Publish Date:Jun 24, 2022
పిలవని పేరంటానికి తగుదునమ్మా అంటూ వెళ్లినట్లైంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ అడగకపోయినా బేషరతు మద్దతు ప్రకటించేసి వైసీపీ గిరిజన మహిళ కు మద్దతు ఇచ్చేశామంటూ సంబరపడిపోతోంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇచ్చే విషయంలో రాష్ట్రానికి ఎంతో కొంత సాధించుకునేందుకు ప్రయత్నించాలన్న కనీస ప్రయత్నం కూడా జగన్ చేయకపోవడంపై పరిశీలకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పట్టుపట్టకపోయినా కనీసం అడిగే ధైర్యం కూడా చేయలేని జగన్ అసలు బీజేపీ నేతలకు కానీ, కేంద్రం కానీ ఎక్కడా బహిరంగంగా మద్దతు ఇవ్వాలని వైసీపీని అడిగిన దాఖలాలు లేవు. తనంత తానుగా మద్దతు ప్రకటించేసి ఘన కార్యం చేసినట్లు తన భుజాలను తానే తడిమేసుకుంటున్నారు జగన్. ఎన్డీయే నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ.. కేంద్రం నుంచి ఎవరూ జగన్ ను కోరలేదు. కనీసం ఆయన హస్తినలో పర్యటించిన సందర్భంలో ఆయన కలిసిన మంత్రులెవరూ కూడా కనీసం ఈ ప్రస్తావన తీసుకురాలేదు.
దీనిని బట్టే కేంద్రం వైసీపీకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో అవగతమౌతుంది. కేంద్రం సంగతి ఎలా ఉన్నా వైసీపీ తనంత తానే రాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కేంద్రానికి ఎంతో కీలకమని ప్రకటనలు చేసుకున్నారు. దాంతోనే విపక్షాలు, పరిశీలకులూ కూడా జగన్ తమ కీలక మద్దతు ప్రకటించడానికి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఏమైనా సాధించుకునేందుకు ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే జగన్ కు అంత సీన్ లేదన్న వాదనలూ చేశారు. చివరికి జగన్ స్వయంగా తనకు అంత సీన్ లేదని ముర్ము అభ్యర్థిత్వానికి ఎవరూ అడగకుండానే బేషరతు మద్దతు ప్రకటించేసి రుజువు చేసుకున్నారు. గతతెలుగుదేశం ప్రభుత్వం అటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా… బయటకు వచ్చినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో పోరాడింది. అందుకు భిన్నంగా జగన్ బలమున్నా వైసీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాకపోయినా కనీసం నోరెత్తడానికే భయపడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-the-reason-for-jagn-cancil-delhi-tour-39-138308.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!