రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మరీ: ఏపీకి సహాయానికి ముందుకు వచ్చిన తెలంగాణ, తమిళనాడు.!

Publish Date:Oct 30, 2026

Advertisement

అర్నాబ్ పెను తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో పెను విలయం సృష్టించింది. ఈ పెను తుపాను కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, పంట నష్టం సంభవించింది. తుపాను హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం కనిష్టానికి తగ్గంది కానీ ఆస్తి, పంట నష్టం అపారంగా వాటిల్లింది.  ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. రాష్ట్రంలో జరిగిన నష్టానికి తగిన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి న చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో, కేంద్రం తక్షణమే స్పందించి సహాయ చర్యలను ముమ్మరం చేసింది.

అర్నాబ్  ధాటికి తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉప్పాడ వంటి తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రతకు మత్స్యకారుల బోట్లు, వలలు, ఇతర పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న పలువు స్థానికులను, కార్మికులను రెస్క్యూ టీమ్స్   సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పాటు రహదారులపై చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.  

ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలో సుమారు రూ. 4 వేల600 కోట్ల మేర ఆస్తి, పంట  నష్టం వాటిల్లింది.   గతంలో వచ్చిన హుద్‌హుద్, తిత్లీ వంటి తుఫానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని అధికార వర్గాలు వెల్లడించాయి.  

ఈ సంక్షోభం నుంచి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించడం, మునిగిపోయిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను సరిచేయడం వంటి అత్యవసర పనులకు   ప్రాధాన్యత ఇస్తున్నారు. మత్స్యకారులు కోల్పోయిన బోట్లకు, జీవనోపాధికి తగిన నష్టపరిహారం అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తూ, వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు. 

అయితే ఏపీని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు రావడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  అర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.

ఇందుకు తమిళనాడు సర్కార్ క్షణం ఆలోచంచకుండా సరే అంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిపవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ఎన్డీయే తరఫున ప్రచారం చేశారు. అంటే తమిళనాడు సీఎం విజయ్ కు, ఆయన పార్టీ టీవీకేకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీ వినతికి తక్షణమే స్పందించి ఏపీకి తమిళనాడు విద్యుత్ సిబ్బందిని, అవసరమైన సామగ్రిని పంపేందుకు అంగీకరించారు.  

అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాలలో  విద్యుత్ పునరుద్ధరణ పనులకు సహాయపడటానికి తెలంగాణ కూడా విద్యుత్ సిబ్బందిని పంపింది.   ఎన్నికలలో రాజకీయ వైరం సహజమే కానీ, కానీ విపత్తు సహాయక చర్యలు దానికి రాజకీయ విభేదాలకు అతీతంగా ఉండాలన్న సందేశాన్నిఏపీ, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు తమ చేష్టల ద్వారా చాటాయి. రాష్ట్రల మధ్య సమైక్యతకు, పరస్పర సహకారానికి ఇటువంటి చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయని పరిశీలకులు అంటున్నారు.  

[Tamilnadu Telangana come forward Help AP, Cyclone Arnab, Damage, Andhra Pradesh, Chandrababu Naidu,Vijay, Revanth, Telugu One]

By
en-us Political News

  
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.