హవ్వ.. వైసీపీ శాసనసభాపక్ష సమావేశమా?

Publish Date:Aug 11, 2026

Advertisement

రాజకీయ పార్టీలలో వైసీపీ స్టైలే వేరు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఒక్కటంటే ఒక్క లక్షణం కూడా ఆ పార్టీకి లేదని గతంలో పలుమార్లు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు విమర్శలు గుప్పించారు కూడా. అయితే వైసీపీ వ్యవహరించే తీరు చంద్రబాబు విమర్శలకు బలం చేకూర్చేదిగానే ఉంటోంది. తాజాగా ఆ పార్టీ బుధవారం (ఆగస్టు 12) శాసన సభా పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై.. రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తం అవుతున్నది.  

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ  రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు.  ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు.  అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం  అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. అటువంటి పార్టీ, అసెంబ్లీలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన తీరు, సభలో జరిగే చర్చలకు ఎలా స్పందించాలి అనే విషయాలపై చర్చించేందుకు శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేయడమేంటా అన్న విస్మయం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లోనే కాదు.. సొంత పార్టీ నాయకులలోనూ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేలలోనూ కూడా వ్యక్తమౌతోంది. ఈ నెలలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్ లో పార్టీ అనుసరించాల్సి వ్యూహం ఏమిటన్నదానిపై చర్చిస్తారా? లేక సభకు హాజరు కావాలా వద్దా? అన్న విషయంపై చర్చిస్తారా అన్నవిషయం ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది.   

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సభలో వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టింది. అయితే ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది సభ్యులు ఆ పార్టీ తరఫునుంచి గత ఎన్నికలలో విజయం సాధించలేకపోవడంతో  వైసీపీకి  ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్ కు ప్రతిపక్ష  నాయకుడి హోదా రాలేదు. దీంతో..   శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఉండదని పేర్కొంటూ.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగుపెడతానంటూ జగన్ శపథం చేసి.. అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారు. ఆయనతో పాటు వైసీపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు కూడా అసెంబ్లీకి ముఖం చాటేశారు.  అంత వరకూ బానే ఉన్నా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలలో అంతర్మథనం ఆరంభమైందని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తరువాత వరుసగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్న భయం వారిలో బలంగా వ్యక్తమౌతోంది.  శాసనసభ నిబంధనల ప్రకారం సుదీర్ఘకాలం  సభకు గైర్హాజరైతే  . అనర్హత వేటు పడుతుందన్న ఆందోళనతో.. ఈ సారి సమావేశాలకు హాజరు కావాలని ఉన్న పదకొండు మంది సభ్యులలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. వారి ఒత్తిడి కారణంగానే జగన్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం ఒకరోజో, రెండు రోజులో సభకు హాజరై.. అటెండెన్స్ వేయించుకుంటే.. అనర్హత వేటు గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతోనే, ఆ విషయంపై చర్చించేందుకు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు.   

మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాల  సమయంలో జగన్ ఏర్పాటు చేసిన ఈ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఇప్పుడు రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ సహా ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి హాజరైనా వారికే నష్టం, గైర్హాజరైనా వారికే నష్టం అన్నట్లుగా పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సభకు హాజరైతే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వైదొలగినట్లౌతుందనీ, హాజరు కాకుండా అనర్హత వేటు ప్రమాదం పొంచి ఉందనీ అంటున్నారు.  

Jagan, AP Assembly sessions, YCP strategy, YCPLP Meeting, Andhra Pradesh News, TeluguOne

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.