నేతల బూతులపై యాక్షన్ ఏదీ?

Publish Date:Feb 20, 2026

Advertisement

వాస్తవ వేదిక తాజా ఎపిసోడ్ లో ఏపీ రాజకీయాల్లో  మారుతున్న పరిణామాలు, నాయకుల దిగజారుడు భాష,   ఎన్టీఆర్, వైఎస్ వంటి నేతల హుందాతనం గురించి  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజా వాస్తవ వేదికలో విశ్లేషణాత్మక చర్చ జరిపారు.  
రాజకీయాల్లో నానాటికీ తీసికట్టుగా మారుతున్న సంస్కారంపై డోలేంద్ర ప్రసాద్  గుర్రానికి, గాడిదకి తేడా ఏంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో గత జగన్ పాలనలో  చోటుచేసుకున్న పరిణామాలు, భాషా ప్రయోగం, రాజకీయాలలో హుందాతనాన్ని తిరిగి తీసుకురావడంలో  ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతలపై పలు సూచనలు చేశారు.  

రాజకీయాల్లో బూతు భాషా ప్రయోగం జగన్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతే పరాకాష్టకు చేరిందన్నారు. గతంలో రోశయ్య, కేసీఆర్ వంటి వారు ఘాటు విమర్శలు చేసినప్పటికీ భాష పరంగా ఎక్కడా దిగజారలేదనీ, అనుచిత పదప్రయోగం చేయాలేదనీ గుర్తు చేశారు.  ఇక జగన్ హయాంలో కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వంటి వారు  వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టులను చదివేవారనీ,  వారు  జగన్ నిలబెట్టిన బొమ్మలు  లేదా  రోబోల వంటి వారు మాత్రమేననీ డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని వైసీపీయులు అవమానించడం వంటి ఘటనలు వైసీపీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని చేకూర్చాయని, ఒక స్త్రీని అవమానిస్తే ఎవరికైనా సరే రాజకీయంగా పుట్టగతులుండవన్నారు.  జగన్ హయాంలో  జరిగిన అరాచకాలు, దాడుల వల్ల విసిగిపోయిన ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారన్నారు. 

 వైసీపీ నాయకుల ఇళ్లపై  టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ పరిపాలనలో దాడులు జరగడం సాధారణం, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అలా జరగకూడదని హెచ్చరించారు. గాడిదకీ, గుర్రానికీ తేడా ఉంది కదా అన్నారు.  వైసీపీ చేసే అరాచకాలనే టీడీపీ కూడా చేస్తే, గుర్రానికి (టీడీపీ)  గాడిద (వైసీపీ) తేడా లేకుండా పోతుందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  
జగన్ తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా చంద్రబాబు అబద్ధాలు కారణమని నమ్ముతున్నారే తప్ప, తన అరాచక పరిపాలన వల్ల ప్రజలు ఓడించారని అంగీకరించడంలేదన్న ఆయన   జగన్ తన పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని మార్చుకోలేరని, ఆయన పద్ధతి మారకపోతే వైసీపీ గ్రాఫ్ పతనం నుంచి పతనానికి దిగజారుతూనే ఉంటుందని విశ్లేషించారు.  అదే సమయంలో ఆయన అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేశారు.   ప్రత్యర్థులపై దాడులు కాదు చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.   బూతులు తిట్టే నాయకులకు కోర్టుల ద్వారా శిక్ష పడేలా చేయాలని చెప్పారు. రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష పడిన ఉదాహరణను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

 రాజకీయ సభలు పెట్టి, వైసీపీ నాయకుల భాషా సంస్కృతిని ప్రజలకు వివరించాలని, రాజకీయాల్లో మేధావులను తిరిగి ఆహ్వానించాలనీ, అలాగే..  టీడీపీ తన పాత పద్ధతిలో కార్యకర్తలతో మమేకం కావాలని, ఎవరో తెలియని  బ్రోకర్ల'మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని సూచనలాంటి హెచ్చరిక సున్నితంగా చేశారు. రాజకీయాల్లో శాంతిభద్రతలు, సభ్యత, సంస్కారం, అభివృద్ధిని ఆశించి ప్రజలు చంద్రబాబును ఎంచుకున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందనీ డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.

వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ను తెలుగువన్ యూట్యూబ్ చానల్ లో ఈ కింది లింక్ ద్వారా చూడండి.

 

By
en-us Political News

  
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.