లోకేశ్ ప్రమోషన్ ఇప్పట్లో లేనట్లేనా?.. నారా, నందమూరి ఫ్యామిలీ మీటింగ్ సంకేతమేంటి?

Publish Date:Mar 28, 2026

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఈ టర్మ్ పూర్తి చేస్తారా?
ఆయన ముఖ్యమంత్రి గా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని భావించి ఓట్లు వేసిన వారి నమ్మకాన్ని వమ్ము చేస్తారా? 
బయట ప్రచారం జరుగుతున్నట్టు పుత్రవాత్సల్యంతో కుమారుడికి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తారా?
అందుకు కూటమి లో ఆమోదం లభిస్తుందా? ముఖ్యంగా జనసేన అధినేత పవన్ ఆయన అనుచర వర్గం స్పందన ఎలా ఉంటుంది? 
అసలు ఈ ఆలోచనకు ఎక్కడ పునాది పడింది? 
ఇంటి నుంచే లోకేష్ ని సిఎం చెయ్యాలని ఒత్తిడి ఉంటే చంద్రబాబు కుటుంబ సభ్యులకు వాస్తవ పరిస్థితులు చెప్పి వారిని ఒప్పించగలరా? అసలు లోకేష్ ఎలా స్పందిస్తారు? 
 ఇదే విషయం పై చంద్రబాబు కుటుంబం సమావేశం కానుందని తెలుస్తోంది. అదే నిజమైతే చంద్రబాబు ఇంట ఎవరి మాట నెగ్గబోతోంది.

ఎవరు అవునన్నా, కాదన్నా నారా వారి రాజకీయ వారసుడు లోకేశ్ అన్నది ఓపెన్ సీక్రెట్టే. భవిష్యత్తులో పార్టీ అధ్యక్షుడిగా, సీఎం అభ్యర్ధిగా ఫోకస్ అవుతున్న నారా లోకేశ్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం కీలక బాధ్యతలు లోకేశ్‌కు కట్టబెడుతుండటం, ఆయన కూడా వాటిని సమర్ధంగా నిర్వహిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు లోకేశ్ పాలనా దక్షతపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు, లోకేశ్‌ల వ్యూహాత్మక సమావేశాలు హైలెట్ అవుతున్నాయి.  ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలతో రాజకీయ వ్యూహాలు, ప్రజా సమస్యలు, పాలనాపరమైన అంశాలుపై   చర్చలు జరుపుతుంటే.. మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ కొత్త రూట్ ఎంచుకున్నారు.

 ఆత్మీయ కలయిక పేరుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వారి కుటుంబ సభ్యులతో సహా తన నివాసానికి ఆహ్వానించి లోకేష్ విందు ఇస్తున్నారు. ఇది కేవలం భోజనానికో, మర్యాదకో పరిమితమైన సమావేశం కాదని, రాజకీయాల్లో లోకేశ్ కుటుంబ పెద్ద  పాత్ర పోషిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు  అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీలు ఎవరికీ అంతుపట్టవు. ముందు నుంచి ఆయన నందమూరి,నారా కుటుంబాల్లోని వారికి రాజకీయంగా పెద్ద పీట వేసిన పరిస్థితులు కనిపించవు. ఎన్టీఆర్ తదనంతరం నందమూరి హరికృష్ణ ఎమ్మెల్యేగా, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో చైతన్యరథ సారథిగా శ్రమించిన హరికృష్ణకు అప్పట్లో సముచిత ప్రాధాన్యత లభించిందని టీడీపీ శ్రేణులు కూడా హ్యాపీ అయ్యాయి. 

కట్ చేస్తే  2014 ఎన్నికల నాటికి .. బావ వాక్కే బ్రహ్మ వాక్కు.. అంటూ ప్రత్యక్షరాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణ.  అన్న ఎన్టీఆర్ నటవారుసుడి పొలిటికల్ ఎంట్రీని టీడీపీ మొత్తం స్వాగతించింది. హిందూపురం నుంచి వరుసగా మూడో సారి గెలిచి, హిందూపురం అభివృద్దిలో తనదైన మార్క్ చూపిస్తూ బాలయ్య యాక్టర్ కమ్ పొలిటీషియన్‌గా సక్సెస్ అవుతున్నారు. అనుకుంటే ఏ పదవి అయినా అధిరోహించగలిగే బాలయ్య, హాట్రిక్ ఎమ్మెల్యే అయినా, ఏనాడు మంత్రి పదవి ఆశించలేదు. తన నట జీవితానికి ఆటంకం కలగకుండా, రెండు పడవల ప్రయాణాన్ని బ్యాలెన్స్‌డ్‌గా కొనసాగిస్తున్నారు.

