మహిళా రిజర్వేషన్లు 33 శాతమే ఎందుకు?

Publish Date:Apr 17, 2026

Advertisement

హిస్టరీ ఆఫ్ మహిళా బిల్లు.. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోంది? ఇప్పటి వరకూ జరిగిన మలుపులేంటి? ప్రస్తుత పరిస్థితేంటి? మహిళా బిల్లు వల్ల వచ్చే లాభాలేంటి? ప్రపంచంలో ఇప్పటి వరకూ ఉన్న రిజర్వేషన్లేంటి? ఈ బిల్లు ద్వారా రాబోయే మార్పు చేర్పులేంటి? అసలు ముప్పై మూడు శాతం ఎందుకు? అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

మహిళా రిజర్వేషన్ బిల్లు-నారీ శక్తి వందన్ అధినియం అనేది భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల  పోరాటం  ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది. ఆ తరువాత మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో పదే పదే ప్రయత్నాలు జరిగాయి.     1998, 1999, 2002, 2003 సంవత్సరాల్లో వాజ్‌పేయి ప్రభుత్వం ఈ దిశగా ముందుకు సాగాలని ప్రయత్నించినా ఏకాభిప్రాయం కుదరక సాధ్యం కాలేదు. 

మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో ప్రవేశపెట్టేలోపే ప్రభుత్వం మారడం, ఇతర కారణాలతో మళ్లీ అటకెక్కింది.  సెప్టెంబర్ 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియం-106వ రాజ్యాంగ సవరణ పేరుతో దీనిని ప్రవేశపెట్టి, ఉభయ సభల్లోనూ భారీ మెజారిటీతో ఆమోదింపజేసింది.

ఈ చట్టం అమలులోకి వస్తే భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని అంటారు విశ్లేషకులు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు, ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒక వంతు అంటే 33శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇప్పటికే ఉన్న  ఎస్సీఎస్టీ రిజర్వేషన్లలో కూడా 33శాతం సీట్లు ఆయా వర్గాల మహిళలకే కేటాయిస్తారు. ప్రతి లోక్‌సభ ఎన్నికల తర్వాత మహిళలకు కేటాయించిన నియోజకవర్గాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రిజర్వేషన్ 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంటు దీనిని పొడిగించవచ్చు.

ఈ బిల్లు చట్టంగా మారినప్పటికీ, ఇది వెంటనే అమల్లోకి రాదు. దీనికి రెండు ప్రధాన అడ్డంకులు ఉన్నాయి. ఒకటి జనగణన. దేశవ్యాప్తంగా జనాభా గణన జరగాలి. రెండు నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి.  2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. కాబట్టి, 2029 సాధారణ ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

మహిళా బిల్లు వల్ల లాభాలేంటి? అని చూస్తే.. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగడం వల్ల మహిళా సమస్యలు, భద్రత మరియు విద్యపై మరింత సమర్థవంతమైన చట్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. లింగ సమానత్వం కూడా లభిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 15 శాతం లోపే ఉంది. ఇది 33 శాతం కి పెరిగితే రాజకీయాల్లో లింగ వివక్ష తగ్గుతుంది. ఇప్పటికే పంచాయతీల్లో ఉన్న  రిజర్వేషన్ల వల్ల గ్రామీణ స్థాయిలో మహిళా నాయకత్వం పెరిగింది. ఇప్పుడు అది జాతీయ స్థాయికి విస్తరిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి? అని పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా మహిళా ప్రాతినిధ్యంలో భారత్ ప్రస్తుతం వెనుకబడి ఉంది. ఏకంగా 140వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా 61 శాతం పైగా మహిళా ఎంపీలు ఉన్న దేశం రువాండ. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక మెక్సికో,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  దేశాల్లో యాభై శాతం మహిళా ప్రాతినిథ్యం కనిపిస్తోంది. ఇక స్వీడన్ నార్వే వంటి దేశాల్లో అధికారిక రిజర్వేషన్లు లేక పోయినా.. రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాయి. ఈ బిల్లు అమలు కావడంతో భారత్ లో కూడా ప్రపంచ దేశాల సరసన భారత్ సైతం అగ్రస్థానంలో నిలిచే అవకాశముంది.

ఇంతకీ మహిళా రిజర్వేషన్లు 33 శాతం ఎందుకు? అంటే..  అందుకంటూ ఒక కారణమైతే లేదు. కానీ రాజ్యాంగపరమైన రాజకీయ సామాజిక సమీకరణాల కలయిక అయితే కనిపిస్తోంది. దీని వెనకున్న మెయిన్ రీజన్ ఏంటంటే.. ప్రస్తుతం భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కలిపి దాదాపు 49.5శాతం వరకూ ఉన్నాయి. ఈ కోటాకు భంగం కలగకుండా ఉండాలంటే, మహిళలకు ప్రత్యేకంగా ఎక్కువ శాతం కేటాయించడం చట్టపరంగా ఇబ్బంది అవుతుందని భావించారు. అందుకే 33 శాతం అనేది ఒక మధ్యస్థమైన, ఆమోదయోగ్యమైన సంఖ్యగా నిర్ణయించారు.

రాజకీయ పరిశీలకుల ప్రకారం..  ఒక సమూహం నిర్ణయాల్లో ప్రభావం చూపించాలంటే వారు కనీసం 30 నుంచి 33 శాతం ఉండాలి. దీనినే క్రిటికల్ మాస్ అంటారు. పది మంది ఉన్న చోట ఒక్క మహిళ ఉంటే ఆమె గొంతు నొక్కేసే అవకాశం ఉంటుంది. కానీ పది మందిలో ముగ్గురు ఉంటే, వారు ఒక బలమైన గొంతుకగా మారి చట్టాలను మార్చే శక్తిని పొందుతారు. అందుకే కనీస ప్రాతినిధ్యం కోసం ఈ శాతాన్ని ఎంచుకున్నారు.

భారతదేశంలో 1993లో తెచ్చిన 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించారు. అక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, అదే సూత్రాన్ని పార్లమెంటు మరియు అసెంబ్లీలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు ఈ కోటాను 50 శాతానికి పెంచాయి, కానీ జాతీయ స్థాయిలో   33 శాతం తోనే ప్రారంభించారు.

1996 నుంచి వివిధ ప్రభుత్వాలు ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, 33 శాతానికి మించి రిజర్వేషన్ ఇస్తే ఇతర వర్గాల నుంచి.. ముఖ్యంగా పురుష ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని భావించారు. అందరినీ ఒప్పించడానికి ఈ 33 శాతం అనేది ఒక ఫార్ములాగా మారింది. చాలామంది మహిళలు జనాభాలో 50 శాతం ఉన్నారు కదా, కోటా కూడా 50 శాతం ఉండాలి కదా? అని ప్రశ్నిస్తారు. అది న్యాయమైన వాదన అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ పరిమితుల దృష్ట్యా 33 శాతాన్ని మొదటి అడుగుగా వేస్తున్నారు. భవిష్యత్తులో మహిళా ప్రాతినిధ్యం పెరిగే కొద్దీ ఈ శాతాన్ని సవరించే అవకాశం కూడా ఉండవచ్చు.

By
en-us Political News

  
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.