నలిగిపోతున్న రోజా

Publish Date:Mar 12, 2022

Advertisement

వెండితెర మీద హీరోయిన్‌గా నటించినంత కాలం.. వెలుగులే వెలుగులు. బుల్లి తెర మీద జడ్జిగా ఉన్నా.. అన్నీ మెరుపులే మెరుపులు. కానీ అదేం విచిత్రమో.... రాజకీయ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత అన్నీ మరకలే మరకలు. ఇది నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్వగతం. 2014 ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టినా... నాటి విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా.. అధికార టీడీపీ వల్ల ఎన్నో అవమానాలు, మరెన్నో ఇబ్బందులు. ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే.. తనకు మంచి రోజులు వస్తాయని భావించిందీ ఈ ఆర్కే రోజా. కానీ ఫ్యాన్ పార్టీ అధికార పక్షంలోకి వచ్చినా.. అ స్వపక్షంలో తనకు విపక్షం తయారైందనీ ఈ రోజా తెగ ఫీలైపోతుందనే టాక్ అయితే నగరి నియోజకవర్గంలో రచ్చ రచ్చగా నడుస్తోంది. 

వైయస్ జగన్ కేబినెట్‌లో మంత్రి గిరి కొట్టేద్దామనుకుంది. కానీ సీఎం జగన్ వద్ద మరీ అలక బూనీ మంగళగిరిలోని ఏపీఐఐసీ చైర్మన్ పదవిని పట్టుకోంది. మరోవైపు ఎమ్మెల్యే రోజాను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఆమె జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వచ్చిన ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు. అంతేకాదు.. రోజాను దెబ్బ తీయడానికి అవకాశాల కోసం ఆయన మరీ వేచి చూస్తున్నారనే టాక్ కూడా శ్రీవారి కొలువైన జిల్లాలో జోరుగా సాగుతోంది. 

ఇప్పటికే నగరి నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో ఫ్యాన్ పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఓ వర్గంగా చేరి.. రోజాకు వ్యతిరేకంగా గుడూపుఠాణి నడుపుతున్నారన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఆమె ఓటమి కోసం.. ఇప్పటికే వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం వారికి పెద్దిరెడ్డి ధన, కనక వస్తూ రూపేణా సహాయ సహకరాలు అందిస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. దీంతో తన ఓటు బ్యాంక్ గల్లంతవుతోందని రోజా ముందే ఊహించింది. నగరిలో తమిళ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వారి ఓట్లను కొల్లగొట్టేందుకు... ఇటీవల తన భర్త సెల్వమణితో కలసి ఆమె తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయి.. తన నియోజకవర్గంలోని తమిళులకు సహాయ సహాకారాలు అందించాలంటూ కొత్త పల్లవి అందుకోందీ రోజా. ఈ విషయాన్ని పరిశీలిస్తానంటూ స్టాలిన్ చెప్పడంతో.. ఆమె కాస్తా డీలా పడినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు కూడా వివరించగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియనిది కాదంటూ ముక్తాయింపు నిచ్చీ మరీ రోజాకు క్లాస్ పీకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని.. దాంతో తీవ్ర ఆలోచనలతో రోజా నలిగిపోతున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు.   

మరోవైపు.. మంత్రి పదవి వస్తే.. తన రాజకీయ ప్రత్యర్థి, మంత్రి పెద్దిరెడ్డిపై  ఓ రేంజ్‌లో హల్‌చల్ చేయవచ్చుననే ఆలోచనలో ఉందీ రోజా. కానీ ఆమె ఆశలు ఆడియాశలు అయ్యేలా ఉన్నాయని తాడేపల్లి ప్యాలెస్‌లో టాక్ వైరల్ అవుతోంది. రోజా హవా అంతా గత కాల జ్జాపకంగా మారిందనే టాక్ కూడా నడుస్తోంది. నేడు అంతా చిలకలూరిపేట ఎమ్మెల్మే రజినీదే హవా అని... ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నా.. వారు హోం మంత్ర, డిప్యూటీ సీఎంగా ఉన్నా.. వారంతా విడదల రజినీ ముందు దిగదుడుపే అనే టాక్ అయితే అమరావతిలో సైతం హల్ చల్ చేస్తోంది. 

రానున్న ఉగాదికి జగన్ కొత్త కేబినెట్‌ కొలువు తీరనుందని సమాచారం. ఈ కేబినెట్‌లో రజినీకి బర్త్ కన్‌ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. కానీ రోజా విషయంలో అలా కాదు.. చిత్తూరు జిల్లా రెండు జిల్లాలు అవుతున్న సందర్భంగా ఆమెకు కాకుండా కేబినెట్ బర్త్.. భూమన లేదా చెవిరెడ్డి తన్నుకు పోయే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు రానున్న ఎన్నికల్లో ఆమె గెలుపు నల్లేరు మీద నడక కాదని.. ఆమెకు కూడా తెలుసు. దీంతో రోజా రాజకీయానికి చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి మంత్రాంగం వంద శాతం వర్క్ అవుట్ అవుతుందని చిత్తూరు జిల్లాలో జోరుగా నడుస్తోంది.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.