పబ్బుల్లో డ్రగ్గులు.. ఎవరు బాధ్యులు?
Publish Date:Apr 4, 2022
Advertisement
మొదటి ముద్దాయి ప్రభుత్వం. పోలీసు, ఎక్సైజ్ వ్యవస్థ. రెండవ ముద్దాయి, సో ..కాల్డ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు.ఈ అందరిని మించిన మహా ముద్దాయి మీడియా... ఒక్క డ్రగ్స్ అనే కాదు, సమాజంలో జరుగుతున్న సర్వ అరిష్టాలకు, వారే ప్రధాన కారణమని అనుకుంటే, తప్పు లేదని,సమాజంలోని విభిన్న వర్గాల నుంచి వినవస్తోంది. ఇది ఒక విధంగా సమాజం వ్యక్తపరుస్తున్న ఆవేదన.కాదంటే ఆరోపణ. ఆవేదన అయినా, ఆరోపణే అయినా,నడుస్తున్న చరిత్రలో అది కళ్ళముందు కనిపిస్తున్న సత్యం. హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ కొత్త కాదు. పబ్స్ కొత్త కాదు. పబ్ కల్చర్, డ్రగ్స్ కల్చర్ కొత్త కాదు. గతంలోనూ హైదరాబాద్ నగరంలో పబ్బులున్నాయి, డ్రగ్స్ కూడా ఉన్నాయి. అనేక సందర్భాలలో అరెస్టులు కూడా జరిగాయి. కానీ, తెరాస ప్రభుత్వ ఎనిమిదేళ్ళ పాలనలో, ఈ కల్చర్ విపరీతంగా పెరిగి పోయిందనేది ఇటు విపక్షాల నుంచి అటు సామాజిక కార్యకర్తల నుంచి కుడా విమర్శలు వినవస్తున్నాయి. ఒకప్పుడు, నగరంలో వేళ్ళ మీద లెక్కించి సంఖ్యలో ఉన్న పబ్బుల సంఖ్య ఇప్పుడు వందలకు చేరుకున్నాయి. వీధికో పబ్, వాడకో బార్ ఆన్నట్లుగా ఇటు మద్యం, అటు డ్రగ్స్ మత్తు జోరుగా సాగుతోంది. నిజానికి, బార్లకు పబ్బులకు మధ్య తేడా ఏదైనా ఉందంటే, బార్లలో మధ్యం మాత్రమే తొరుకుతుంది. పబ్బులలో మందుతో పాటు, డ్రగ్స్ విందు, పసందు కూడా తొరుకుతాయి. పబ్బుల్లో కొన్నిటికీ కాలపరిమితితో కూడిన అనుమతులుంటే, కొన్నింటికి 24X 7 అనుమతులున్నాయి. అంతే కాదు, ఈ మధ్య కాలంలో ఇళ్ళ మధ్యకు వచ్చిన పబ్బులకు వ్యతిరేకంగా, ప్రజలు ఆందోళన చేయడం కూడా తరచు చూస్తున్నాం. అయినా, ఇదిగో ఇలా ఏదో జరిగినప్పుడు, నాలుగు రోజులు హడావిడి చేసి, ఆ తర్వాత మళ్ళీ మామూలై పోవడమే కానీ, నిర్దిష్ట చర్యలు ఉండడం లేదు. ఇప్పుడు, మళ్ళీ మరోమారు డ్రగ్స్ మహమ్మారి విషయం తెర మీదకు తెచ్చిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్’ విషయానికి వస్తే.. ఈ పబ్బుకు 24X7 అనుమతి ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, ఆ పబ్’లో తెల్లవార్లు చిందులు, విందులు సాగాయి. నిజానికి, అనుమతి ఉన్నా లేకున్నా,చాలా వరకు పబ్బులు, నిబంధనలను ఉల్లంఘించి అర్థరాత్రి దాటిన తర్వాత, ఇంకా మాట్లడితే తెల్లవార్లు కూడా తెరిచే ఉంటున్నాయి.ఈ కేసుకు సంబంధించి 148 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, 142 మంది జాబితా మాత్రం విడుదల చేశారు. ఇక పేర్లు ప్రకటించని ఆరుగురు ఎవరు అనే దగ్గర మొదలు పెడితే, ప్రభుత్వము, పోలీసులు సమాధానాలు చెప్పవలసిన ప్రశ్నలు చాలానే, ఉన్నాయి. అదుపులోకి తీసుకున్న అందరూ డ్రగ్స్ తీసుకున్నారని అనుకోలేము, కానీ, అందులో కొందరు డ్రగ్స్ తీసుకున్నారనే అనుమనాలు ఉన్నప్పటికీ, డ్రగ్స్ దొరికినప్పటికీ, (పత్రికలలో వచ్చిన వివరాల