ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?.. వైసీపీ కొత్త నినాదం

Publish Date:Sep 28, 2023

Advertisement

 ఏంటో పాపం ఎన్ని పేర్లు మార్చినా ఏపీలో వైసీపీకి సౌండ్ పెరగడం లేదు. గడప గడపకి వైసీపీ, జగనే మా నమ్మకం, వైనాట్ 175 ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రజలపై రుద్దాలని చూశారు. కానీ, ప్రజలు వాటిని  పట్టించుకోలేదు. గడప గడపకి కార్యక్రమంలో అయితే ఇళ్లకు వెళ్లిన వైసీపీ నేతలకు, ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపించారు. మంత్రులు అని కూడా చూడకుండా ఏం సాధించారని నిలదీశారు. నాలుగేళ్ళ మీ పాలనలో నరకం చూశామంటూ మొహాల మీదనే తిట్టిపోశారు. ఆ దెబ్బతో చాలా మంది నేతలు మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం ఏమో ఏదోకటి నచ్చ జెప్పండి.. ఒక్కో కుటుంబానికి ఎంత ఇచ్చామో లెక్కలు చెప్పి ప్రజలను మచ్చిక చేసుకోండి అంటూ ఆదేశించినా.. ప్రజల వద్దకు వెళ్లిన నేతల పప్పులు ఉడకనేలేదు. ఇంతిచ్చామని వైసీపీ నేతలు లెక్కలు చెప్తే.. గత ప్రభుత్వం ఏం చేసిందో గణాంకాలతో సహా చూపిస్తూ జనం వైసీపీ నేతలను కడిగి పారేశారు.  ఎన్ని పథకాలు తెచ్చినా.. ఎన్ని కార్యక్రమాలు చేసినా.. చేశామని చెప్పుకుంటున్నా ప్రజలలో వ్యతిరేకతే తప్ప సానుకూలత ఇసుమంతైనా కనిపించకపోవడంతో  వైసీపీ వ్యూహకర్తలు కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. అలా ఇప్పుడు వైసీపీ నుండి వచ్చిన మరో పథకమే 'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?'. తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్సీలతో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ ఈ కార్యక్రమంపై ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. త్వరలో చేపట్టే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించిన రిషిరాజ్.. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమంపై పలు వివరాల్ని వెల్లడించగా.. ఈ కార్యక్రమం ద్వారా నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ.. ఇదే ప్రయోజనాలు కొనసాగాలంటే మళ్ళీ జగనే కావాలని ప్రజలకు నమ్మకం కలిగించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, జగనన్నగృహ సారథులను భాగస్వాములుగా చేసుకుంటూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జగన్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబరులో గడప గడపకు ప్రోగ్రాం ముగించనున్నట్లు చెప్పిన వ్యూహకర్తలు.. తర్వాత ఎన్నికల ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని.. అందుకు పునాది  'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి'? కార్యక్రమం ఉంటుందని చెప్పారని అంటున్నారు.  నవంబరు నుండి కొత్త కొత్త కార్యక్రమాలతో నేతలంతా నిత్యం ప్రజల మధ్యనే ఉండేలా ఐప్యాక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో నేతలకు చెప్పిన జగన్.. ఇక నుండి ఎన్నికల వరకూ నిత్యం ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని కోరారని చెబుతున్నారు.

కాగా, వైసీపీ కొత్త కార్యక్రమంపై ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాలలో ట్రోల్స్ మొదలయ్యాయి. 'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి' అంటూ వైసీపీ కార్యక్రమం రూపొందిస్తుంటే ప్రత్యర్ధులు 'ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో' వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. వైసీపీ పరిపాలన మొదలు పెట్టిన రోజులలో కరకట్టపై ఉన్న ప్రజా వేదిక కూల్చివేత నుండి రంగుల కోసం వృధా చేసిన ప్రజా ధనం, అన్న క్యాంటీన్ల మూసివేత, మద్యం ధరలు పెంచి చేసిన ప్రజా దోపిడీ, ఇసుక కోసం ప్రజలు పడిన,పడుతున్న పాట్లు, రాష్ట్రంలో కొరవడిన ఉపాధి, కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు, వైన్ షాప్ ల వద్ద టీచర్ల కాపలా, మాస్కులు అడిగిన వైద్య సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై పెట్టిన కేసులు, ఎమ్మెల్యేలు.. మంత్రుల బూతు పురాణాలు, అసెంబ్లీలో వైసీపీ నేతలు వేసిన వెకిలి వేషాలు, రాష్ట్రంలో  గుంతల మయంగా మారిన రోడ్లు, మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన కుట్రలు, అటకెక్కిన పోలవరం నిర్మాణం, సీపీఎస్ రద్దు పేరిట ఉద్యోగులకు చేసిన మోసం, జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులను నిలువునా ముంచిన తీరు ఇలా అన్నిటినీ వివరిస్తూ ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో ఆ పోస్టులలో సవివరంగా పెడుతూ వైసీపీ గాలి తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో   వైసీపీకి ఈ కొత్త నినాదం ఏమేరకు పనికి వస్తుందో చూడాలి. ఇది కూడా మరో గడపగడపకూ కార్యక్రమంలాగే అభాసుపాలు కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.