వంగవీటి హత్యకు రెక్కీ చేసిందెవరు? చంపే అవసరం ఎవరికుంది? 

Publish Date:Dec 28, 2021

Advertisement

స్వర్గీయ వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా.. తన హత్యకు రెక్కి నిర్వహించారంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరంలో మళ్లీ అలజడి రేపేలా ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. ఎనభయ్యో దశకంలో బెజవాడ నగరంలో చోటు చేసుకున్న హింస, రక్తపాతం తాలుకు అనవాళ్లు.. ఇంకా ఆ నగరంలో సజీవంగానే ఉన్నాయా? అంటే.. వంగవీటి రాధా తాజా వ్యాఖ్యలతో ఉన్నాయనుకోవాల్సి వస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

వంగవీటి రంగా హత్య జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఆ తర్వాత అంటే 33 ఏళ్ల తర్వాత కూడా వంగవీటి రంగా వారసుడ్ని అంతమొందించే కార్యక్రమానికి.. అదే తరహా కుట్ర జరగుతోందా? అసలు వంగవీటి రాధాను ఎవరు హత్య చేయాలనుకున్నారు? ఎందుకు వంగవీటి రాధానే వాళ్లు టార్గెట్‌గా చేసుకున్నారు? ఇంతకీ వంగవీటి రాధాను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంది? పోని వంగవీటి రంగా తనయుడు రాధాను హత్య చేసి..  ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా లబ్ది పొందాలనుకోంటోందా? ఆయన్ని హత్య చేస్తే.. వారికి వచ్చే లాభమేమిటి? పోని ఆయన్ని హత్య చేసి.. ఆ హత్యను మరో పార్టీకి ఆపాదించి... లబ్ది పొందాలనే ఆలోచనలో ఏ రాజకీయ పార్టీ అయినా ఉందా? 

అంటే సందేహామే, పోని అదే నిజమనుకుందాం? వంగవీటి రాధా హత్య  తర్వాత చోటు చేసుకునే పరిణామాలు.. వాటిని తట్టుకుని సదరు పార్టీతోపాటు ఆ పార్టీ నాయకులు ప్రజల మధ్య నిలబడగలరా? ఓ వేళ అనాటి పరిస్థితులు అంటే 1988 నాటి పరిస్థితులు పునరావృతమైతే.. పరిస్థితి ఏమిటీ? వంగవీటి రాధాను హత్య చేసి.. ఆ హత్యను ఓ పార్టీకి పూసి.. ఆయన సామాజిక వర్గం తాలుక ఓట్లు పొందే ప్రయత్నానికి ఏ పార్టీ నాయకుడైనా శ్రీకారం చుట్టారా? లేక రాష్ట్రంలోని ఓ పార్టీలో ఎదుగుతోన్న నాయకుడు.. వంగవీటి రాధాను హత్య చేయించి.. భవిష్యత్తులో తాను రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం కోసం ఇలాంటి తరహా ప్రయత్నం ఏమైనా చేయిస్తున్నాడా? లేక వంగవీటి రాధాను హత్య చేసి.. ఆ సాకుగా ఎరగా చూపి.. ప్రభుత్వాన్ని అస్థిర పరిస్తే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే తలంపు ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా ఉందా?.. లేక అధికారం పార్టీలోని పెద్దలే ఈ తరహా రాజకీయానికి ప్రయత్నిస్తున్నారా? ఆ క్రమంలో వంగవీటి రాధా హత్యకు ఏ రాజకీయ పార్టీ అయినా పథక రచనకు శ్రీకారం చుట్టిందా? అనే ప్రశ్నలతోపాటు సందేహాలు సైతం ఉత్పన్నమవుతున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.   

అసలు వంగవీటి రాధాకు.. వంగవీటి మోహన రంగా తనయుడిగా మంచి పేరే ఉంది. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందింది కూడా ఒక్కసారే. అదీ 2004 ఎన్నికల్లో. ఆ తర్వాత ఆయన వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. ఓటమి పాలైయ్యారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఎన్నికల్లో పోటీనే చేయలేదు. కానీ 2024లో జరగనున్న ఎన్నికల్లో మాత్రం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంగవీటి రాధాను బరిలోకి దింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు.  

ఇక వంగవీటి రాధా స్వతహాగా ఎక్కువగా బయటకు రారు... ఓ వేళ ఆయన బయటకు వచ్చినా తన పని ఏదో తాను చేసుకుని కామ్‌గా వెళ్లిపోతారు. అంతేకానీ రాజకీయాలు, దౌర్జన్యాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు.. వగైరా వగైరా లాంటివి వంగవీటి రాధా ఒంటికి సరిపడవన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ వ్యవహారాల్లో ఆయన అనుచరులను సైతం తలదూర్చనివ్వరన్నది విజయవాడ నగర ప్రజలందరికీ తెలిసిందే. 

అలాగే సభలు, సమావేశాల్లో సైతం వంగవీటి రాధా అంత ఎక్కువగా పాల్గొనరని ఆయన అనుచరులే చెబుతారు. అయితే ఆయన తండ్రి వంగవీటి రంగా జయంతి, వర్ధంతి  కార్యక్రమాల్లో మాత్రం వంగవీటి రాధా పాల్గొన్న.. నాలుగు మాటలు మాట్లాడతారే తప్పా.. పొలిటికల్ మైలేజ్ కోసం ఆ పార్టీ మీద, ఈ పార్టీ మీద నాలుగు రాళ్లు వేద్దామనే యావ ఆయనకు ఏమాత్రం లేదన్న విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసునని ఆయన అనుచరులే పేర్కొంటారు. అలాంటి వంగవీటి రాధా.. తాజాగా తన తండ్రి వర్ధంతి రోజే.. తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. అదీకూడా రాష్ట్ర మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. 

పోనీ ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి.. అసలు ఏం జరిగింది.. రెక్కీ ఎప్పుడు జరిగిందంటూ సదరు సభలోనే వంగవీటి రాధాను ఆరా తీశారా? అంటే అదీ లేదు.  పోనీ వంగవీటి రాధాను మనం రక్షించుకోవాలంటూ ప్రజలుకు వీరిద్దరు ఏమైనా పిలుపు నిచ్చారా? అంటే అదీ కూడా లేదు. మరి వంగవీటి రాధా ఒక సంచలన వ్యాఖ్య చేస్తే వీరిద్దరు కనీసం స్పందించక పోవడంపై పలు సందేహాలకు తావిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు.   

అయితే ప్రస్తుతం వంగవీటి రాధా తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటిని, కార్యాలయాన్ని ఇటీవల దాదాపు 15 మంది ఆగంతకులు పలుమార్లు.. పలు సమాయాల్లో  రెక్కీ నిర్వహించారని ఆయన అనుచరులే స్వయంగా చెబుతున్నారు. పోనీ వంగవీటి రాధా అయినా.. తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ.. అటు డీజీపీని కానీ.. ఇటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను కానీ కలిసి కనీసం ఫిర్యాదు అయినా చేశారా ? అంటే అదీ లేదు. మరి వంగవీటి రాధా చేసిన కామెంట్స్‌ ఏ కోణంలో ఎలా చూడాలని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. వంగవీటి రాధా చేసిన ఓ సంచలన వ్యాఖ్య... లక్ష సందేహాలు పుట్టగా ఉందంటూ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.