భోగాపురంలో ల్యాండ్ అయిన స్పెషల్ ఫ్లైట్.!

Publish Date:Aug 13, 2026

Advertisement

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేశ్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు భోగాపురం చేరుకున్నారు. నూతన విమానాశ్రయంలో ఈ ప్రత్యేక విమానం ల్యాండ్ కావడంతో..  వాణిజ్య విమాన సర్వీసుల నిర్వహణకు విమానాశ్రయం రెడీ అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  భోగాపురం విమానాశ్రయాన్ని ఈ నెల 1న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేసి.. జాతికి అంకితం చేసిన సంగతి విదితమే. ఈ విమానాశ్రయం నుంచి ఈ నెల 17 నురంచి రెగ్యులర్ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అందుకు ముందస్తు సన్నాహాల్లో భాగంగనే  ఈ ప్రత్యేక విమానాల రాకపోకలు జరుగుతు న్నాయి.  విమానాశ్రయ నిర్వహణ సన్నద్ధతను పరిశీలించే క్రమంలో భాగంగానే ఈ ప్రత్యేక విమానం  ల్యాండ్ అయింది.  ఢిల్లీ నుండి బయలుదేరిన ఈ ప్రత్యేక విమానంలో  ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు భోగాపురం చేరుకోవడం విశేషం.

ఈ రన్‌వే పరిశీలన ప్రక్రియతో ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.  విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాల రాకపోకలు ప్రారంభం కావడానికి ముందే.. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను, సాంకేతిక అంశాల పరిశీలనకు ఈ ప్రత్యేక విమానాన్ని ఇక్కడ ల్యాండ్ చేసినట్లు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  

Bhogapuram International Airport, VisakhapatnamAirport, North Andhra Development, Bhogapuram Aircraft Landing, Bhogapuram EV Buses, Flightconetivity

By
en-us Political News

  
 తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్   నిర్మిస్తున్న  విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో   కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో  టన్నెల్ పైభాగం నుంచి భారీ కొండచరియలు  విరిగిపడ్డా
ది న్యూయార్క్ టైమ్స్ అమరావతి నిర్మాణం, పురోగతి, ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం ప్రచురించింది. దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సామాజిక ఖాతా ద్వారా షేర్ చేశారు.
సర్ కారణంగా తన ఒక్కడి ఓటే కాదు.. బెంగళూరు వ్యాప్తంగా  65 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని ఆధారాలతో సహా ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. 
గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వేదికగా భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయ
హస్తం పార్టీలో కొత్త కాక.. సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..!
ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ పై నిర్వహించనున్న తిరంగా ర్యాలీ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు.
సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..!
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనతో అట్టుడుకుతోంది. మట్టిలో కలిసిపోతున్న ఆశలు, కళ్ళముందే జరుగుతున్న అన్యాయం చూసి కన్నీళ్లు పెడుతున్నారు
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.