ఎన్ఐఏ విస్తరణ ఆంతర్యమేంటి?.. కోడికత్తి కేసు గతేంటి?

Publish Date:Oct 28, 2022

Advertisement

తిట్టించడానికి, కొట్టడానికి మనుషులుండాలి.. అప్పుడే రాజుగారికి ఆనందం, చేతులకు మట్టి అంటకుండా చితక్కొ ట్టించేయచ్చు, మరీ ఆసక్తి కలిగితే ఊచలూ లెక్కపెట్టించొచ్చు.  ఖర్చులేకుండా అనుకున్న పనులు చేయించేయవచ్చు. అలాంటి మహత్తర ఆలోచన ఈ ఆధునిక కాలంలో బీజేపీ వారికే వచ్చింది. ఎవరు పడితే వారు తమ మీదా, పార్టీ మీద విరుచుకుపడకుండా, తిట్టుకోకుండా చెప్పిన మాట వింటూ పడి ఉండేలా చేసుకోవడానికి ఎన్ ఐ ఏ సంస్థను జేబు సంస్థగా మార్చుకుని అన్ని రాష్ట్రాల్లోనూ తోలుబొమ్మలాట  ఆడించాలని మహత్తర మార్గం ఆలోచించిన ఘనులు బీజేపీ సీనియర్లు.. హోం మంత్రి అమిత్ షా తదితరులు. 

గతకొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది. దేశంలో ఏ ఘటన జరిగినా..మూలాలు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌లోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ  తన వేటను కొనసాగిస్తోంది. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, భైంసాలో సోదాలు చేపట్టారు. ఇటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీ ఎఫ్ ఐ) కార్యకలాపాలపై నిఘా ఉంచింది.  నిజామాబాద్‌లో మొత్తం 20 చోట్ల నాలుగు ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇటు నిర్మల్ జిల్లా భైంసాలోనూ సోదాచేపట్టారు. స్థానిక మదీనా కాలనీలో పలు ఇళ్లల్లో దర్యాప్తు చేపట్టారు.  నిజామాబాద్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. జగిత్యాలలో మూడు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. టవర్ సర్కిల్‌లోని కేర్ మెడికల్, టీఆర్ నగర్‌లో ఓ ఇంటిలో ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈసందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏపీలోనూ తనిఖీలను ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని ఖాజానగర్‌లో విస్తృతంగా సోదాలు చేశారు. 

ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తెలిపింది. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ‌కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఐసిస్‌ కార్యకలాపాలు కొనసాగుతు న్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా  రాజ్యసభలో ఇదే విషయాన్ని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసిస్‌ సానుభూతిపరులపై ఇటీవల 17 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 122 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా  ఐసిస్‌ తమ సిద్ధాంతాలను ప్రచారంయువతకు గాలం వేస్తోందని తెలిపారు. ఉగ్ర సంస్థల కార్యకలపాలపై నిఘా కొనసాగుతోందని మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.  

ఇవన్నీ అంగీకరించాల్సినదే. కానీ వాటిని అడ్డుపెట్టుకుని రాష్ట్రాల్లో మరింత నిఘా పెంచాల్సిన అవసరముందన్న మాట చెబుతూ ప్రజలకు నిద్రలేకుండా చేయడం ఎంతవరకూ సబబు? కేంద్రం, ఎన్ ఐఏ లక్ష్యాలు ఎలా ఉన్నా, సంఘ విద్రోహులను ఏరివేసే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా చేపట్టాల్సి వస్తుందని, తనిఖీలు, సోదాల గురించి ఎంత వివరణ ఇచ్చుకున్నప్పటికీ చిన్న చిన్న కేసుల్లో విచారణ పట్టనట్టు వదిలేస్తే నిందితులుగా పట్టుబడినవారు జైళ్లల్లోనే మగ్గిపోవాల్సిందేనా అనే అనుమానాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

