ఈ కరోనా న్యూస్ చదివితే.. గుండె గుబేల్..

Publish Date:Mar 24, 2021

Advertisement

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ టెన్షన్. కొత్తరకం స్ట్రెయిన్‌లతో కలవరం. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలి పోతున్నారు జనం. ప్రజల భయానికి తగ్గట్టే కేసుల సంఖ్యా భారీగా పెరుగుతోంది. అందులో అనేకం కొత్త రకం కరోనా వైరస్ వల్ల వచ్చినవే కావడం మరింత ఆందోళనకరం. మార్చి 18 నాటికి దేశంలో 400గా ఉన్న కొత్త రకం కేసులు.. గత ఐదు రోజుల్లో దాదాపు రెట్టింపయ్యాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త రకం స్టెయిన్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.  

ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో కొత్తరకం స్ట్రెయిన్‌లను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో విదేశాల్లో బయటపడిన కొత్తరకాలే కాకుండా మరిన్ని స్ట్రెయిన్‌లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే, పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభణకు కారణం ఈ కొత్తరకం స్ట్రెయిన్‌లే అని చెప్పేందుకు ఇంకా సరైన ఆధారాలు లభించలేదని తెలిపింది. 

విదేశాల నుంచి వస్తోన్న వారిలో పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 10,787 పాజిటివ్‌ శాంపిళ్లను కేంద్ర ఆరోగ్యశాఖ సేకరించి, పరీక్షించి విశ్లేషించింది. వీటిలో 736 శాంపిళ్లలో బ్రిటన్‌ రకం, 34 శాంపిళ్లలో దక్షిణ ఆఫ్రికా రకం, 1 శాంపిల్‌లో బ్రెజిల్‌ రకం స్టెయిన్ గుర్తించారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఇలాంటి కొత్త రకాలు స్టెయిన్‌లు కనిపించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. గత డిసెంబర్‌లో మహారాష్ట్రలో విశ్లేషించిన నమూనాలతో పోల్చి చూస్తే, కొత్త మ్యుటేషన్ల నమూనాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు కేంద్రం తెలిపింది. గతంలో గుర్తించిన మ్యుటేషన్‌ రకాలతో ఇవి సరిపోలడం లేవని.. రోగ నిరోధకతను తట్టుకొని వైరస్‌ తీవ్రత పెరుగుదలకు ఇలాంటి మ్యుటేషన్లు కారణమవుతాయని కేంద్రం అభిప్రాయపడింది.  

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తోంది. 3 కోట్లకు పైగా కేసులతో అమెరికా ప్రపంచంలోనే ప్రధాన స్థానంలో నిలిచింది. బ్రెజిల్ సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. 1.17కోట్ల కేసులతో  ఇండియా మూడో స్థానంలో ఉంది. అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్‌లో కొవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇండియా తర్వాత.. రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఇటలీ, స్పెయిన్, టర్కీ, జర్మనీ వరుసగా టాప్ 10 జాబితాలో ఉన్నాయి. 

దేశంలో బుధవారం నమోదైన కేసులు నాలుగు నెలల గరిష్ఠానికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా ఆరు వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు గత వారం రోజులుగా పెరుగుతున్నాయని వెల్లడించింది. ఇక ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు మరోసారి ఆంక్షలు ప్రకటించాయి.

సెకెండ్ వేవ్ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుప్పకూలేలా చేశాయి. బుధవారం సెన్సెస్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం 49,786తో ప్రారంభమైన సెన్సెక్స్‌ 49,120 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద స్థిరపడింది. ఇక 14,712 దగ్గర మొదలైన నిఫ్టీ.. 265 పాయింట్లు పతనమై.. 14,549 దగ్గర ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో, దేశీయ సూచీలు సైతం ఢమాల్. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. స్థిరాస్తి, లోహ, ఆటో, బ్యాంకింగ్‌, పీఎస్‌యూ, ఆర్థిక, మౌలిక రంగాల్లోని షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. 

By
en-us Political News

  
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.