భుజాలు తడుముకున్నకొడాలి నాని

Publish Date:Jul 29, 2022

Advertisement

వెనుకటికి ఎవడో గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట.సరిగ్గా అలా ఉంది ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి.   గుడివాడ క్యాసినో వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే తీరు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అంటే ‘దొంగే.. దొంగ దొంగ అరిచినట్టు’ కొడాలి నాని తెలుగుదేశం నేతలకు సవాల్ వసురుతున్నారని  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడలో క్యాసినోను తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి అందజేసి తనను అరెస్ట్ చేయించాలంటూ కొడాలి చేసిన సవాల్ పట్ల టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. చేసిందంతా చేసి, ఇప్పుడు ఈ మేకపోతు గాంభీర్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 

విషయం ఏంటంటే.. గత జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో పెద్ద ఎత్తున క్యాషినో నిర్వహించారు. అది కూడా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సొంత ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం సంచలనంగా మారింది. అప్పటికే భూ దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహించడంలో నానికి అందెవేసిన చెయ్యి అనే పేరుంది. అయితే.. అప్పుడు ఇలా గోవా తరహాలో క్యాషినో నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలైతే ఓ రేంజ్ లో కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. నిజనిర్ధారణ కోసం గుడివాడ వస్తున్న టీడీపీ నేతలను పోలీసలు, కొడాలి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

శ్రీలంక, నేపాల్, గోవాల్లో క్యాషినోలు నిర్వహిస్తున్నాడనే సమాచారంతో  ఇటీవల హైదరాబాద్ లో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిల ఇళ్లు, నగర శివార్లలోని ప్రవీణ్ ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. చీకటి వ్యాపారాల్లో సిద్ధహస్తుడైన చీకోటి ప్రవీణ్ కు- గుడివాడలో జరిగిన క్యాషినోకు సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిదే. చీకోటి ప్రవీణ్ ను కొడాలి నానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిచయం చేశారని, ఆ క్రమంలోనే కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో క్యాషినో నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయంటున్నారు.

ఈ విషయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ఎత్తి చూపుతూ.. చీకోటి ప్రవీణ్ తో వల్లభనేని వంశీ కలిసి ఉన్న ఫొటోలను మీడియా ముందు ప్రదర్శించారు. గోవా తరహాలో గుడివాడలో క్యాషినో నిర్వహించడం వెనుక చీకోటి ప్రవీణ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ హస్తం ఉందని వర్ల రామయ్య ఆరోపించారు.

అయితే.. గుడివాడలో క్యాషినో తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి సమర్పించి తనను అరెస్ట్ చేయించాలని కొడాలి నాని టీడీపీ నేతలకు బహిరంగంగా సవాల్ విసిరారు. ‘బురద పాము కోపం’ అనే సామెత ఒకటి ఉంది.. విషం లేని బురద పాము కరిచినా ప్రమాదం ఉండదు. అలాగే ఒక పక్కన మంత్రి పదవి కోల్పోయి, మామూలు ఎమ్మెల్యేగా ఉంటున్న కొడాలి నాని హవా ఇప్పుడు స్థానికంగా అస్సలు లేదట.  

స్థానిక అధికారులు కూడా ఆయన మాటను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులే కాదు స్వయంగా ఆయనే చెప్పుకుంటున్నారు. చెత్తపై పన్ను వసూలు చేయొద్దని కొడాలి చెప్పినా గుడివాడ మున్సిపల్ అధికారులు పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే మాట విని విధులు నిర్వర్తించకుండాఉండమని ఆయనకే ఖరాకండీగా చెప్పేశారు. దీంతో కోరలు పీకిన పాములా కొడాలి నానిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. అందుకే చెత్త పన్ను విషయంలో సీఎం జగన్ తోనే మాట్లాడతానంటూ   తనలాగే అమాత్య పదవి కోల్పోయిన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సాయంకోరినట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు.

టీడీపీ నేతల నుంచి, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో కొడాలి నాని భుజాలు తడుముకుంటున్నారని, దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు చేస్తున్నారంటున్నారు. చేతనైతే తనన అరెస్ట్ చేయించాలంటూ కొడాలి నాని సవాల్ విసరడం వెనక ఆయనలోని ఉలికిపాటు బట్టబయలైందంటున్నారు.

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.