ఏమని పిలవాలి? ఇంకేమని పిలవాలి?

Publish Date:Jul 29, 2022

Advertisement

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గురించి, కాంగ్రెస్ ఎంపీ అధీర రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్య చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. పార్లమెంట్ లోపల వెలుపల కూడా చౌదరి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.అనుమానం లేదు. కాంగ్రెస్ ఎంపీ మర్యాద గీత దాటారు. అయితే ఉద్దేశపూర్వకంగా తానా వ్యాఖ్యలు చేయలేదని, పొరపాటున మాట దొర్లిందని సంజాయషీ  ఇచ్చారు. అయినా ఆ వివాదం సర్దుమణగ లేదనుకోండి అది వేరే విషయం.

అయితే, మహిళలు రాష్ట్రపతి పదవిని చేపట్టినప్పుడు, వారిని ఎలా పిలవాలి?ఎలా సంభోధించాలి ? అనే విషయంలో ఇప్పుడు కాదు, రాజ్యాంగ నిర్మాణానికి ముందు నుంచి కూడా సందేహాలు, సందిగ్దతలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి,  రాజ్యాంగ సభలో ‘రాష్ట్రపతి’ సంబోధన అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  మహిళలు  ‘రాష్ట్రపతి’ పదవిని చేపట్టినప్పుడు, వారిని రాష్ట్రపతిగా పిలవడం సరికాదని...‘నేత’ అని సంబోధించాలని రాజ్యాంగ సభ సభ్యుడు కె.టి.షా అభిప్రాయపడ్డారు. అలాగే, మరికొందరు ‘కర్ణధార్‌’ (కెప్టెన్‌)గా, సర్దార్‌గా పిలవాలని సూచించారు. అయితే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆ వివాదానికి అప్పుడే చుక్క పెట్టారు. రాష్ట్రపతి స్త్రీ అయినా పురుషుడు అయినా, లింగ భేదంతో సంబంధం లేకుండా, వారిని ‘రాష్ట్రపతి’గానే పిలవాలని నెహ్రూ నిర్ణయించారు. 

అయితే  నెహ్రూ కాలంలో కానీ, అనంతర కాలంలో కానీ, రాష్ట్రపతి సంభోదనకు సంబంధించి ఏలాంటి చర్చ జరగలేదు. అలాంటి అవసరం,సందర్భం కూడా రాలేదు. 2007 లో ప్రతిభా పాటిల్ దేశ 12వ రాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఎనికయ్యారు. తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో, ఇదిగో ఇప్పటిలానే, మహిళా రాష్ట్రపతిని ఎలా సంభోదించాలనే విషయంలో చిన్నపాటి చర్చ జరిగింది

కానీ, ఇప్పటిలా వివాదం అయితే కాలేదు. అయితే, ప్రధానమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, గవర్నర్లను ఆడ, మగ తేడ లేకుండా ఒకేలా  సంభోదిస్తున్నప్పుడు,ఒక్క రాష్ట్రపతి విషయంలో మాత్రమే వివాదం ఎందుకు, అనే వాదన కూడా వుంది. అందుకే,  భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ, పదవులకు లింగ భేదం ఎందుకనే ఉద్దేశంతోనే కావచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి అని  తేల్చేశారు

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.