ఈటలతో బండి సంజయ్ వైరమా? ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు అందుకే  వేయలేదా? 

Publish Date:Dec 11, 2021

Advertisement

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు విభేదాలున్నాయా? పార్టీలో ఇద్దరి మధ్య ఆదిపత్య పోరు సాగుతుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో బీజేపీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ అవుననే సమాధానమే వస్తోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య గ్యాప్ వచ్చిందని కొంత కాలంగా ప్రచారం జరుగుతుండగా.. శుక్రవారం జరిగిన శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలతో ఈ అనుమానం మరింత బలపడింది. అధికార పార్టీకి అత్యంత సవాల్ గా నిలిచిన స్థానిక కోటా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ తన ఓటు హక్కు వినియోగించుకోకపోవడం చర్చగా మారింది. 

ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఐదు జిల్లాల్లో ఎన్నికలు జరిగినా.. కరీంనగర్ లో మాత్రమే హోరాహోరీ పోరు సాగింది. మెదక్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ లో విపక్షాల నుంచి పోటీ లేకపోవడంతో అక్కడ అధికార పార్టీ గెలుపుపై ఎవరికి అనుమానాలు లేవు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో జరిగిన రెండు స్థానాల ఎన్నిక మాత్రం హాట్ హాట్ గా సాగింది. టీఆర్ఎస్ రెబెల్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి టీఆర్ఎస్ కు చెమటలు పట్టించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ డైరెక్షన్ లోనే రవీందర్ సింగ్ పోటీ చేశారు. సింగ్ గెలుపు కోసం ఈటల తెరవెనుక పెద్ద ఎత్తున కసరత్తు చేశారని తెలుస్తోంది.

రవీందర్ సింగ్ విజయం ఖాయమని బహిరంగంగానే ప్రకటించారు ఈటల రాజేందర్. దీంతో రవీందర్ సింగ్ కోసం ఈటల పెద్ద ఎత్తున ఖర్చు కూడా చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా వాళ్ల మద్దతు రవీందర్ సింగ్ కు దక్కేలా ఈటల స్కెచ్ వేశారు. అందుకే కాంగ్రెస్ స్థానిక ప్రజా ప్రతినిధులంతా రవీందర్ సింగ్ కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ నిర్వహించిన క్యాంపులు కూడా రాజేందర్ అరేంజ్ చేశారని అంటున్నారు. టీఆర్ఎస్ ఓటర్లు కూడా కొంత మంది ఈటల రాజేందర్ తో టచ్ లో ఉన్నారని, వాళ్లంతా రవీందర్ సింగ్ కే ఓటేశారని చెబుతున్నారు. ముఖ్యంగా హుజురాబాద్, మానకొండురూ,  చొప్పదండి, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులు.. అధికార పార్టీ క్యాంపులోనే ఉన్నా.. ఓటింగ్ రోజున మాత్రం రవీందర్ సింగ్ కు జై కొట్టారనే ప్రచారం జరుగుతోంది. అందుకే పోలింగ్ ముగియగానే రవీందర్ సింగ్ సంబరాలు చేసుకున్నారని చెబుతున్నారు. 

ఇంత హోరాహోరీగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఉన్న ఓటు హక్కు ఉన్న బండి సంజయ్ ఓటేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కు షాకివ్వాలని ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తే.. బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఓటు వేయకపోవడం ఏంటనే చర్చ సాగుతోంది. కరీంనగర్ పరిధిలో మొత్తం 1324 మంది ఓటర్లు ఉండగా.. 1320 మంది ఓటేశారు. కొందరు సభ్యులు అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయినా.. స్ట్రెచర్ పై తీసుకొచ్చి ఓట్లు వేయించింది అధికార పార్టీ. ఓటేయని నలుగురిలో బండి సంజయ్ ఒకరు. మరో ఇద్దరు చనిపోయారు. టీఆర్ఎస్ కు రవీందర్ సింగ్ గట్టి పోటీ ఇచ్చారని తెలిసి, ప్రతి ఓటు కీలకమని తెలిసి కూడా బండి సంజయ్ ఓటేయకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే సంజయ్ ఓటింగ్ కు రాకపోవడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. 

రవీందర్ సింగ్ .. ఈటల రాజేందర్ మనిషని అందరికి తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని బీజేపీ నిర్ణయించినా.. అందుకు భిన్నంగా రవీందర్ సింగ్ ను ఈటల బరిలో దింపారని అంటున్నారు. ఇప్పటికే హుజురాబాద్ లో గెలుపుతో రాజేందర్ గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. బీజేపీలో ఆయనో పవర్ సెంటర్ గా మారారనే చర్చ ఉంది. ఈటల జిల్లాలు కూడా తిరుగుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తుంది. ఈ సమయంలో ఎమ్మెల్సీగా రవీందర్ సింగ్ గెలిస్తే.. ఆ క్రేడిట్ అంతా రాజేందర్ కు వెళుతుందని సంజయ్ భావించారని అంటున్నారు. అదే జరిగితే పార్టీలో ఈటల పట్టు మరింత పెరుగుతుందని సంజయ్ భయపడ్డారని, అందుకే రవీందర్ సింగ్ గెలవాలని ఆయన కోరుకోలేదనే చర్చ కరీంనగర్ జిల్లాతో పాటు బీజేపీ వర్గాల్లోనూ సాగుతోంది. రవీందర్ సింగ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయలేదు కాబట్టి.. ఓటు వేయకపోయినా ఎవరూ ప్రశ్నించడానికి ఉండదనే సంజయ్ అలా చేశారంటున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తీవ్రంగానే ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.