గుడ్ ఫ్రైడే.. ఇది పండుగ కాదు.. యేసు ప్రభువు త్యాగాన్ని ప్రతిబింబించే దినం..!

Publish Date:Apr 3, 2026

Advertisement


గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు. ఇది సాధారణ పండుగలా ఆనందంతో జరుపుకునే రోజు కాదు..  దీని వెనుక ఉన్న భావం ఎంతో గంభీరమైనది,  ఆధ్యాత్మికతతో నిండినది. యేసు ప్రభువు త్యాగాన్ని ప్రతిబింబించేది.. గుడ్ ఫ్రైడే గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

యేసు క్రీస్తు తన బోధనల ద్వారా ప్రేమ, క్షమ, దయ వంటి విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన మార్గం సహనం, పరస్పర గౌరవంతో కూడుకుని ఉంది. అయితే ఆయన బోధనలు అప్పటి కొందరు అధికారులకు నచ్చకపోవడంతో ఆయనను శిక్షించడానికి కుట్రలు పన్నారు. చివరకు ఆయనను శిలువపై వేయడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు.

గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి, మానవాళి పాపాల విమోచన కోసం తనను తాను అర్పించుకున్నారని క్రైస్తవులు విశ్వసిస్తారు. ప్రేమకు, క్షమకు ఉన్న అపారమైన శక్తిని  ఈ త్యాగం ద్వారా యేసు ప్రభువు ప్రపంచానికి చాటి చెప్పాడని అంటారు. తనను బాధించిన వారిని కూడా క్షమించగలిగిన హృదయం ఉండాలని.. ఈ  గొప్ప సందేశాన్ని ఆయన తానే ఒక ఉదాహరణగా మారి ప్రజలకు, ప్రపంచానికి అందించారు.

గుడ్ ఫ్రైడే ను గుర్తు చేసుకునే విధానం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గుడ్ ఫ్రైడే రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు, యేసు ప్రభువు శిలువ అయిన విధానాన్ని స్మరించుకుంటారు,  చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ఇది ఆత్మపరిశీలనకు, ప్రతి ఒక్కరూ తమ  తప్పులను గుర్తించి మార్పు చెందడానికి  అవకాశం కల్పిస్తుంది.

గుడ్ ఫ్రైడే ప్రతి ఒక్కరికి  ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.. నిజమైన ప్రేమ అనేది త్యాగంతో కూడుకున్నదని,  క్షమించగలిగే మనసు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నేర్పుతుంది.  ప్రతి ఒక్కరు తమ  జీవితాల్లో కూడా ఇతరులను ప్రేమించడం, సహాయం చేయడం, క్షమించడం వంటి విలువలను అలవాటు చేసుకోవాలని గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తు చేస్తుంది.

గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువును శిలువ వేసిన కారణంగా.. ఈ రోజు ప్రతి క్రైస్తవ సోదరుడు, సోదరి..  ఎంతో భావోద్వేగంగా యేసును స్మరించుకుంటారు.  గుడ్ ఫ్రైడే అనేది ఒక విషాద దినం మాత్రమే కాదు,  ఇది మానవత్వాన్ని, దయను,  నిస్వార్థ త్యాగాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన రోజు. మనసును శుద్ది చేసుకుని,  ప్రతి ఒక్కరూ మంచి మార్గం వైపు నడిచేందుకు గుడ్ ఫ్రైడే ఒక మార్గం చూపిస్తుంది.

                                *రూపశ్రీ.

By
en-us Political News

  
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.