర్థం కాదు.

తల్లి కూతురి దగ్గర స్నేహితురాలిగా ఉండి మనసు విప్పి మాట్లాడాలి.  దీనివల్ల కూతురి ఏ విషయాన్ని అయినా మనసు విప్పి పంచుకోగలుగుతుంది.

అందరినీ సంతోషపెట్టడం కోసం అన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదని అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆడపిల్ల అభిప్రాయానికి, నిర్ణయాలకు విలువ ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.  తీసుకున్న నిర్ణయాలు సరిగా లేకపోయినా,  వాటిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని వివరించి చెప్పాలి.

తప్పు చేసినప్పుడు లేదా తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తిట్టడానికి బదులుగా వాటి పర్యావసానాలు వివరించి చెప్పాలి.  ఎలా నిర్ణయం తీసుకుంటే బాగుండేదో.. ఎలా ఉండాలో చెప్పాలి.

ఆడపిల్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పు విషయం కాదని,  అది తన వ్యక్తిత్వాన్ని  తెలియజేస్తుందని వివరించాలి.  అప్పుడే అబిప్రాయాలు, నిర్ణయాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండే తన వ్యక్తిత్వం మంచిగా ఉంటుందో వారికి అర్థమవుతుంది.

                          *రూపశ్రీ.

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.