మనసులో ప్రేమ ఉంటే సరిపోదు.. ఇలా ప్రేమను వ్యక్తం చేస్తే బంధాలు పదిలంగా ఉంటాయ్!

Publish Date:Jun 30, 2026

Advertisement

ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ చాలా ప్రత్యేకమైనది.  చాలామంది రిలేషన్లో ఉన్నప్పుడు తమ బాగస్వామిని చాలా ప్రేమిస్తుంటారు. కానీ ఏదైనా సందర్బం వస్తే నువ్వు నన్ను ప్రేమించడం లేదు అనే మాటను ఎదుర్కుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే.. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయకపోవడం వల్ల.  ప్రేమించడం గొప్ప కాదు.. కానీ ప్రేమను సరైన విదంగా వ్యక్తం చేయకపోవడం వల్లే అసలైన సమస్య వస్తుంది. ప్రేమను సరైన విధంగా వ్యక్తం చేస్తే ఆ బంధాలు ఎంతో పదిలంగా పదికాలల పాటు సంతోషంగా ఉంటాయి.  బంధాలను బలంగా మార్చుకోవడానికి ప్రేమను వ్యక్తం చేసే పద్దతులు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే..

మనసులో కాదు.. మాటల్లో చెప్పాలి..

ప్రేమను మనసులో దాచుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కొంతమందికి ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలే మంచి ఆయుదం.

“నాకు నీ పట్ల గర్వంగా ఉంది”, “నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి”, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” వంటి చిన్న వాక్యాలు కూడా ఎదుటి వారి హృదయాన్ని టచ్ చేస్తాయి.

 భాగస్వామి  తమ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరుస్తుంటే, వారిని మెచ్చుకోవడం, వారి ప్రయత్నాలను అభినందించడం, ప్రేమ సందేశాలు పంపడం వంటివి ఆ బంధాన్ని బలపరుస్తాయి.
ఇలాంటి వ్యక్తులు విమర్శలను కూడా మరింత లోతుగా తీసుకుంటారు, కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు పాజిటివ్  పదాలను ఎంచుకోవడం ముఖ్యం.

సమయం..

కొంతమందికి ప్రేమను వెలిబుచ్చడానికి  అత్యంత విలువైనది వారి సమయం. వారికి ఖరీదైన బహుమతుల కంటే, ఎలాంటి ఆటంకం  లేకుండా వారితో సమయం గడపడమే ముఖ్యం.

ఫోన్‌ను పక్కన పెట్టి మాట్లాడుకోవడం, కలిసి నడవడం, కాఫీ డేట్‌కు వెళ్లడం లేదా కేవలం కలిసి కూర్చుని ఆ రోజు జరిగిన సంఘటనలను షేర్ చేసుకోవడం వంటివి కొందరికి   చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి వారికి, లైప్ పార్ట్నర్ ఉనికే చాలా పెద్ద బహుమతి.

స్పర్శ..

చాలా మంది కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం లేదా భుజంపై చేయి వేయడం వంటి టచింగ్  ద్వారా ప్రేమను అనుభూతి చెందుతారు. ఒకరినొకరు స్పృశించుకోవడం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు, భావోద్వేగ భద్రత , అనుబంధం కూడా ఇందులో భాగమే.

అలాంటి వ్యక్తులు ప్రేమతో కూడిన టచింగ్ ను  పొందినప్పుడు, వారు తమ సంబంధంలో మరింత భద్రతగా, అనుబంధంగా , సంతోషంగా ఫీలవుతారు.

మెమరీస్..

బహుమతులు ఇష్టపడేవారు బయటి విషయాలలోనే ప్రేమను చూస్తారని  చాలామంది తరచుగా అనుకుంటారు, కానీ ఈ నమ్మకం ఎప్పుడూ సరైనది కాదు. ఇది కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం.  ఇందులో  బహుమతి ధర ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న భావనే ముఖ్యం.

ఒక చిన్న పువ్వు, ఇష్టమైన చాక్లెట్, లేదా ప్రయాణం నుండి తెచ్చుకున్న ఒక చిన్న గిఫ్ట్  కూడా వారికి చాలా ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఇది  వారి గురించి ఆలోచిస్తున్నారని, వారిని గుర్తుంచుకుంటున్నారని  వారికి తెలియజేస్తుంది.

సహాయం..

కొంతమందికి, “నేను నీకు సహాయం చేస్తాను” అని చెప్పడం కంటే, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.   భాగస్వామి సహాయానికి లేదా సపోర్ట్ ఇవ్వడానికి  విలువ ఇస్తే, వారికి చిన్న చిన్న పనులలో సహాయం చేయడం, వారి బాధ్యతలను తేలికపరచడం లేదా అవసరమైనప్పుడు సపోర్ట్  ఇవ్వడం వంటివి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నారనే భావనకు గురి చేస్తాయి. వారికి మాటల కన్నా చేతలే గొప్పవి.

కష్టసమయాలలో..

ప్రతి సంబంధం కేవలం సంతోషకరమైన క్షణాలపై మాత్రమే ఆధారపడి ఉండదు.  కష్ట సమయాల్లో ఒకరికొకరు మానసికంగా  అండగా ఉండటం కూడా అంతే ముఖ్యం. తమ మాటలను ఎలాంటి జడ్జ్ చేయకుండా  విన్నప్పుడు, వారి భావాలను అర్థం చేసుకున్నప్పుడు,  కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచినప్పుడు, కొంతమంది తాము ప్రేమించబడ్డామని భావిస్తారు. అలాంటి వారికి ఏ బహుమతి లేదా ప్రేమను వ్యక్తపచడానికి స్పెషల్ గా వేరే ఏ పని చేయకపోయినా , ఎమోషనల్ సందర్భాలలో మద్దతుగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది.

ప్రేమను ఎలా గుర్తించాలి?

 ఎక్కువ ప్రేమగా అనిపించే విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.  భాగస్వామి తరచుగా ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారో గమనించాలి.   ఏది లోపించిందని అనిపిస్తుందో, ఏది మిమ్మల్ని బాధపెడుతుందో అది కూడా ఒక సంకేతం కావచ్చు.  నిష్కపటంగా మాట్లాడాలి , ఒకరి ఎమోషన్ సపోర్ట్ ను  మరొకరు అర్థం చేసుకోవాలి.

                                *రూపశ్రీ.

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.