దావోస్ లో కేటీఆర్, జగన్ భేటీ.. చీకటి ఒప్పందాల కోసమేనా?!

Publish Date:May 24, 2022

Advertisement

దావోస్ వేదికగా కేటీఆర్, జగన్ ల భేటీ రాజకీయ వర్గాలలో పెద్ద ఆశ్చర్యం కలిగించదు కానీ.. సామాన్య జనం మాత్రం ఇదేదో ఎనిమిదో వింత అన్నట్లు నిబిడాశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. జగన్, కేటీఆర్ లు అంత ఆత్మీయంగా పలకరించుకోవడమేమిటి? అని నిర్ఘాంత పోతున్నారు. నిన్న గాక మొన్న ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో కేటీఆర్ హైదరాబాద్ వేదికగా ఒక బిజినెస్ సదస్సులో కుండ బద్దలు కొట్టారు.

దానిపై వైసీపీ నేతలు, మంత్రులు భగ్గుమన్నారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ అని నిలదీశారు. తెలంగాణలో కంటే ఆంధ్రలోనే అభివృద్ధి భేషుగ్గా ఉందని దబాయించారు. ఎన్నికల ముందు ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంటును మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలోనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్, వైసీపీలకు ప్రజలలో ఆ సెంటిమెంట్ సజీవంగా ఉండటం అవసరం కనుకనే ఇరు పార్టీలూ కూడబలుక్కునే ఈ వివాదాన్ని లేవనెత్తయని అప్పట్లోనే రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. ఆతరువాత అంతా మామూలే. ఇప్పుడు దావోస్ వేదికగా టీఆర్ఎస్, జగన్ లు కలవడం అందుకే రాజకీయ వర్గాలలో పెద్దగా చర్చ జరిగే అవకాశం లేదు. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై, ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపిస్తుండటం... అలాగే కేంద్రం కూడా తెలంగాణ పట్ల ఒకింత వ్యతిరేక ధోరణి కనబరచడం, అదే సమయంలో కేసీఆర్ అవినీతి కోట బద్దలౌతోందనీ, ఆయన త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమనీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు బండి పదే పదే సభలు, సమావేశాలలో చెబుతుండటంతో ఏదో జరగబోతోందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.

అలాగే కేంద్ర ఆర్థిక శాఖలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేసీఆర్ అవినీతి, అక్రమాలపై సీబీఐ, ఈడీ దృష్టి సారించాయి. ఈ సమాచారం కేసీఆర్ కు కూడా లీక్ కావడంతోనే ఆయన నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారని ఆ వర్గాల భోగట్టా. ఈడీ సోదాల నుంచీ, సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకోవడమెలా అన్న విషయంపై కేసీఆర్ జగన్ సలహా, సూచన తీసుకోవాలని నిర్ణయించుకున్నారనీ, ఏపీ, తెలంగాణలలో జగన్ తో భేటీ అయితే జనాలకు తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశాలున్నాయన్న శంకతోనే ఈ భేటీ వేదికను దావోస్ ఎంపిక చేసుకున్నారంటున్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున సిఫారసులతో కేటీఆర్ దావోస్ కు ఆహ్వానం అందేలా చేసుకున్నారనీ అంటున్నారు.

ఈ సలహా, సూచనలకు  జగనే ఎందుకంటే అన్న ప్రశ్నకు కూడా పరిశీలకులు విశ్లేషణాత్మక వివరణలు ఇస్తున్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ విచారణలను ఎదుర్కొంటున్న జగన్ వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, విచారణ జాప్యం అవ్వడానికి ఏం చేయాలి అన్న విషయంలో విలువైన సహకారం అందించగలరన్నది కేసీఆర్ నమ్మకంగా చెబుతున్నారు. అందుకే జగన్ తో భేటీకి కేటీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారని అంటున్నారు.

కేసీఆర్ అడగ్గానే జగన్ కేటీఆర్ తో భేటీకి అంగీకరించడానికి కూడా కారణముందంటున్నారు. గత ఎన్నికలలో ఏపీలో జగన్ అధికారంలోనికి వచ్చేందుకు అన్ని విధాలుగా కేసీఆర్ ‘సహాయ సహకారాలు’ అందించడంతో ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ కారణంతోనే జగన్, కేటీఆర్ లు ఇరువురూ కూడా దావోస్ లో పెట్టుబడుల వేట కంటే పరస్పర భేటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొంటున్నారు.   

By
en-us Political News

  
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.