జగన్ ను తిట్టిన ఐఏఎస్ కే బీజేపీ టికెట్ 

Publish Date:Mar 24, 2021

Advertisement

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారింది. తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తుండగా... జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు తిరుపతి ఎన్నికను అస్త్రంగా మార్చుకోవాలని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ  ప్రయత్నిస్తోంది. ఆధ్యాత్మిక కేంద్రంమైన తిరుపతిలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జనసేనతో కలిసి పోటీ చేస్తున్న కమలదళం.. తిరుపతిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను రంగంలోకి దింపింది. సిన్సియర్ అధికారిగా పేరున్న  రత్నప్రభ పోటీ చేస్తుండటంతో తిరుపతి ఎన్నిక మరింత రంజుగా మారింది. 

తిరుపతి ఉపఎన్నికలో రత్నప్రభను పోటీలో దింపడానికి బీజేపీకి పెద్ద లెక్కో ఉందంటున్నారు. రత్నప్రభ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బద్ద వ్యతిరేకి అని తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రత్నప్రభ కూడా ఒక బాధితురాలే. జగన్ సీబీఐ కేసులో నిందితురాలిగా చేర్చబడ్డ ఐఏయస్ అధికారి రత్నప్రభకు.. తర్వాత హైకోర్టు విముక్తి ప్రసాదించింది. నిజాయితీగా పనిచేసిన రత్నప్రభ.. సీబీఐ కేసు ఎదుర్కోవడంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఆ కోపాన్ని ఆమె జగన్ పై నేరుగానే చూపించారు. కోర్టు ఆవరణలోనే చివాట్లు పెట్టారు. వైఎస్ కుటుంబంపై ఆగ్రహంగా , జగన్ అంటే చిర్రుత్తుకొచ్చే రత్నప్రభను కావాలనే బీజేపీ ఇప్పుడు తిరుపతిలో టికెట్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్. 

2013 నవంబర్ లో  ఇందు టెక్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన వస్తున్న రత్నప్రభకు జగన్ ఎదురయ్యారు. ఈ సందర్భంగా  జగన్ పై ఆమె  తీవ్ర ఆగ్రహంతో మహంకాళిగా ఊగిపోయారు. వాట్ మిస్టర్ జగన్.. వాటీజ్ దిస్ నాన్ సెన్స్..  మీరెవరో నాకు తెలియదు... మిమ్మల్ని నేనుప్పుడు చూడలేదు.. మీవల్ల మీమందరం సమస్యలో పడ్డాం. . ఈ గొడవలతో మాకేం సంబంధం లేదు.. రూల్స్ ప్రకారమే మేం ముందుకు వెళ్లాం.. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆదేశాలిస్తే.. మేం పాటించాం.. మాకెందుకీ సమస్యలు.. మీ కారణంగా మేమమంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.. ఇంతకాలం నిజాయితీగా బతికి.. మీ కారణంగా ఆభాసుపాలయ్యామంటూ జగన్ ను రత్నప్రభ కడిగిపారేశారు. కోర్టు ఆవరణలోనే, అందరూ చూస్తుండగానే  రత్నప్రభ సీరియస్ కామెంట్లు చేయడంతో అవాక్కైన జగన్.. మంచి రోజులు వస్తాయ్ మేడమ్ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఏంటీ వచ్చేది అంటూ రత్నప్రభ  అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం స్పష్టించింది. కోర్టులో రత్నప్రభ ఆవేశాన్ని చూసిన వారు.. జగన్ పై ఆమెకు ఎంత కోపం ఉందో బయటపడిందని అప్పటి ప్రత్యక్ష సాక్షులు చెబుతారు.  

 

ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కత్తి చంద్రయ్య కూతురే రత్నప్రభ..  సిన్సియర్ అధికారిగా పేరు. కర్ణాటక కేడర్ కు చెందిన రత్నప్రభ.. వైఎస్సార్ హయాంలో డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చారు. ఐటీ మరియు రెవెన్యూ శాఖల ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందు టెక్ ప్రాజెక్టు అనే సంస్థకు శంషాబాద్ వద్ద 250 ఎకరాల స్థలం కేటాయించారు. వైఎస్ మరణం తరువాత.. ఆ కేటాయింపుల విషయంలోనే  అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ కేసులు నమోదయ్యాయి. రత్నప్రభ పేరును చార్జ్ షీట్లో ఏడవ ముద్దాయిగా చేర్చారు. కానీ ఆమె తాను ప్రభుత్వాధికారిగా ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాను తప్ప, స్వయంగా ఆ నిర్ణయం తీసుకోలేదని, ఆ వ్యవహారంలో తను ఎటువంటి ప్రయోజనమూ పొందలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆమె వాదనలో ఎకీభవించిన కోర్టు ఆమెను కేసుల నుండి తొలగించింది. 
 

సీబీఐ కేసుల నుంచి బయటపడినా... కోర్టులు తిరిగిన పరిస్తితును రత్నప్రభ మర్చిపోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నిజాయితీగా పనిచేసినా కోర్టు కేసుల్లో చిక్కుకోవడం ఆమె జీర్ణించుకోలేకపోయారంటున్నారు. తన కారణంగా రత్నప్రభ ఇబ్బండి పడ్డారనే విషయం జగన్ కు కూడా తెలుసని చెబుతున్నారు. జగన్ గురించి పూర్తి తెలుసు కాబట్టే ఆమెను తిరుపతి బరిలో నిలిపారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ వల్ల తాను పడిన ఇబ్బందులను రత్నప్రభ చెబితే... వైసీపీకి కష్టమేననే చర్చ జరుగుతోంది. అంతేకాదు సిన్సియర్ ఐఏఎస్ గా గుర్తింపు పొందిన రత్నప్రభకు జనాల నుంచి మంచి స్పందన వస్తుందని కమలదళం ఆశలు పెట్టుకుంది. ఇలా అన్ని పరిశీలించాకే... తిరుపతికి రత్నప్రభ పేరును బీజేపీ పెద్దలు ఖరారు చేశారని తెలుస్తోంది. మరీ తిరుపతి ప్రచారంలో రత్నప్రభ జగన్ ను టార్గెట్ చేస్తారా.. చేస్తే వైసీపీ ఇబ్బందులు తప్పవా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.. చూడాలీ మరీ తిరుపతిలో ఏం జరగబోతోందో...

By
en-us Political News

  
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.