వరదలతో సీమ విలవిల.. ఎవరిదీ ముంపు పాపం?

Publish Date:Nov 20, 2021

Advertisement

కుండపోత వర్షంతో వరద పోటెత్తింది. రాయలసీమ అతలాకుతలమైంది. చిత్తూరు, కడప, అనంతపురంతో పాటు నెల్లూరు జిల్లాలో వరద విలయం స్పష్టించింది. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ నష్టం కూడా ఇటీవల కాలం ఎప్పుడు లేనంతగా జరిగింది. అసలు ఎవరూ ఊహించని రీతిలో అపార నష్ఠం జరిగింది. దీంతో వరద ముంపునకు అసలు కారణమేంటీ అన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముంపు పెరిగిందనే విమర్శలు వస్తున్నాయి. 

మూడు రోజులుగా వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. దీంతో క్షేత్ర స్థాయిలో జలాశయాల పరిధిలో, నది పరివాహక ప్రాంతాల్లో అనుక్షణం అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. జలాశయాల్లోకి చేరే నీటిని ఎప్పటికప్పడు అంచనా వేయాలి. వరద ముంపు, ముప్పును తప్పించాల్సి ఉంది. కాని అధికారులు ఇవేమి చేసినట్లు కనిపించలేదు. ఎన్ని క్యూసెక్కుల వరద వస్తోంది, ఎంత వదలాలి. ఎంత నీరు వదిలాలి అన్న లెక్కలను చూసుకోలేదు. దీంతో జరగరాని నష్టం జరిగిపోయింది. నది పరివాహకంలో గ్రామాల్లోకి నీరు దూసుకెళుతుందని ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఇంత విషాదం ఉండేది కాదని చెబుతున్నారు.

కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం ప్రమాదంలో పడింది. ఎప్పుడు లేనంతగా కట్ట కోతకు గురైంది. అన్నమయ్య జలాశయం నిల్వ సామర్థ్యం 2.239 టీఎంసీలు కాగా, గరిష్ఠంగా 2.48 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలే వెసులుబాటు ఉంది. అయిదో గేటు సాంకేతిక లోపంతో మొరాయించింది. కొన్నిరోజులుగా మరమ్మతులు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నా నిధులు ఇవ్వలేదు. మిగతా 4 గేట్ల సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో పనిచేయలేదు. వరద ఎక్కువగా వస్తుందని భయపడి అధికార యంత్రాంగం పూర్తిగా ఎత్తలేదని తెలిసింది. దీంతో మట్టి కట్టపైకి నీరు చేరడానికి కారణమైంది. ఎగువన పింఛ జలాశయంలోకి ఎంత నీరు వస్తుంది. తాత్కాలిక కట్ట తెగితే వరద ప్రవాహం ఎలా ఉంటుంది అని దిగువన ఉన్న వారికి సమాచారం చేరవేయాల్సి ఉంది. విపత్తు జరిగితే జిల్లా కీలక అధికారులు ముందుగానే సిద్ధంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో విపత్తులు తలెత్తితే ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి. సమర్థంగా పనిచేసేలా అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. వెంటనే కార్యాచరణలోకి దిగాలి. ఇక్కడ అది చేయలేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ముందుచూపు కొరవడంతోనే వరద ముంపు ముంచేసినట్లు బాధితులు ఆక్రోశిస్తున్నారు. 

వరద ఉద్ధృతికి కోతకు గురైన అన్నమయ్య జలాశయం కట్ట.. ఎందరికో కడుపు కోత మిగిల్చింది. జలాశయాన్ని బద్ధలుకొట్టుకుని చెయ్యేరులోకి దూసుకొచ్చిన వరద నీరు.. ఏరూ ఊరును ఏకం చేసింది. పదుల సంఖ్యలో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. నీటి ప్రవాహ ఉద్ధృతికి.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఎందరో కొట్టుకుపోయారు. ముళ్లపొదల్లో.. ఇళ్ల శిథిలాల్లో శవాలై తేలారు. వందలాది మూగజీవాలు సైతం ఏటి పాలయ్యాయి. కనీవిని ఎరుగని స్థాయిలో కల్లోలం సృష్టించిన తుపాను జన జీవనాన్ని కకావికలం చేసింది. ప్రశాంతంగా ఉన్న పల్లెల బతుకు చిత్రాన్ని తారుమారు చేసింది. 

వరదనీరు పోటెత్తుతున్న వేళలో రాజంపేట డిపో నుంచి ఆర్టీసీ  బస్సులను ఎందుకు పంపారో ఎవరికి అంతుపట్టడంలేదు. ఉదయం డిపో నుంచి అనంతపురానికి బయలుదేరిన బస్సు రామాపురం చెక్‌పోస్టు వద్దకు వెళ్లేసరికి వరద నీరు ఒక్కసారిగా వచ్చేసింది. దీంతో ముందుకు వెళ్లలేక వెనక్కి తిప్పుకుని వస్తున్న సమయంలో వరదతాకిడి ఎక్కువై వరదలో చిక్కుకుంది. రెండు, మూడు గంటల తరువాత పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రెండో బస్సులో ఆరుగురు ఉంటే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వరద తాకిడికి ఆర్టీసీ అద్దె బస్సు మునిగిపోయింది. ఇందులోని ఏడుగురిలో డ్రైవరు, మరో ప్రయాణికుడు మాత్రం బస్సు పైకి ఎక్కారు. మిగిలిన వారు బస్సులోనే చిక్కుకున్నారు. 
 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.