వైయస్ సునీత భవిష్యత్తు ఏమిటి?

Publish Date:Mar 12, 2022

Advertisement

మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు వైయస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన హత్య మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఈ హత్యకు సుపారీ పేరుతో కోట్ల రూపాయిలు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో వాటి సంగతి చూసేందుకు నేడోరేపో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం రంగంలోకి దిగుతోందనే ప్రచారం అయితే హోరెత్తి పోతోంది.

మరోవైపు వైయస్ వివేకా హత్యతో ఆమె కుమార్తె వైయస్ సునీత కుటుంబం తీవ్ర కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. వైయస్ వివేకానందరెడ్డి హత్యతో ఇఫ్పటికే ఆమె తీవ్ర దు:ఖంలో ఉన్నారు. సొంత పెద్దనాన్న వైయస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. తనకు మాత్రం న్యాయం జరగలేదనే ఓ విధమైన ఆందోళనతో పాటు ఆమెను పలు సందేహాలు వెంటాడుతున్నట్లు సునీత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

ఆ క్రమంలోనే సునీతతోపాటు ఆమె తల్లి వైయస్ సౌభాగ్యమ్మ కూడా ఏపీ హైకోర్టు మెట్లు ఎక్కారని వారు చెబుతున్నారు. అయితే వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలుకు సీఎం వైయస్ జగన్ అండ్ కో అండ దండ ఉన్నాయని కడప జిల్లాలో టాక్ అయితే వైరల్ అవుతోంది. అలాగే వైయస్ ఫ్యామిలీలోని మిగతా వారంతా సునీతతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన తండ్రి హత్య కేసులో వైయస్ సునీతకు న్యాయం జరిగుతోందా అంటే.. ఆ పరిస్థితి మాత్రం కనబడడం లేదనే ఓ చర్చ అయితే పులివెందుల సాక్షిగా నడుస్తోంది.

అంతేకాదు.. వైయస్ వివేకా హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తాగిరి అప్రూవర్‌గా మరి.. సీబీఐ ఎదుట వైయస్ వివేకా హత్య జరిగిన తీరును పూసగుచ్చినట్లు.. వివరించారు. దీంతో ఈ హత్యలో సూత్రధారులు, పాత్రధారులు సైతం కొత్త స్కెచ్ వేసి.. దర్యాప్త సంస్థపైనే కాకుండా.. సీబీఐ అధికారులతోపాటు వైయస్ వివేకా కుమార్తె, ఆమె భర్త రాజశేఖరరెడ్డిపై కూడా ఆరోపణలు సంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ సునీత.. తీవ్ర ఒత్తిడికి గురై.. మానసికంగా ఆందోళన చెందినట్లు .. ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అసలు తన తండ్రి హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆయన హత్య.. వెనక ఉన్న కారణాలు ఏమిటి? తన తండ్రి హత్య వల్ల ఎవరికీ లాభం ? ఈ హత్యకు సూత్రధారులు , పాత్రధారులు ఎవరు?... ఇత్యాది అంశాలు ప్రపంచానికి తెలియాలనే ఓ విధమైన పట్టుదలతో వైయస్ సునీత ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన సోదరుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో చెప్పినా.. తమ బంధువులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జలతో మాట్లాడినా.. చివరకు నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసినా.. తనకు న్యాయం జరుగుతోందన్న చిన్న ఆశ కూడా ఆమెలో లేకుండా పోయిందని సునీత ఫ్యామిలీలోని వారే అంటున్నారు. ఆ తర్వాత.. అసలు విషయం అర్థమై.. సునీత స్వయంగా రంగంలోకి దిగడంతో.. ఆమె తల్లి వైయస్ సౌభాగ్యమ్మ కూడా.. సునీతతో నడిచారని తెలుస్తోంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.

మరోవైపు.. కడప లోక్‌సభ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతానంటూ.. వైయస్ వివేకా.. తన అన్న కుమారుడు వైయస్ జగన్ పార్టీలోని కీలక నేతలను సంప్రదించడం. అందుకు వారు నో చెప్పారని తెలుస్తోంది. ఆ క్రమంలో సైకిల్ పార్టీలోకి వెళ్లి.. ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవాలని వైయస్ వివేకా భావించడం.. ఆ కొద్ది రోజుల్లోనే ఆయన అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారనే టాక్ అయితే కడప జిల్లాలో జోరుగా నడుస్తోంది. వివేకా తనయ వైయస్ సునీత కూడా టీడీపీలోకి వెళ్తుదంటూ.. ఇటీవల ఓ వర్గం మీడియా అయితే గట్టిగానే ప్రచారం చేసింది. 

అయితే ఇప్పటికే సునీతపై ఓ విధమైన కుట్ర తాలుక .. ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తటస్థంగా ఉన్నా ఆమె.. మరో పార్టీలోకి వెళ్లితే.. సునీత జీవితంపై బలమైన దెబ్బ పడే అవకాశం ఉందని.. ఆ క్రమంలో ఆమె ప్రాణాలకు ముప్ప వాటిల్లే ప్రమాదం కూడా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సునీతకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన అసలు లేనే లేదని ఆమె ఫ్యామిలీలోని సభ్యులే చెబుతున్నారు.

ఓ వేళ తన తండ్రి వివేక హత్య కేసులో దోషులు ఎవరనేది తెలితే.. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చి.. తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. ఆ దిశగా అడుగులు వేసే అవకాశం కూడా లేకపోలేదని వారే అంటున్నారు. ఏదీ ఏమైనా.. వివేకా హత్య కేసులో దోషుల ఎవరనేది తెలిస్తే..  వైయస్ సునీత.. తన పొలిటికల్ ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయనే చర్చ కూడా కడప జిల్లాలో జోరుగానే నడుస్తోంది.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.