అమ్మానాన్నకు ప్రేమతో..
Publish Date:Mar 30, 2026
Advertisement
తల్లిదండ్రులయందు దయలేని పుత్రుండు పుట్టనేమీ వాడు గిట్టనేమి అంటారు. అలాంటి పుత్రులను సమాజం వెలివేయాల్సిందిగా తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి. తల్లిదండ్రులను సరిగా చూసుకోని ఉద్యోగుల తోక కత్తిరించేలా ఒక బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు పాటలు, కథలు, ఇతరత్రా మోరల్ స్టోరీస్ చెప్పగా.. వారందరిలోకీ ఓ ముగ్గురు సభ్యులు చెన్నినవి బాగా ఆకట్టుకున్నాయి. వీరందరిలోకీ సీఎం చెప్పిన మోరల్ స్టోరీస్ హైలెట్ అయ్యాయి. అందులో మొదటిది అశ్వారావు పేట ఎమ్మెల్యే ఆదినారాయణ పాడిన పాట బాగా ఆకట్టుకుంది. తర్వాత మంత్రి కొండా సురేఖ కూడా ఒక ముస్లిం మహిళ దీన గాథ చెప్పి కన్నీళ్లు తెప్పించారు. పిల్లలుండీ ఆ మహిళ రోడ్డున పడ్డ విధంపై సురేఖ తన స్వీయ అనుభవాలను వెల్లడించడం సైతం హృద్యంగా అనిపించింది. ఇక సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని చండ్రరాజేశ్వరరావు తాను నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమం గురించి చెప్పారు. చివరి గా సీఎం రేవంత్ రెండు నీతి కథలను వివరించారు. వాటిలో శ్రవణకుడి కథ ఒకటి. శ్రవణ కుమారుడు తన అంథ తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ వెళ్లి తీర్ధయాత్రలు చేశాడనీ.. ఆ సమయంలో ఒక చోట ఆగి ఆయన నీళ్లు ముంచుకుంటుండగా.. దశరథ మహారాజు వన్య మృగంగా భావించి.. వదిలిన బాణంతో అతడి ప్రాణం పోయిందనీ.. దీంతో ఆ అంథ తల్లిదండ్రులు దశరథ మహారాజును శపిస్తారని వివరించారు. తల్లిదండ్రుల కోసం శ్రవణ కుమారుడిలా ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లల్ని బహుశా ఈ కాలంలో చూడలేమన్నారు రేవంత్ రెడ్డి. ఇక ఆధునిక కాలానికి వస్తే.. కంప్లీట్ మెన్ రేమండ్స్ అనే నినాదంతో విజయపథంలో దూసుకెళ్లిన విజయ్ పథ్ సింఘానియా ఉదంతం. సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయన తన కుమారుడు గౌతమ్ సింఘానియాకు రాసిచ్చాక.. పడ్డ పాట్లు వర్ణనాతీతంగా వర్ణించారు ముఖ్యమంత్రి. అన్నీ తన కొడుకుకు ఇచ్చేశాక.. ఆయన రోడ్డుపై పడ్డారనీ.. చివరికి తనకు నిలువ నీడ లేక అద్దె కొంపలో బతకాల్సి వచ్చిందనీ అన్నారు.. అందరూ ఉండి అనాథలా సింఘానియా మార్చి 28న మరణించారన్నారు. తనలా అన్నీ పిల్లలకు ఇచ్చేసి దీన స్థితి కొని తెచ్చుకోవద్దని తల్లిదండ్రులందరికీ సూచిస్తూ ఆయన ఏన్ ఇన్ కంప్లీట్ లైఫ్ అనే పుస్తకం రాసినట్టుగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రెండు కథల స్ఫూర్తితో తాము నేడు వృద్ధ తల్లిదండ్రుల కోసం ఒక బిల్లు తెస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. తనకు తెలిసిన ఒక ప్రజా ప్రతినిథి తండ్రి క్యాన్సర్ కారణంగా మరణించారనీ.. ఆయన్ను కూడా వారి పిల్లలు సరిగా చూసుకోలేదని అన్నారు సీఎం. గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. ఒకరు కాకుంటే మరొకరు ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండేవారు. కానీ నేటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావడంతో పాటు.. కుటుంబ నియంత్రణ అమలయ్యి.. చిన్న కుటుంబాలుగా తయారయ్యాయి. వాటిలోనూ కొడుకు కూతురు సమానమంటారు. కొందరు కొడుకులు చూస్తే తల్లిదండ్రులను బతికి ఉండగానే కాటికి పంపించేస్తున్నారు. మరి కొందరు అనాథాశ్రమాల పాలు చేస్తున్నారు. ఇక కూతుళ్లుంటే వారికి ఎంత ప్రేమ ఉన్నా మెట్టినింటి బాధ్యతలతో తల్లిదండ్రులను చూసుకోలేక పోతున్నారు. కాబట్టి వృద్ధ తల్లిదండ్రుల జీవిత చరమాంకం సరిగా ఉండేలా తామీ బిల్లు తీసుకొచ్చినట్టు ఎంతో భావోద్వేగంగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. అలాగని ఈ చట్టంతోనే అన్ని సమస్యలు తీరిపోతాయని తాము చెప్పడం లేదని.. కాకుంటే సమాజం పట్ల తమ బాధ్యతగా ఈ బిల్లు తెస్తున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి.
http://www.teluguone.com/news/content/telangana-government-bill-45-216380.html





