ఈ నాలుగు ప్రశ్నలు ఎవరినీ అడగకూడదు.. లేదంటే తిట్లు తినాల్సి వస్తుంది!

Publish Date:Jun 30, 2026

Advertisement

ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది  మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు  తెలియకుండానే అవతలి వ్యక్తికి అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగేవారి  ఉద్దేశాలు తప్పు కాకపోయినా, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఇతరులకు నచ్చకపోవచ్చు , పైగా ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎదుటివారు బాధపడతారు కూడా.  నేటికాలంలో  గతంలో కంటే తమ వ్యక్తిగత జీవితాల పట్ల చాలా మందికి ఎక్కువ శ్రద్ధ ఉంటోంది. అయితే  ప్రతి వ్యక్తికి వారి స్వంత హద్దులు , వ్యక్తిగత గోప్యత ఉంటాయి, వాటిని గౌరవించాలి. కొన్నిసార్లు, మనం కేవలం కుతూహలంతో ప్రశ్నలు అడుగుతాము, కానీ అవతలి వ్యక్తి దానిని తమ పర్సనల్  విషయాల్లోకి చొరబడినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలు చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఎవరినీ అడగకూడని నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరినీ నొప్పించకుండా ఉండగలం. అవేంటంటే..

జీతం..

ఒకరి ఆదాయం లేదా జీతం గురించి అడగడం చాలా సున్నితమైన ప్రశ్నలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.  ఈ ప్రశ్న ఎదుటి వ్యక్తికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు.  ఇలాంటి ప్రశ్న వేయడం  వల్ల ఇతరులతో  తనను పోలుస్తున్నారని లేదా అంచనా వేస్తున్నారని ఎదుటివారికి  అనిపించవచ్చు. అందుకే ఎవరి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదు.

పెళ్ళెప్పుడు..

పెళ్లెప్పుడు అనే ప్రశ్నను భారతీయులు చాలా  తరచుగా అడుగుతుంటారు, కానీ ప్రతి వ్యక్తి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.  కొందరు తమ వృత్తిపై దృష్టి పెడుతుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.  ఈ ప్రశ్నను పదేపదే అడగడం వల్ల ఎదుటి  వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి పడవచ్చు.

వయసు..

వయస్సు అడగడం సాధారణంగా అనిపించినప్పటికీ, చాలా మంది దానిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు.

ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట  లేదా మొదటి సారి ఎవరితోనైనా కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే అది ఎదుటి వారిని   ఇబ్బందికి గురిచేస్తుంది. అవసరం ఉంటే తప్ప  వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడమే మంచిది.

పిల్లలు..

భారతదేశంలో పెళ్లైన చాలా మంది మహిళలు ఎదుర్కునే  ప్రశ్న ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు ఏమిటి అని.  ఇది  చాలా  భావోద్వేగపరమైన,  సున్నితమైనదిగా  ప్రశ్న. కొంతమందికి వారు మాట్లాడటానికి ఇష్టపడని వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య కారణాలు లేదా కుటుంబ పరిస్థితులు ఉండవచ్చు. అందువల్ల, ఇలాంటి ప్రశ్నలు సంబంధాలలో దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఆడపిల్లను  ఎవరు ఈ ప్రశ్న అడగకూడదు.

                                *రూపశ్రీ.

By
en-us Political News

  
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.