ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ.. అందుకేనా? చెల్లితో జ‌గ‌నన్నకు క‌ష్ట‌మేనా?

Publish Date:Feb 25, 2022

Advertisement

వైఎస్సార్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ ఎస్ షర్మిల భర్త, క్రైస్తవ మత ప్రచారకుడు  బ్రదర్ అనీల్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్’ను రాజమండ్రిలో కలిశారు. ఎందుకు కలిశారు, ఏమిటి కథ అనేది, ఇంకా స్పష్టం కాకపోయినా, ఏదో రాజకీయం ఉందనే చర్చ మాత్రం మొదలైంది. ఏమీ లేకుండా అనీల్, కేవలం ఉండవల్లి, ‘రాష్ట్ర విభజన’ ఫై రాసిన ‘పుస్తకం కోసమే ఆయన్నికలిశారంటే, అది నమ్మేలా లేదని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అంతే కాదు, వైఎస్ కుటుంబంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోయిన నేపధ్యంలో,కుటుంబం నుంచే, ఆయనకు వ్యతిరేకంగా మరో రాజకీయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే అనీల్, ఉండవల్లిని కలిసి ఉంటారని అంటున్నారు.అంతే కాకుండా, ఉండవల్లిని కలిసిన అనంతరం అనీల్ మీడియాతో మాట్లాడుతూ, ఓ వంక ఉండవల్లి పుస్తకం కోసమే ఆయన్ని కలిశానని అంటూనే, “మా సీక్రెట్స్ మాకుంటాయి, అవసరం వచ్చి నప్పుడు అన్నీ బయటకు వస్తాయి” అని బాంబు పేల్చారు.అలాగే ఉండవల్లి కూడా, వైఎస్ కుటుంబంతో ఉన్న సబందాలతోనే, అనీల్ భీమవరం వెళుతూ దారిలో తనను కలిశారారని చెప్పు కొచ్చినా చివర్లో అశ్వధామా అతః .. అన్నట్లుగా కుటుంబ విషయాలతో పాటుగా, రాజకీయాలు కూడా చర్చించామన్నారు.  

అదలా ఉంటే, షర్మిల పార్టీ, వైఎస్సార్ టీపీకి, ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిన వెంటనే అనీల్ ఉండవల్లిని కలవడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడిందని అంటున్నారు. నిజానికి షర్మిల పార్టీ  ఏర్పాటు చేసి పది నెలల పైగానే అయినా, ఎప్పుడు రాజకీయ వేదికపై కనిపించని అనీల్,ఇప్పడు నేరుగా రాజకీయ ప్రముఖులను కలవడం, రాజకీయాలు చర్చించడంతో ఈ భేటీకీ మరింత ప్రధాన్యత ఏర్పడింది. అంతే కాకుండా అనీల్  తెలంగాణలో కాకుండా, ఏపీలో రాష్ట విభజనకు సంబందించి తాజా చర్చ జరుగుతున్న  సమయంలో ఆ చర్చకు కేంద్ర బిందువుగా ఉన్న ఉండవల్లి కలిసి, ఆ విషయాలు చర్చించడంతో  రాజకీయ వర్గాల్లో ఉండవల్లి , బ్రదర్ అనీల్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందని అంటున్నారు. 

నిజానికి, జగన్ రెడ్డి, సోదరి షర్మిల మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరాయని చాలా కాలంగా ఇటు పార్టీలో,  ఫ్యామిలీలో చర్చ జరుగుతోంది. చివరకు బాబాయ్ వివేకా హత్య కేసువిషయంలోనూ జగన్, షర్మిల చెరో వైపున ఉన్నారు. వైసీపే ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేదుకు కూడా షర్మిలా సిద్దంగా ఉన్నారని,అంటున్నారు. అదెలా ఉన్నా, ఇటీవల షర్మిల ఏపీలో పార్టీని విస్తరిస్తారా, అని అడిగిన ప్రశ్నకు, ఎందుకు విస్తరించ కూడదు, అలాగని రాజ్యాంగంలో వుందా అని ప్రశ్నించారు. అయితే ఆ వెంటనే ఇప్పిటికైతే అలాంటి అలోచన లేదని అవసరం అయితే చూద్దాం అంటూ, చెప్పవలసింది చెప్పేస్తూనే సమాధానాన్ని దాట వేసే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే, వైఎస్సార్ టీపీకి ఈసీ గుర్తింపు వచ్చిన నేపధ్యంలో షర్మిల ఏపీ మీదకు దృష్టి మరల్చారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అదే జరిగితే, ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో ఉన్న జగనన్న ...కు ముందున్నది అంతా కష్ట కాలమే అంటున్నారు.

By
en-us Political News

  
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.