ఇక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో పొలిటికల్ లీడర్ నారా లోకేష్. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో ఎమ్మెల్సీగా మంత్రి పదవి దక్కించుకుని లోకేశ్ ఒకింత విమర్శల పాలయ్యారు.2019లో మంగళగిరి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో వైసీపీ వారికి తీవ్రస్థాయిలో టార్గెట్ అయ్యారు. అయితే ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. గత ఎన్నికల ముందు యువగళం పాదయాత్రతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం తెచ్చారు. తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేసి ఘన విజయంతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా.. ప్రస్తుతం తనదైన పనితీరుతో టీడీపీ భవిష్యత్తు నాయకుడిగా ఫోకస్ అవుతున్నారు. పార్టీలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఏంటన్న ప్రశ్నకు దీటుగా బదులిస్తున్నారు. ఇలాంటి తరుణంలో లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవడానికి నారా, నందమూరి ఫ్యామిటీ మీటింగ్ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. భువనేశ్వరి లోకేశ్‌ను తన తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబు  స్థానంలో చూడాలని గట్టిగా కాంక్షిస్తున్నారంట. 

అయితే రాజకీయ పరిస్థితులు క్షుణ్ణంగా అధ్యయనం చేసే చంద్రబాబునాయడు తన వారసుడి విషయంలో పాజిటివ్‌గా ఉన్నా..  ఇప్పటికిప్పుడు రాజకీయంగా ప్రమోట్ చేయడానికి మాత్రం రెడీగా లేరంట. అయితే  లోకేశ్‌ను సీఎం పీఠం ఎక్కించడానికి టీడీపీ అధినేత సిద్దమవుతున్నారని.. సడన్‌గా ప్రచారం మొదలైంది. దానివెనుక వైసీపీ నేతలున్నారా? జనసైనికుల్లోనే కొందరు రాంగ్ ట్రాక్ లోకి వెళ్లారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తమ సేనాని పవన్‌కి ముఖ్యమంత్రి పీఠం దక్కాలని జనసైనికులు అక్కడకక్కడా వాయిస్ పెంచుతున్నారు. పవన్ అభిమానులుగా వారలా ఆశించడంలో తప్పులేదు కాని, వైసీపీలోని కాపు నేతలు కొందరు తమ సామాజికవర్గం నేతే ముఖ్యమంత్రి అవ్వాలని డిమాండ్ చేస్తుండటం.. ఈ వ్యవహారంలో వైసీపీ పాత్రపై వ్యక్తం అవుతున్న సందేహాలకు ఊతమిస్తోంది.

వాస్తవానికి పవన్, లోకేశ్‌లు పూర్తి సమన్యయంతో ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. పవన్ తన పెద్దన్న అని లోకేశ్ ఆయన పట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. మొన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ భూమి పూజ కార్యక్రమంలో పవన్ సైతం లోకేశ్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు వర్షం కురింపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 
మరోవైపు నందమూరి బాలకృష్ణ ఇంటి అల్లుడైన నారా లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తే నందమూరి ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు ఉండవు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో? అన్న భావనతో ..  లోకేశ్‌ను సీఎంగా చేయాలని భువనేశ్వరి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మరెంత వరకు నిజమో కాని, ఇప్పటికిప్పుడు లోకేశ్‌ని అందలం ఎక్కిస్తే .. జరగబోయే పరిణామాలు అపర చాణక్యుడు చంద్రబాబునాయుడికి తెలియందేమీ కాదు. వైసీపీ ట్రాప్‌లో పడి జనసేన నేతలు కొందరు .. కూటమి అభీష్టానికి భిన్నంగా అభిప్రాయాలు వినిపిస్తున్నారని సీఎంకి ఇంటర్నల్ నివేదికలు అందాయంట. మరో పదిహేనేళ్లు అధికారంలో ఉంటామని కూటమి పెద్దలు ధీమాతో కనిపిస్తున్నారు. కూటమి ఐక్యత కొనసాగితే తమకు కష్టమేనని భావిస్తున్న వైసీపీ, ఆ పార్టీల ఐక్యతను విచ్చిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నదన్న ఆరోపణులున్నాయి. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పాలన సజావుగా సాగిపోతున్న క్రమంలో పరిణామాలు మారితే.. ఆ ప్రభావం ఢిల్లీలో కూడా రిఫ్లెక్ట్ అయి.. మైత్రిబంధానికి ముప్పు ఏర్పడే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జరగబోయే పరిణామాలను గ్రహించిన చంద్రబాబునాయుడు.. తాను ముఖ్యమంత్రిగా కొనసాగితేనే, కేంద్ర సహకారంతో రాష్ట్రం గాడిలో పడుతుందని భావిస్తున్నారు. ఎలాగూ లోకేశ్‌ నాయకత్వ పటిమపై పార్టీలో పూర్తి విశ్వాసం వ్యక్తం అవుతుండటంతో, ఆయన విషయం భవిష్యత్తు చూసుకుందాం అని స్ఫష్టం చేయడానికే ప్యామిలీ మీటింగ్ పెట్టారంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఎలాంటి ఆలోచనల పెట్టుకోవద్దని కుటుంబసభ్యులకు స్పష్టం చేయనున్నారంట.

By
en-us Political News

  
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.