ర‌జ‌నీకి గౌత‌మ్‌రెడ్డి ప‌ద‌వి!.. రోజా బ‌తుకు ర‌చ్చ‌బండేనా?

Publish Date:Feb 22, 2022

Advertisement

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ జాక్ పాట్ కొట్టబోతున్నారా? అదృష్ట యోగం పట్టి.. ఆమెను అమాత్య పదవి వరించనుందా? సీఎం జగన్ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఆ క్రమంలో ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సీఎం జగన్ డిస్కషన్ చేశారా? అంటే అవుననే అంటున్నాయి తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు.

మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పదవి ఖాళీ అయింది. అయితే ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం మూడూ.... మూడు శాఖలే. ఈ శాఖను పక్కన పెడితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర గందరగోళమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆ మంత్రి పదవి ఎవరిని వరిస్తోందంటూ అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ శాఖను సీఎం జగన్.. విడదల రజినీకి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

విడదల రజని.. ఎన్నారై రిటర్న్. ఆమె సాఫ్ట్‌వేర్ రంగం నుంచి నేరుగా రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు ఇన్పర్మేషన్ టెక్నాలజీపై మంచి పరిజ్జానమే ఉంది. దీంతో ఆమెకు ఈ పదవి కట్టబెట్టాలని సీఎం జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మంత్రి పదవికి పలువురు పేర్లు సైతం తెరపైకి వచ్చినట్లు సమాచారం. అందులో ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచో ఆర్కే రోజా మంత్రి పదవి కోసం కాచుకు కూర్చుని ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపుతో.. జగన్ కేబినెట్‌లో తనకు సీటు గ్యారెంటీ అని రోజా భావించారు. కానీ ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో... నాడు సీఎం జగన్ ఎదుటే ఆమె నిరసనకు దిగింది. దాంతో ఆమెకు సీఎం జగన్ ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక, రోజాకు ఎప్పటికీ మంత్రి పదవి రాకుండా.. ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి ఎలాగూ అడ్డుకోవడం ఖాయం అంటున్నారు. ఇటీవల రోజా, పెద్దిరెడ్డిల మధ్య వైరం బాగా ముదిరిపోయింది. ఈ విషయం రెడ్డివారి చక్రపాణిరెడ్డి వ్యవహారంలో బట్ట బయలు అయింది. ఈ నేపథ్యంలో రోజాకు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి ఎంత చేయాలో అన్ని చేస్తారని.. ఈ నేపథ్యంలో రోజా మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే..అంటున్నారు. 

ఇక, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ శాఖలు అప్పగిస్తే.. మరింత టెన్షన్ పడే అవకాశం ఉందని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో అప్పుల కోసం ఆయన ఢిల్లీ, అమరావతి వయా ముంబై మీదగా చక్కెర్లు మీద చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఆయన పేరును ముఖ్యమంత్రి పక్కన పెట్టినట్లు సమాచారం. ఇస్తే గిస్తే.. పరిశ్రమలు, వాణిజ్య శాఖను బుగ్గనకు అప్పగించి.. ఐటీని మరొకరికి కట్టబెడతారని టాక్.

సీఎం జగన్.. విడదల రజినీ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఫారెన్ రిటర్న్ అయిన విడదల రజనీ.. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో.. హైటెక్ సిటీలో చంద్రబాబు పెట్టిన ఓ మొక్క తానంటూ తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత.. ఆమె ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసి.. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాదు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీలోని అన్ని గ్రూప్‌లను ఒంటి కాలితో తొక్కి పెట్టి.. ఎక్కడా తగ్గేదే లే అన్న స్టైల్‌లో దూసుకుపోతున్నారు. ఇక మంత్రిగా ఆమెకు ప్రమోషన్ ఇస్తే.. రజనీ రేంజ్ మరింత పెరగడం.. రెచ్చిపోవడం ఖాయం.. అంటున్నారు. 

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.