Publish Date:Oct 26, 2023
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలిచింది. వరుసగా ఏడు సర్వేల్లో ఆరు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే విజయావకాశాలున్నట్లు ప్రకటించాయి. సిక్స్ గ్యారెంటీస్ తో ప్రజల్లో ఇప్పటికే చర్చనీయాంశమై ఆ పార్టీకి మరో కొత్త గ్యారెంటీ తోడయ్యింది. ఇప్పుడు ఈ హామీలకు మరోటి చేర్చినట్టు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. ఒక దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
కేసీఆర్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం లేకుండా పోయాయని రేవంత్రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ మూడింటినీ తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తాము ప్రకటించిన ఆరు హామీలకు తోడుగా దీనిని ఏడో హామీగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని చాటిచెప్పేందుకే కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్కు సవాల్ విసిరినట్టు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తరచూ ముఖ్యమంత్రులను మార్చుతుందన్న విమర్శలపైనా రేవంత్ స్పందించారు. పార్టీలో ప్రస్తుతం అలాంటి వైఖరి లేదని, అది గతించిన విషయమని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వాలను వదులుకుంటుంది తప్ప పార్టీలోని అసమ్మతి గొంతులకు అధిష్ఠానం తలొగ్గబోదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, కర్ణాటకను ఉదాహరణగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని మార్చాలన్న జ్యోతిరాదిత్య సింధియా ఒత్తిడి చేస్తే ఆయననే వదులుకొందని, అంతకుముందు కర్ణాటకలోనూ సంకీర్ణ ప్రభుత్వాన్ని వదులుకున్నామని రేవంత్ గుర్తు చేశారు. పార్టీలోని వివిధ వర్గాలు సీఎం పదవిని ఆశించడం తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is--congress-seventh--guarenty-25-164008.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.