షిక్కటి చిరునవ్వుల మర్మమేంటి?..ష్ గప్ చుప్!

Publish Date:Sep 29, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెదవుల మీద చిరు నవ్వు చెరగదు. కానీ, ఆ చిరు నవ్వుల వెనక, ఏమి దాగుంది? అ నవ్వుల మర్మం ఏమిటి అనేది   కొద్ది మందికి తప్ప అందరికీ అర్ధమయ్యే విషయం కాదు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు  ఆయన రక్త సంబంధీకులు, బంధు వర్గమే. జగన్ చిరునవ్వుల వెనక ఎలాంటి కుట్రలు, కుయుక్తులు  పురుడు పోసుకుంటున్నాయో గుర్తించ లేమని అంటారు. అది బాబాయ్ మర్డరే, అయినా, తల్లీ చెల్లిని ఆర్థికంగా, రాజకీయంగా సైలెంట్ గా దెబ్బ తీయడమే అయినా  జగన్ రెడ్డి  తన చేతికి  మరకలు అంటకుండా నవ్వుతూనే కానిచ్చేశారని చెబుతున్నారు.

అలాగే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ  రాష్ట్రంలో వీస్తున్న  చంద్రబాబు ప్రభంజనాన్ని ఎదుర్కునేందుకు జగన్ రెడ్డి మరో మారు సైలెంట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు సైతం అనుమానిస్తున్నాయి. అందులో భాగంగానే చిరునవ్వులు చిందిస్తూనే, తెలుగు దేశం పార్టీ  జాతీయ అధ్యక్షడు,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రజలలో తిరగకుండా చేసేందుకు జగన్ రెడ్డి  కుట్రలకు  తెర తీశారని అంటున్నారు. ఆ కుట్రలో భాగంగానే  చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందని, అలాగే, ఆయన్ని జైలుకే పరిమితం చేసే కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. 

అదలా ఉంచితే ఓ వంక చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంటే, మరో వంక జగన్ రెడ్డి ఇటు అసెంబ్లీలో అటు ప్యాలెస్ లో గుట్టు చప్పుడు కాకుండా, గప్ చుప్’గా తమ పొలిటికల్ అండ్ పర్సనల్ అజెండాలను ముందుకు తీసుకుపోతున్నారని అంటున్నారు. 

 ముందుగా అసెంబ్లీ తంతు విషయానికి వస్తే  సమావేశాలు మొదలైన రోజునే  పొమ్మన కుండా పొగ పెట్టి తెలుగు దేశం సభ్యులను బయటకు పంపి  అడ్డు తొలగించుకున్నారు. ఇక అక్కడి నుంచి, సభ్యత, సంస్కారం, సభా మర్యాదలను పక్కన పెట్టి, చంద్రబాబు సహా సభలో లేని సమాధానం చెప్పుకునే అవకాశం లేని సభ్యులను ఉద్దేశించి ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. సభలో లేనివారిపై ఆరోపణలు కూడదన్న సభా నియమాలను పూర్తిగా తుంగలోకి తొక్కారు. జగనన్న మెప్పు కోసం మంత్రి రోజా, మరి కొందరు జగన్ ను ఇద్రుడు చంద్రుడు అని ఆకాశానికి ఎత్తేశారు.  జబర్దస్త్’ రోజుల నుంచీ  రోజాకు అది  అలవాటైన విద్యే అనుకోండి. సరే అది పక్కన పెడితే.. 

 ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ రెడ్డి గప్ చుప్ గా గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగుల మెడకు ఉచ్చు బిగించారు. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున ఆమోదించిన జీపీఎస్‌ బిల్లులో  33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించ వచ్చనే నిబంధన వచ్చి చేరింది, అంటే, వయసుతో సంబంధం లేకుండా 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను మెడ పట్టి బయటకు గెంటే విధంగా  కంపల్సరీ రిటైర్మెంట్  క్లాజును తీసుకొచ్చింది. నిజమే, సెంట్రల్‌ సివిల్‌ సర్వీస్‌ పెన్షన్‌ నిబంధనలతోపాటు రివైజ్డ్‌ స్టేట్‌ పెన్షన్‌ రూల్స్‌-1980లోని 44వ నిబంధన ప్రకారం... ఉద్యోగులకు 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించవచ్చు,

అయితే ఇంత కాలం కేవలం కాగితాల్లో మాత్రమే ఉన్న నిబంధనను  తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయంలో నానా యాగీ చేసిన జగన్ రెడ్డి ఇప్పడు గుట్టు చప్పుడు కాకుండా,  జీపీఎస్‌ బిల్లులో చేర్చారు. నిజానికి అధికారంలోకి వచ్చిన  వారం రోజుల్లో   సీపీఎస్‌  రద్దు చేస్తామని మాటిచ్చి ఇప్పడు జీపిఎస్ బిల్లు తీసుకురావడమే  ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవడం. అలాంటిది, అందుకు అదనంగా ఇప్పడు .. వయసుతో పనిలేకుండా ఉద్యోగుల  మెడ మీడకు  సర్వీసు కత్తిని తెచ్చారు.

మరో వంక  ఎవరికీ తెలియకుండా  ఎవరికీ  చెప్ప కుండా ఛార్టర్డ్ ఫ్లైట్ లో దిగిన  వివాదస్పద పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి  జగన్ రెడ్డి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. ఎలాంటి అధికారిక హోదాలేని ఆయనకు... పోలీసు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసింది. తాడేపల్లి ప్యాలెస్ ఆయనకు విందు ఏర్పాటు చేసింది. సుమారు రెండుగంటలకు పైగాన అయన ప్యాలెస్ లో  ఉన్నారు. ఏ అధికార హోదా లేని ఒక వ్యాపార వేత్తకు ప్రభుత్వం రాచ లాంఛనాలతో స్వాగతం పలకడం ఏమిటి?  ఆయనతో ఏమి చర్చించారు?  దీపం ఉండగానే  ఇల్లు చక్కపెట్టుకునే ఉద్దేశంతో అధికారంలో ఉండగానే,  ఆదానీకి మరిన్ని మేళ్ళు చేసేందుకు జగన్ రెడ్డి సిద్డమయ్యారా? అనే సందేహాలు పరిశీలకుల్లో  వ్యక్త మవుతున్నాయి.

చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్రం, దేశం మొత్తం  అదే విషయంపై దృష్టిని కేద్రీకరించిన సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే  జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని మింగేసే  పెద్ద స్కెచ్ ఏదో వేసినట్లే  అనుమానించ వలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. అవును  ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో సభా నాయకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నవ్వులు చిందించారు  కానీ  పెదవి విప్పలేదు ఒక్క మాట మాట్లాడ లేదు. అందుకే ఈ చిరు నవ్వుల  మర్మమేమీ, అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది ? అదే ఇప్పడు రాష్ట్రం ముందున్న  పెద్ద ప్రశ్న.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.