తమ పరిధి అంతకు మించిందని చిన్నపాటి కేసులను వదిలేస్తే రాష్ట్రప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లకపోవడంతో బాధితుల కుటుంబాలు కూడా వేదనకు గురవుతున్నాయి.  ఇక ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోనూ ఒక విభాగం పెట్టడం వల్లనే ప్రత్యేకించి ఒరిగేదేమిటన్నది ప్రశ్న. కేవలం ఉగ్రవాదులతో, సంస్థలతో సంబంధం వున్నవారిని గుర్తించి ఏరివేసేందుకు భయోత్పాతాలు కల్పించడానికి, సామాన్యులను సోదాల పేరుతో ఖంగారు పెట్టడమే జరుగుతుంది. 

బీజేపీ ఇప్పుడు అందుకే శ్రీకారం చుట్టింది. దేశంలో ఉగ్ర కార్యకలాపాల నిరోధం సాకుతో 2024 తరువాత దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ఐఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించంది.  హర్యానా సూరజ్ కుండ్ లో జరుగుతున్న చింతన్ బైఠక్ లో కేంద్ర హోంమంత్రి షా గారు ఎన్ఐఏకు ప్రతి రాష్ట్రంలోనూ ఒక కార్యాలయం ఉంటుందన్నారు.   నార్కోటిక్స్, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కానీ అన్ని రాష్ట్రాల్లోనూ తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రాంతీయ వ్యతి రేకతకు, నినాదానికీ అవకాశం లేకుండా చేయడానికే ఆ నిర్ణయం తీసుకున్నట్టు తోస్తుంది.  

2008లో ముంబైలో ఉగ్రవాదుల దాడుల తర్వాత ఎన్ఐ ఏ ఏర్పాటయి అదే ఏడాది డిసెంబర్ లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది.  ఉగ్ర కార్యకలాపాల నిరోధం విషయంలోనూ.. ఉగ్ర కేసుల దర్యాప్తులోనూ ఎన్ఐఏ ప్రతిభ, చొరవలను అందరూ ప్రస్తుతిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే ఎన్ఐఏను అడ్డు పెట్టుకుని తమ వ్యతిరేకులను వేధించాలన్న ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. ఉదాహరణకు కోడికత్తి శ్రీను కేసే తీసుకుంటే.. అది ఏ విధంగా చూసినా ఎన్ఐఏ పరిధిలోకి రాదు.. కానీ 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్నంతగా భూతద్దంలో చూపి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కోడి కత్తి శీనును అరెస్టు చేసింది.

అంతే ఇక ఆ కేసు దర్యాప్తును పక్కన పెట్టేసింది. ఎందు కంటే ఈ కేసు దర్యాప్తునకు సమయం వెచ్చించేంత తీరిక ఎన్ఐఏకు ఉండదు కనుక. దేశ ద్రోహం, ఉగ్ర కార్యకలాపాలు ఎన్ఐఏ పరిధి. కోడికత్తి కేసు ఆ పరిధిలోకి రాదు కనుక.. ఈ కేసును ఎన్ఐఏ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ జరుగుతున్నదేమిటి. ఎన్ఐఏ కేసు కనుక ఈ కేసులో కోడి కత్తి శీనుకు బెయిలు రాదు. జైళ్లో మగ్గాల్సిందే. గత నాలుగేళ్లుగా కోడి కత్తి శీని జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటైతే.. దేశమంతటా కోడికత్తి శీనుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పెట్టి కేసులను కూడా ఎన్ఐఏకి అప్పగించేసి అమాయకులను జైళ్లకు పంపే కార్యక్రమం మొదలౌతుంది. అధికారంలో ఉన్న వారు తమ ప్రత్యర్థులను వేధించడానికి ఎన్ఐఏను ఒక అయుధంగా వాడుకునే ప్రమాదం పెరుగుతుంది.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఇప్పటికే కేంద్రం తన రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని వేధిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటుతో ముందు ముందు రాజకీయ వేధింపులకు ఎన్ఐఏ కూడా కేంద్రం చేతికి ఒక ఆయుధమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.