ట్రామా బాండింగ్.. చాలా మందికి తెలియని విషయం ఇది!

Publish Date:Jun 29, 2026

Advertisement

ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు.  రిలేషన్ లో ఉండే ఈ పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు ట్రామా బాండింగ్ అనే పదాన్ని లైఫ్ స్టైల్ నిపుణులు వాడుతూ ఉంటారు.  అయితే నేటి కాలంలో మాత్రం ఈ ట్రామా బాండింగ్ అనేది మానసిక భావనగా మారింది.  చాలామంది తమను మానసికంగా ప్రభావితం చేసే బంధాలలో చాలామంది ఉండిపోతారు. కానీ ఇలాంటి బంధాల నుండి బయటపడటం కష్టంగా ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం,  ఏదైనా అర్థం చేసుకునే తత్వం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. బంధాలలో వాస్తవాన్ని గుర్తించి,  సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలంటే ట్రామా బాండింగ్ ను అర్థం చేసుకోవాలి.  అసలు ట్రామా బాండింగ్ అంటే ఏమిటి?  దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా ఏర్పడుతుంది? దీన్నుండి ఎలా బయటపడాలి లేదా దీనికి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?  తెలుసుకుంటే..

ట్రామా బాండింగ్..

ట్రామా బాండింగ్ అనేది ఒక మానసిక పరిస్థితి. దీనిలో ఒక వ్యక్తి, తమకు మానసిక ఒత్తిడి, బాధ లేదా స్థిమితంగా ఉండలేక పోవడం వంటివి  కలిగించే రిలేషన్ కు  ఎమోషన్ గా  అతుక్కుపోయి ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రేమ, ఆప్యాయత, ఆపై ఆకస్మిక అవమానం లేదా ఎమోషన్ గా దెబ్బ తినడం  అనే ఒక చక్రం ఉంటుంది. ఇది ఆ వ్యక్తిని చిక్కుకుపోయినట్లుగా, గందరగోళంగా భావించేలా చేస్తుంది. క్రమంగా, వారు దానికి అలవాటుపడి, దాని నుండి బయట పడటం కష్టంగా మారుతుంది.

ట్రామా బాండింగ్ ఎలా ఏర్పడుుతంది?

ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేని  సంబంధాలలో సాధారణంగా ట్రామా బాండింగ్ ఏర్పడుతుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. వాటిలో కొన్ని..

రిలేషన్ లో  పదేపదే పాజిటివ్, నెగిటివ్ ప్రవర్తన ఉంటుంది.  ఇవి మారుతూఉంటాయి.  కొన్నిసార్లు చాలా  ప్రేమ కనిపిస్తుంది,   మరికొన్నిసార్లు ఉన్నట్టుండి  దూరం  పెరిగినట్టు లేదా అగౌరవం జరిగినట్టు జరుగుతుంది.

ఎమోషన్ పరంగా బాగా ఎక్కువై ఇతరుల మీద ఆదారపటం,  భయం, ఒంటరితనం, అభద్రతా భావంతో కూడిన వాతావరణం ఉంటుంది.

 ఆత్మగౌరవం క్రమంగా బలహీనపడుతుంది.   భాగస్వామి ద్వారా భావోద్వేగ నియంత్రణ లేదా తారుమారు అవుతుంది.

ట్రామా బాండింగ్ సిగ్నల్స్..

ట్రామా బాండింగ్ ను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
 
 సంబంధాన్ని వదిలిపెట్టలేకపోవడం,   మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్లడం లేదా వెళ్లాలని అనిపించడం.

ప్రతి సమస్యకు తనను తాను నిందించుకోవడం,
 ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం.

 సంబంధంలో ఉన్నప్పటికీ అసంతృప్తిగా , సంతోషంగా లేకపోవడం.  ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా, కేవలం ఆ సంబంధంలోనే లీనమై ఉండటం.

ఎలా బయట పడాలి..

ట్రామా బాండింగ్‌ను అధిగమించడం అంత సులభం కాదు, కానీ సరైన చర్యలతో అది సాధ్యమేనని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు.
 
 మొదట, పరిస్థితిని అంగీకరించాలి. నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం
 మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా కౌన్సిలర్ నుండి సహాయం కోరడం మంచిది.

 ట్రామా బాండింగ్ లో చిక్కుకున్న  వ్యక్తికి క్రమంగా దూరమవ్వాలని.  ఆత్మగౌరవంతో,  ఆత్మవిశ్వాసంతో  పనిచేయాలి.

 తమ కోసం తాము  సురక్షితమైన , సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి.

ట్రామా బాండింగ్ గుర్తించడం ఎందుకు ముఖ్యం..

ట్రామా బాండింగ్ అనేది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిస్థితి, ఇది ఒక వ్యక్తి  మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం , జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన , సమతుల్యమైన జీవితం వైపు పయనించగలుగుతారు.

                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.