కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా? రవీందర్ సింగ్ కు ఆహ్వానం అందుకేనా?

Publish Date:Dec 31, 2021

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయ వ్యూహాల్లో దిట్ట అంటారు. జగ మొండి అని కూడా చెబుతారు. తనకు నచ్చని వాళ్లు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వదిలించుకుంటారని అంటారు. తనను కాదనుకుని వెళ్లినవాళ్లను మళ్లీ దగ్గరకు రానీయరు అని కూడా ఆయనపై టాక్ ఉంది. కాని ప్రస్తుతం కేసీఆర్ తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గతంలో మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని గులాబీబాస్.. ఇప్పుడు జిల్లాల బాట పడుతున్నారు.  చిన్నచిన్న నేతలను కూడా అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. చివరకు తనను వ్యతిరేకించిన వాళ్లను కూడా పిలిపించుకుని.. బుజ్జగించి తన దారికి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇంటలిజెన్స్ నివేదికలు రావడం వల్లే కేసీఆర్ ఇలా దిగొచ్చారని చెబుతున్నారు. 

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఆధిపత్యం కోసం  అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీ ఎత్తులు వేస్తున్నాయి. వరి సాగు, నిరుద్యోగం వంటి అంశాల్లో విపక్షాలు దూకుడుగా వెళుతుండగా.. కేంద్రానికి కౌంటర్ గా అధికార పార్టీ కూడా నిరసనలకు దిగింది. తాజాగా  బిజెపికి మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ అధినేత బిగ్ షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పోటీగా బరిలో నిలిచిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారు కేసీఆర్. చాలా సేపు ఆయనతో మాట్లాడి కూల్ చేశారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు రవీందర్ సింగ్. నియంత పాలన సాగుతుందన్నారు. అయినా రవీందర్ సింగ్ ను ప్రగతి భవన్ కు గులాబీబాస్ పిలుపించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. 

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్  టీఆర్ఎస్ సీటు ఆశించి భంగపడ్డారు.  సిట్టింగ్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఇటీవలే పార్టీలో చేరిన ఎల్.రమణ ను పోటీలో నిలిపింది అధికార పార్టీ. దీంతో టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీలో నిలిచారు. అయితే రవీందర్ సింగ్ వెనకున్నది ఈటలేననిప్రచారం జరిగింది.  తనకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతిస్తున్నట్లు రవీందర్ బహిరంగంగానే ప్రకటించుకున్నారు.  ఈటల రాజేందర్ కూడా రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నారని పదేపదే ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తారని భావించినా.. రవీందర్ సింగ్ కు 200పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ గెలిచి ఎమ్మెల్సీలుగా మారారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా వుండాలన్న రాష్ట్ర బిజెపి నిర్ణయాన్ని కాదని ఈటల రవీందర్ సింగ్ కు మద్దతివ్వడంపై కాషాయదళంలోనే భిన్నస్వరాలు వినిపించాయి. ఓటమి తర్వాత కూడా రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పలుమార్లు మాట్లాడారు. తన ఓటమికి ఈటలను బాధ్యుడిని చేయడం తగదని కూడా టీఆర్ఎస్ కు కౌంటరిచ్చారు. అయితే సడెన్ గా  ఏమయ్యిందో తెలీయదు కానీ రవీందర్ సింగ్ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. సిక్కు సామాజిక వర్గం 1832 నుండి ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానంటూ సీఎం కేసీర్ సానుకూలంగా స్పందించినట్లు రవీందర్ పేర్కొన్నారు. రానున్న రోజులలో ఈఅన్ని  సమస్యలను పరిష్కారం  చేసుకుద్దాం అని ముఖ్యమంత్రి కేసీఆ హామి ఇచ్చినట్లు తెలిపారు. 

అయితే సర్దార్ రవీందర్ సింగ్ ను సీఎం కేసీఆర్ మళ్లీ దగ్గరకుతీయడం వెనక పెద్ద రాజకీయమే దాగివుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ ను దెబ్బతీయడానికే టీఆర్ఎస్ ను వీడటమే కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నించిన వ్యక్తిని కూడా కేసీఆర్ దగ్గరకు తీసినట్లు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈటల బలం పెరగకకుండా ముందస్తుగానే ఆయనను టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకత పెరగడంతో ఏ లీడర్ ను వదులుకోరాదని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే తనను తిట్టినవాళ్లను కూడా చేరదీస్తున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.