కేసీఆర్-జగన్ భేటీ ఎప్పుడో..?

Publish Date:Feb 18, 2022

Advertisement

ఎవరి కారణాలు, ఎవరి అవసరాలు వారికి ఉండవచ్చును కానీ, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల సత్తా చూపేందుకు, పశ్చిం బెంగాల్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్, కేసీఆర్ కసరత్తు సాగిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందో, ఆ తర్వాతనో బీజేపీ, కాంగ్రెస్ యేతర ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 20న ముంబై వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాకరేను కలుస్తున్నారు. 

అదలా ఉంటే, ప్రస్తుతానికి ఈ ఉమ్మడి పోరాట ఐక్యతా క్రతువుకు సూత్రధారిగా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, ఎవరెవరినో కలుస్తున్నారు కానీ, పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేతను జగన్మోహన్ రెడ్డి కలవలేదు. దేవేగౌడ్, థాకరేలను టచ్ చేసినట్లుగా కనీసం ఫోనులో అయినా పలకరించ లేదు. కేసీఆర్, దాయాది రాష్ట్రం సీఎం జగన్ రెడ్డిని ఎందుకు కదల్చలేదు?  అనే ప్రశ్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీడియా చర్చల్లోనో చర్చకు వస్తోంది.  ఈ విషయంలో తెరాస నాయకులు నీళ్ళు నములు తున్నారు. ముఖ్యమంత్రి ఒక్కొక్కరినే కలుస్తారని, త్వరలోనే జగన్ రెడ్డిని కూడా కలుస్తారని అంటున్నారు, కానీ, స్పష్టత అయితే ఇవ్వలేక పోతున్నారు. 

అదలా ఉంటే, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే, బీజేపీకి కోపం తెప్పించే సాహసం చేయరని పరిశీలకులు అంటున్నారు. ఓ వంక డజను వరకు అక్రమాస్తులకు సంబదించిన కేసులు జగన్ రెడ్డి మెడమీద వెళ్ళాడుతున్నాయి. మరోవంక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మునక వేయడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ రెడ్డి ముందరి కాళ్ళకు బంధం వేస్తోంది. నిజానికి కేసేఆర్, పరిస్థితి కూడా కొంచెం అటూ ఇటుగా అదే.అయినా కేసీఆర్ దూకుడు పెంచుతూనే ఉన్నారు. అయితే, ఏపీ, తెలంగాణల పొలిటికల్ ఈక్వేషన్స్’లో స్పష్టమైన తేడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అనుదుకే కేసీఆర్’కు యుద్ధం చేయడం మినహా మరో  మార్గం లేదని అంటున్నారు. 

తెలంగాణలో బీజేపీకి ఉన్న వాస్తవ బలం ఎంతైనా, ప్రస్తుతానికి కమలదళం అధికార తెరాసకు సవాలు విసురుతోంది.ముఖ్యంగా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణాలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. కొంచెం వేగంగానే అడుగులు వేస్తోంది. మరోవంక, రాష్ట్రంలో తెరాసకు పెను సవాలుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే, రాష్ట్రంలో ముక్కోణపు పోటీ అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలో చేరితే, తెరాస ఓటమి ఖాయమని, సర్వేలు చెపుతున్నాయి. అందుకే, కేసీఆర్ బీజేపీ బలాన్ని భూతద్దంలో చూపేందుకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్’ గా లోకల్ యుద్దం చేస్తున్నారు. నిజానికి, తెలంగాణలో తెరాస, బీజేపీ వార్, ‘నువ్వొకందుకు పోస్తుంటే, నేనొకందుకు తాగుతున్నాను’ అన్న రీతిగా సాగుతోంది. 

ఇక ఏపీ విషయానికి వస్తే, అక్కడ బీజేపీకి ఉన్నదీ లేదు పోయేదీ లేదు. అందుకే ఏపీ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. పైగా, జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమర్ధిస్తోంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా, దివాలా అంచులకు చేరినా, ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించవలసిన అనివార్య పరిస్థితి తలెత్తినా, చేతనైన మేరకు సాయం చేస్తోందే కానీ, రాష్ట్ర భవిష్యత్ ఏమిటని ఆలోచించడం లేదు. అందుకే, జగన్ రెడ్డి ఇప్పటి కిప్పుడు, బీజేపీని ఎదిరించే సాహసం చేయరని, అంటున్నారు. 

మరోవంక రాష్ట్ర విభజనకు సంబంధించి, ఎనిమిదేళ్ళ తర్వాత  ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పార్లమెంట్’లో (చేసేది ఏమీ లేక పోయినా)  ఏపీ ప్రజల చెవులకు ఇంపుగా సోకే మాటలు మాట్లాడారు. అలాగే, తాజాగా కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్గరి, మరిన్ని పూతలు పూసి పోయారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య,  ఉభయ  రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య దూరం పెంచేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వివాదాల పరిష్కారం పేరిట వివదాల అగ్గి రాజేస్తోంది. ఇవ్వన్నీ, ఒక దానికొకటి సంబంధం లేని విషయాలుగా, అని పించినా, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఏటో ఒక వైపునుంచి ఒక‌ దానితో ఒక‌టి లింకై ఉన్న‌ విషయాలే, అందుకే  జగన్ రెడ్డిని కేసీఆర్ కదిలించ లేదని, కదిలించ లేరని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.