‘స్థానిక’సుముహుర్తం ఎప్పుడో?

Publish Date:May 14, 2025

Advertisement

జూన్, జూలై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడవు ముగిసనా ఎన్నికలు జరగక పోవడం వలన స్థానిక సంస్థలకు రావలసిన కేంద్ర నిధులు ఆగిపోయాయి. దీంతో కులగణన అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గత ఫిబ్రవరిలో  ప్రభుత్వం  నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి.  అయితే.. తాజా పరిస్థితులను, ముఖ్యంగా హామీల అమలులో జాప్యం కారణంగా ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకతను  గమనిస్తే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించే సాహసం చేస్తుందా? అనే అనుమనాలు వ్యక్త మవుతున్నాయి.    

అవును. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలను, అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఇందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. మంత్రులి సైతం అంగీకరిస్తున్నదే..  ఆ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ  ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఇవ్వడమే కాకుండా.. దానికి అదనపు ఆకర్షణగా వందరోజుల ట్యాగ్ లైన్ జోడించింది. ఇచ్చిన హమీలు అన్నింటినీ వంద రోజులల్లో అమలు చేస్తామని  కాంగ్రెస్ మ్యానిఫెస్టో భరోసా ఇచ్చింది.

అయితే  వందర రోజులు కాదు, రెండు వందలు, మూడు వందలు, నాలుగు, ఐదు వందల రోజులు కూడా వెళ్లి పోయాయి. అయినా ఇంతవరకు హస్తం పార్టీ ఇచ్చిన హామీల్లో అమలు కానీ హమీలదే  పై ‘చేయి’ గావుంది. నిజమే ఇచ్చిన ప్రతి హమీనీ అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుతానికి మాత్రమే కాదు, మరే ప్రభుత్వానికి అయినా అయ్యే పనికాదు. అందుకే ప్రజలు కూడా సహజంగా నూటికి నూరు శాతం హామీలు అమలు అవుతాయని ఆశించరు. అలాగే వంద రోజులంటే వంద రోజుల్లోనే అమలు కావాలని కోరుకోరు. ఎన్నో కొన్ని అయినా అమలు  చేస్తే చాలని అనుకుంటారు.  కానీ  రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కూడా లేదని అంటున్నారు.  

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటిపోయినా.. హామీల అమలు విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కదలిక లేక పోవడంతో సహజంగానే ప్రజలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రతి రోజు వినిపిస్తున్న ప్రవచనాలు హామీలు అమలవుతాయనే ఆశలను పూర్తిగా తుడిచేశాయని  క్షేత్ర స్థాయి సర్వేలు సూచిస్తున్నాయి. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, రాష్ట్రానికి ప్రపంచంలో ఎక్కడా రూపాయి అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రే స్వయంగా  బహిరంగ ప్రకటన చేసిన తర్వాత  వేల కోట్ల రూపాయల విలువైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం  వంద రోజుల్లో కాకున్నా వెయ్యి రోజులకు అయినా అమలు చేస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. నిజానికి  హామీలను చెత్త బుట్టకు ఎత్తడం కోసమే ముఖ్యమంత్రి, ఆర్థిక విలాపం అలపిస్తున్నారనే అనుమనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో... సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అవిశ్వాసం రోజురోజుకు పెరిగి పోతోందని కాంగ్రెస్ వర్గాలే కలవర పడుతున్నాయి.  

ముఖ్యంగా  స్థానిక సంస్థల ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఓటమి భయం గుబులు  రేపుతోందని అంటున్నారు. మరో ఒకటి రెండు నెలలలో (జూన్‌ లేదా జూలై) స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న ఉహాగానాలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళన స్పీడ్ పెరుగుతోందని అంటున్నారు. 

అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని, ఏప్రిల్ 15 జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో  ఆదేశించారు. నిజానికి అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మీనాక్షి నటరాజన్  అనేక సందర్భాలలో గ్రామాలకు వెళ్ళాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అయితే  గ్రాలకు వెళితే  హామీల అమలు కోసం ప్రజలు నిలదీస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఒక విధంగా  క్షేత్రస్థాయి పర్యటనలు ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. 

ముఖ్యంగా సంక్షేమ పధకాలు అన్నిటికీ  మూలాధారం అయిన,రేషన్ కార్డుల విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. గత ఏప్రిల్‌ 21న నిజామాబాద్‌లో జరిగిన రైతు మహోత్సవంలో వ్యవసాయ మంత్రి తుమ్మల స్వయంగా రైతు భరోసా సహాయం విడుదలలో జాప్యాన్ని అంగీకరించారు. చాలా మంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అంగీకరించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. దీంతో, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఇంచార్జి ఆదేశాలను  చాలా మంది నాయకులు  అంతగా పట్టించుకోవడం లేదు. అలాగే  కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర నాయకత్వంతో తమ ఆందోళనలను వ్యక్తిగతంగా తెలిపారు.

ఇటీవల హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను బయటపెట్టారు. పెండింగ్‌ బిల్లుల జాప్యం వల్ల పంచాయతీ కార్యదర్శులు తమ భార్యల బంగారం, మంగళ సూత్రాలను తాకట్టు పెడుతున్నారని మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాయడం గమనార్హం.

అదలా ఉంటే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో ఆ సామాజిక వర్గాలను ఎలా ఒప్పించాలనేది కాంగ్రెస్‌ నాయకులను తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తున్నదని పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించినా అది చెల్లుబాటు అవుతుందా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా లెకింపులో కులగణన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ గణన పూర్తయ్యే వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎలా ముందుకు పోవాలనే చర్చ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సుముహుర్తం పైనా అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.