ప్రశ్న రావణ్ పై ఉపా కేసు.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేనా?

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు, అతనిపై ఉపా  కేసు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యల ఆధారంగా ఏకంగా దేశద్రోహం, తీవ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు పెట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ  ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు    తాజా వ్యాఖ్యలు, హోమ్ శాఖకు ఆయన చేసిన హెచ్చరికలపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ప్రశ్నరావణ్ పై ఉపా కేసు కేవలం..  ఒక యూట్యూబర్ అభ్యంతరకర వ్యాఖ్యలకు పరిమితం కాలేదనీ,  దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రావణ్‌కు ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉపా చట్టాన్ని ప్రయోగించిందని విమర్శలు వస్తున్న వేళ భరద్వాజ..  సాధారణ ఐపీసీ సెక్షన్ల ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఉపా కేసు పెట్టడంతో..  సంవత్సరాల తరబడి జైల్లో ఉంచాలనే కక్ష సాధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. 

ఏపీ ఇంటెలిజజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో కొన్ని వీడియోలు ఎడిట్ చేసినవని, కాంటెక్స్ట్ (సందర్భం) మార్చి రూపొందించిన లింకులను న్యాయస్థానానికి సమర్పించారని ఆయన చెప్పారు. ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే..  న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.

రాజకీయంగా చూస్తే..  ఈ మొత్తం ఎపిసోడ్‌ను జనసేన వర్సెస్ రావణ్ వివాదంగా మార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని భరద్వాజ అన్నారు. టీడీపీ ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తుండగా, జనసైనికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ వివాదాన్ని వైసీపీకి  ముడిపెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రావణ్‌కు జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చి, వైసీపీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 

యూట్యూబ్‌లో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసభ్య పదజాలం వాడటం కచ్చితంగా తప్పే అయినప్పటికీ, చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరైంది కాదని భరద్వాజ అన్నారు. కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోకుండా, సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న అధికార, ప్రతిపక్షాలకు చెందిన అందరు యూట్యూబర్లపై కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ప్రస్తుతం ఈ ఉపా కేసు వ్యవహారం విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలకు దారితీసింది. ప్రభుత్వం చట్టాన్ని ఆయుధంగా మార్చుకుని పౌర హక్కులను కాలరాస్తోందనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  

Youtuber Ravan Arrest, UAPA Case on Ravan, Pawan Kalyan, Chandrababu Naidu, Jagan Mohan Reddy, AB Venkateswara Rao, Journalist Bharadwaj Analysis, AP Politics

By
en-us Political News

  
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.