మావోయిస్టు గ‌ణ‌ప‌తి జాడ ఎక్కడ?

Publish Date:Apr 12, 2026

Advertisement

మావోయిస్టు అగ్రనేత, మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతికి సంబంధించిన తాజా ఇంటెలిజెన్స్ నివేదికలు, తెలంగాణ డీజీపీ ప్రకటనల ప్రకారం చూస్తే ఆయ‌న  అడ‌వుల్లో మాత్రం లేర‌ని తెలుస్తోంది. ఈ విష‌యం పోలీసులు  ధృవీక‌రించారు కూడా. గత రెండేళ్లుగా ఆయన నేపాల్‌లో రహస్యంగా తలదాచుకున్నారని, అక్కడ ఒక అర్బన్ సేఫ్ హౌస్‌లో ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి.

77 ఏళ్ల   గణపతి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అంటే డయాబెటిస్, కీళ్లనొప్పులు, ఇతర వృద్ధాప్య సమస్యలతో  బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ ఆయనను అడవుల నుంచి బయటకు పంపిందని సమాచారం.  గతంలో గ‌ణ‌ప‌తి ఛ‌త్తీస్ గ‌ఢ్    అడవుల్లో ఉండేవారు. కానీ ఆరోగ్యం క్షీణించడంతో  మొదట బిహార్ మీదుగా నేపాల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన నివాసం ఎక్కడ అనేది ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఆయన త్వరలోనే అధికారికంగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 కాగా కేంద్ర హోం శాఖ, తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్  కి ఆయన కదలికలపై పూర్తి స‌మాచారం ఉన్న‌ట్టు తెలుస్తోంది.  2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గడువు విధించ‌డంతో, గణపతి లొంగుబాటుకు సంబంధించి తెరవెనుక చాలానే చర్చలు జరిగిన‌ట్టు క‌నిపిస్తోంది.  కొన్ని నిఘా వ‌ర్గాల‌ నివేదికల ప్రకారం, ఆయన్ను.. గ‌త కొన్నాళ్ల‌ క్రితమే నేపాల్ నుంచి న్యూఢిల్లీకి తీసుకువచ్చి, నిఘా వర్గాల పర్యవేక్షణలో ఉంచారు.  

తన సోదరుడు రామచంద్రరావు, ఇతర కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గణపతి లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 10, 2026న తెలంగాణ పోలీసులు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు నేతల్లో గణపతి సహా కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. గణపతి కనుక లొంగిపోతే.. ఆయనకు మెరుగైన వైద్యం, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం  భరోసా ఇచ్చింది. అవన్నీ పక్కన పెడితే.. గణపతి ప్రస్తుతం పోలీసు రాడార్ లోనే ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. త్వరలోనే ఆయన లొంగుబాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు 

By
en-us Political News

  
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, టెక్నాలజీ ప్రభావం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎలా చేరుతోందో చూపించే ఆసక్తికర ఉదాహరణ ఇది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో ఓ రైతు పొలం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం—ప్రాణ భద్రత.
అమెరికా విధించిన రెడ్ లైన్స్ వెనుక బలమైన కారణం ఉందన్న జేడీ వాన్స్, ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే, అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచ శాంతికే ముప్పన్నారు.
హైదరాబాద్ వాతావరఖ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. . రానున్న పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నైతొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు.
నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (ఈ3) కార్యక్రమం చేపడతామన్నారు.
బీహార్‌కు చెందిన యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. 2025-26 సంవత్సరాల్లో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, నెటిజన్లు సూర్యవంశీ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అందులో మొదటిది- వైభవ్.. వయసు, పుట్టిన తేదీ వివరాలు. ఇది నెటిజన్లు వేసిన టాప్ క్వశ్చిన్ గా నిలుస్తోంది. కేవలం 13-14 ఏళ్లకే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆడటం వల్ల వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ అనే పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల్లో నిజ‌ముందని తేల్చింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 146 మంది ఎంపీలు లోక్‌సభలో సంతకాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.