ప్రకారం పబ్‌లో 11 గ్రాముల డ్రగ్స్ ప్యాకెట్స్’ను పోలీఎసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొకైన్, ఎండీఎమ్‌ఏ, చరస్ లాంటి డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. మేనేజర్ అనిల్‌కుమార్ కంటైనర్ ట్రేలో 5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు)ఎలాంటి పరీక్షలు లేకుండా,అందరినీ వదిలేయడం మరిన్ని అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. అలాగే, పబ్బులకు ఇంత విచ్చలవిడిగా అనుమతులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరి ప్రోత్సహంతో, ఎవరి అండదండలతో ‘పుడ్డింగ్ అండ్ మింక్ పబ్’ వంటి పబ్బులు నిబంధనలను ఉల్లంఘించి తెల్లవార్లు చిందులు, విందులు, సాగిస్తునారు, అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. మరోవంక, సహజంగానే ఈ వ్యవహరం చుట్టూ, రాజకీయ దుమారం చెలరేగుతోంది. అంతే కాదు, తెరాస ప్రభుత్వంపై రాజకీయ ప్రత్యర్దులే కాదు, న్యాయస్థానం కూడా అక్షింతలు వేశాయి. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్’కు డ్రగ్స్ వ్యవహారంతో లింకులు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి కేటీఅర్’కు రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. అఫ్కోర్స్, మంత్రి ఆ ఛాలెంజి స్వేకరించలేదు అనుకోండి అది వేరే విషయం. మరో వంక కొంత కాలం క్రితం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన అనేకమందిపై వచ్చిన డ్రగ్ ఫెడ్డ్లింగ్, డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో,ఎక్సైజ్ శాఖ చాల పెద్ద ఎత్తున విచారణ జరిపింది. కానీ, విచారణ జరిపిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆకుల్ సబర్వాల్’ తమపై వచ్చిన వత్తిళ్ళను తట్టుకో లేక, నివేదిక ఇవ్వకుండానే సెంట్రల్ సర్వీస్’కు వెళ్లి పోయారు. ఆ తర్వాత సోమేశ్వర్ రావు వచ్చినా నివేదిక మాత్రం ఇంతవరకు రాలేదు. చివరకు హై కోర్టు జోక్యం చేసుకుని నివేదిక కోరినా సర్కార్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుతం కోరిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమధానం లేదు. చివరకు, న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఉత్తర్వుల దిక్కరణ నోటీసు జారీ చేసింది, అయినా సంధానం లేదు. అందుకే ప్రభుత్వం ఎవరిని వెనకేసుకోస్తోంది. ఎవరిని కాపాదలనుకుంటోంది అనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. మరో వంక్ ముఖ్యమంత్రి సినిమా వళ్ళు అమాయకులు, వాళ్ళకు డ్రగ్స్’తో ఏమి సంబంధం ఉంటుందని, విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంటే , ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో అక్కడ ప్రభుత్వం, ఏదో దాచే ప్రయత్నం చేస్తోందేమో, అనుమానాలు సామాన్యులు వ్యక్తపరుస్తున్నారు.
http://www.teluguone.com/news/content/who-is-responsible-for-growing-drug-mafia-39-133859.html





