వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ రాజీనామా.. ట్రంప్ సీనియర్ సలహాదారుగా కొత్త బాధ్యతలు.!

Publish Date:Aug 13, 2026

Advertisement

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఆ పదవి నుంచి  వైదొలిగారు. ఆమె ప్రెస్ సెక్రటరీ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.   28 ఏళ్ల వయసులోనే   వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పీఠాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన కరోలిన్ లెవిట్.. ఈ నెల చివర్లో తన విధుల వైదొలగుతారు. ఆమె రాజీనామాకు  వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలే  కారణమని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.  

ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.  కరోలిన్ లెవిట్ రాజీనామాను అధికారికంగా ధృవీకరించిన డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ సెక్రటరీగా లెవిట్ రాజీనామా చేసినా  పాలనా యంత్రాంగంలో ఆమె పాత్ర ముగిసిపోలేదని, తన సీనియర్ సలహాదారుగా కొత్త బాధ్యతలలో ఉంటారని వెల్లడించారు.  తన రాజీనామాపై లెవిట్.. 

వైట్‌హౌస్  ప్రెస్ సెక్రటరీగా పనిచేసే అవకాశం ఇచ్చిన ట్రంప్ కు కృతజ్ణతలు తెలిపారు. అధ్యక్షుడి తరఫున వైట్‌హౌస్ వేదికగా నిలబడి మాట్లాడటం తనకు దక్కిన గౌరవంగా చెప్పుకున్న ఆమె..  ట్రంప్ సాధించిన చారిత్రాత్మక విజయాలను నేరుగా అమెరికన్ ప్రజలకు తెలియజేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.
 
White House Press Secretary, Karoline Leavitt Resignation,  Republican Party,  US Politics 

By
en-us Political News

  
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ ఏజ్, ఫిట్‌నెస్, రికార్డులతో కూడిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి!
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.