తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగి‘రేసు’

Publish Date:Oct 26, 2023

Advertisement

కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజా వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలతో డీలా పడ్డ బీజేపీ.. రెండు పార్టీలనూ మరింతగా ఇబ్బందులకు గురి చేసేలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ వ్యూహకర్త  సునీల్ కనుగోలు కాంగ్రెస్ కు సహజకవచకుండలాలుగా అంతా  చెప్పే అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాల నుంచి బయటపడేశారని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ సమష్టిగా ఐక్యంగా  కదులుతున్న తరుణంలోనే  ప్రత్యర్థి  పార్టీలకు కాంగ్రెస్ జాడ్యం అంటుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా  చెప్పుకునే బీజేపీపరిస్థితి తెలంగాణలో అత్యంత దయనీయంగా మారిపోయింది. బీజేపీలో నేతల సంఖ్యతో సమానంగా అసంతృప్తుల సంఖ్య కూడా ఉందని అంటున్నారు.

ఇతర పార్టీలనుంచి వచ్చి బీజేపీ గూటికి చేరిన వారు సహజంగానే ఆ పార్టీలో ఉక్కపోతకు గురౌతుంటారు. సంప్రదాయ పార్టీలకు భిన్నంగా  బీజేపీని వెనుక నుంచి ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంటుంది. దీంతో వేరే భావజాలంతో ఉన్నవారు రాజకీయ అవసరాల కోసం కమలం గూటికి చేరినా అక్కడ ఇమడ లేని పరిస్థితులు ఉంటాయి. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం తొలి నుంచీ పార్టీలో ఉన్నవారే ఉక్కపోతకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. అలాగే  ఈ తొమ్మదేళ్ల కాలంలో బీజేపీలో తొలి నుంచీ ఉన్నవారి కంటే బయట నుంచి వచ్చి పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్న వారి సంఖే ఎక్కువ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడం వెనుక కూడా ఈ బయట నుంచి వచ్చి చేరిన వారి ప్రమేయమే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నాటికి బలమైన నేతలతో బీజేపీ నిండిపోతుందన్న పరిశీలకుల అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుంటే వారిని నిలువరించడం ఎలా అని కమలం నేతలు తలలు బద్దలు కొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. 

ఇక మరో వైపు బీఆర్ఎస్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. గతంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిటి ఇతర పార్టీలను ఖాళీ చేయడమే లక్ష్యంగా కేసీఆర్ అనుసరించిన విధానమే ఇప్పుడు ఆ పార్టీని కకావికలం చేస్తోందని అంటున్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలలో అధినేత మాటే శాసనం అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ లో విధేయత కంటే ధిక్కారమే ఎక్కువగా కనిపిస్తోందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ లో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా  ఐక్యత కనిపిస్తున్నది. సీనియర్ల మంటూ తమ భుజాలను తామే చరుచుకునే కాంగ్రెస్ వృద్ధ నేతల అసమ్మతి గళాలనూ, అసమ్మతి రాగాలనూ పార్టీ శ్రేణులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వారూ మిన్నకుండక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది.

ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమాయత్తం కోసం బీజేపీ, బీఆర్ఎస్ ను కసరత్తులు చేస్తుంన్నాయి. ఆ పార్టీ నేతలకు వలసల బెడద కంటిమీద  కునుకు లేకుండా చేస్తుంటే.. అటువంటి ఇబ్బందులన్నిటినీ అధిగమించిన కాంగ్రెస్ మాత్రం వజయం కోసం వ్యూహాలను రచించుకుంటూ.. వాటిని పకడ్బందీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.