మోదీ సందేశం.. సారాంశం ఏమిటి ?

Publish Date:May 13, 2025

Advertisement

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్’సిందూర్, భారత్ , పాకిస్థాన్ మధ్య  మినీ వార్ , కాల్పుల విరమణ తదనంతర పరిణామాలు, విశ్లేషణలు,విమర్శల నేపథ్యంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  సోమవారం (మే 12) ర్రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిజానికి, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాన మంత్రి మోదీ మౌన సందేశమే కానీ, నోరు విప్పి మాట్లాడింది లేదు.  అఫ్కోర్స్  పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఒకటి రెండు రోజులకు బీహార్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ స్పందించారు. ఉగ్రవాదాన్ని క్షమిచేంది లేదని అన్నారు .ఉగ్రవాదంపై యుద్దాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నపాక్ కు గట్టి హెచ్చరిక చేశారు. ఆ తర్వాత మోడీ మళ్ళీ, పెదవి విప్పలేదు. ఒక్క ముక్క ఆయినా  మాట్లాడలేదు. 

కానీ..  ఆయన మౌనం మాట్లాడుతూనే వుంది. ఉగ్రదాడి  జరిగిన పక్షం రోజుల తర్వాత  పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం  ఆపరేషన్ సిదూర్ పేరిట క్షిపణి దాడులు చేసింది.  తొమ్మిది స్థావరాలనూ నేల మట్టం చేసింది.   25 నిముషాల వ్యవధిలో 100 కి పైగా  ఉగ్రవాదులను మట్టు పెట్టింది.  అలాగే..  భారత్ దాడులకు ప్రతిగా పాక్  జరిపిన డ్రోన్  దాడులను భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొట్టింది. పాక్ వైమానిక స్థావరాలను లేపేసింది. చివరకు పాక్  చేతులెత్తేసే స్థితికి చేరుకున్న సమయంలో..  అనూహ్యంగా  మోదీ కాల్పుల విరమణ ప్రతిపాదనకు తలూపారు. విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో  సోమవారం (మే 12) రాత్రి మోదీ జాతిని ఉద్దేశించి  చేసిన ప్రసంగం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది.  ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక విధంగా..  ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ, దేశంలో అంతర్గత రాజకీయ యుద్ధానికి తెర తీసింది. 

అయితే.. సుమారు  20 నిముషాల పాటు సాగిన ప్రసంగంలో మోదీ  దేశం ముందున్న ప్రశ్నలకు సమాధానంచెప్పారా.. అంటే విశ్లేషకులు చెప్పారనో లేదనో సమాధానం చెప్పడం కష్టమే అంటున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణ విషయంలో విభిన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిజం ఏమిటన్నది, నిలకడ మీద గానీ తెలియదు. కానీ.. ఈలోగా జరగవలసిన నష్టం జరిగి పోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరో పరాయి వారో, ప్రతిపక్షాలో కాదు..  సొంత మనుషులే కొంత మంది  మోదీ  నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తప్పు పడుతున్నారు. విజయం స్వాగతం పలుకుతున్న సమయంలో మోదీ ఎందుకు వెనకడుగు వేశారు, కాల్పుల విరమణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అన్న ప్రశ్నలు, సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. అన్నిటినీ మించి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని  ‘ఆపు’ అనగానే జీహుజూర్  అంటూ మోడీ, అస్త్ర సన్యాసం ఎందుకు చేశారు?  దేశం మొత్తం భారత  సైనిక సామర్ధ్యాన్ని చూసి మురిసి పోతున్న సమయంలో..  మోదీ దేశం నెత్తిన కాల్పుల విరమణ నీటిని ఎందుకు కుమ్మరించారు?  అంటే..  వ్యూహంలో భాగమనో, ఇంకొకటనో తప్పించు కోవడమే కానీ  సరైన  సమాధానం లేక బీజీపీ నాయకులు,  అభిమానులు బేల చూపులు చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రధానంగా బీజేపీ, నాయకులు, కార్య కర్తలు, అభిమానులకు ఇచ్చిన సందేశంగా తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ మొదలు కాల్పుల విరమణ వరకు జరిగిన పరిణామాలను, భవిష్యత్ ప్రణాళికను దేశ ప్రజలకు వివరించేందుకు   మంగళవారం (మే 13) నుంచి 11 రోజుల పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ  ‘తిరంగ యాత్ర’ నిర్వహిస్తున నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం పార్టీకి ఇచ్చిన సందేశంగానే భావించాలని అంటున్నారు.  జాతిని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగంలో  దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం పెద్దగా లేదని అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణకు సంబంధించి వివరణ  ఇవ్వడంలో మోదీ విఫలమయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.   

అయితే..  అదే సమయంలో మోదీ ప్రసంగంలో  పాకిస్థాన్ కు , ప్రపంచానికి రెండు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని బీజేపీ అనుకూల వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కాల్పుల విరమణకు సంబంధించి దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను, విమర్శలను తిప్పికొడుతూ..  బీజేపీ అనుకూల విశ్లేషకులు  ప్రధాని తమ ప్రసంగంలో కాల్పుల విరమణ తాత్కాలికమని స్పష్టం చేశారని, ఉగ్రవాదం నిర్మూలన విషయంలో పాకిస్థాన్ వ్యవహరించే తీరును బట్టే..  కాల్పుల విరమణ పై భవిష్యత్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారని అంటున్నారు.అలాగే, పాక్ తో చర్చలు అంటూ జరిగితే, ఒకటి ఉగ్రవాదం, రెండు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)  ఈ రెండు విషయాలపైనే ఉంటాయని, ఇతర విషయాలపై చర్చలు ఉండవని స్పష్టం చేశారని అంటున్నారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం, ప్రసంగం కాదు పాక్  పై కురిపించిన మిస్సైల్ దాడితో సమానమని  బీజేపీ అనుకూల వర్గాలు, అనుకూల విశ్లేషకులు అంటున్నారు. 

అయితే..  విపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, కాల్పుల విరమణ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్’ వరసగా చేస్తున్న ప్రకటనలను మోదీ తమ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని తప్పు పడుతున్నాయి. అయితే..  బీజేపీ అనుకూల వర్గాలు మాత్రం ఆ ఒక్కటీ అడగొద్దు అన్నట్లుగా  ఆ ఒక్క విషయాన్ని వదిలేసి  మోదీ ప్రసంగాని, సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. అంతిమంగా  మోదీ ప్రసంగం ఎవరి కోసం? ఎందుకోసం? ప్రసంగంలో ఏముంది? ప్రసంగం సారాంశం ఏమిటి.. అన్నది, సమధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. 

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.