ఈ మూడేళ్లలో ఏం చేశారయ్యా?.. ఎమ్మెల్యే రక్షణనిథిని నిలదీసిన మహిళలు
Publish Date:May 17, 2022
Advertisement
గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమం.. ప్రభుత్వంపైనా, తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిథులపైనా తమకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి దొరికిన అవకాశంగా జనం భావిస్తున్నారు. ఇంత చేశాం, అంత చేశాం అంటూ చెప్పుకుందామనుకున్న ప్రభుత్వ లక్ష్యం ప్రజాగ్రహ ఉప్పెనలో కొట్టుకుపోతున్నది. ఎక్కడి కక్కడ ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయడమే కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలను కడిగి పారేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కోడూరులో మహిళలు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిథిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ మూడేళ్లలో మీ సర్కార్ చేసిన ఒక్కమంచి పనిని చెప్పవయ్యా అంటూ నిలదీశారు. 'ఒక మంచి పనైనా చేశారా' వైసిపి ఎమ్మెల్యేని నిలదీసిన మహిళలు ఉపయోగం లేని పథకాల పేరుతో కోట్లు అప్పలు చేసిన ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా చూపమంటూ నిలదీశారు. రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోలేదనీ, పక్కా గృహాల మంజూరు ఎక్కడనీ ప్రశ్నలు సంధించారు. వైసీపీ పథకాల లబ్ధిదారుల ఇళ్లకే గడప గడపకూ మన ప్రభుత్వాన్ని పరిమితం చేసినా వారి నుంచే నిరసనలు వ్యక్తం అవుతుండటంతో ఎమ్మెల్యేలూ, మంత్రులకు ఏం చెప్పాలో, వారిని ఎలా సముదాయించాలో తెలియక దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే రక్షణ నిధికి కోడూరులో ఎస్సీ కాలనీలో తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఎరక్కపోయి మీ పార్టీకి ఓటేసాం.. అంటూ నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో ఓటేశాం. మూడేళ్లుగా రోడ్లు లేవు, పక్కాగృహాలు లేవు, తాగునీటి సౌకర్యం లేదు, డ్రైనేజీ లేదు సరికదా నిరుపయోగ పథకాల పేరు చెప్పి రాష్ట్రాన్నిఅప్పుల కుప్ప చేశారంటూ మహిళలు నిలదీశారు. అమ్మ ఒడి కోసం సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వృద్ధురాలు రెండేళ్లుగా పింఛను రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బియ్యం కార్డులు మంజూరు కాలేదని మరి కొందరు నిలదీశారు. కర్నూలుజిల్లాఅదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికీ దాదాపుగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. నియోజకవర్గ పరిధిలోని విరుపాపురంలో ఆయనకు ప్రజాగ్రహ సెగ తగిలింది. ఆయనను మాట్లాడనివ్వకుండా జనం ప్రశ్నల వర్షం కురిపించారు. బియ్యం కార్డులు లేవు, పక్కా గృహాల మంజూరు లేదు. ఘనంగా సర్కార్ చెప్పుకుంటున్న పథకాలలోనూ వివక్షే. అన్నీ వాలంటీర్లే చేశారంటే మీరెందుకు అంటే సాయి ప్రసాద్ రెడ్డిని జనం నిలదీశారు. ఇక కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ పాషాకు జనాగ్రహంతో చేదు అనుభవమే ఎదురైంది. ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని మమ అనిపించి ముగించేద్దామా అన్న తొందర ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఈ కార్యక్రమాన్ని తమ తమ పరిధిలో ప్రారంభించనే లేదు. ప్రజాగ్రహాన్ని ఎదుర్కొనడం కంటే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఆదేశాలను ధిక్కరించడమే మేలని తమ ఆంతరంగికుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
సమస్యలు పట్టించుకోని, పరిష్కరించలేని ప్రభుత్వం ఎందుకంటూ ఆయనను అడ్డుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు, కార్యకర్తల బలగాన్ని వెంటేసుకు వెళుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు జనాగ్రహ జ్వాలలను ఎదుర్కొనక తప్పడం లేదు. విద్యుత్ కోతలపై జనం ప్రశల తూటాలకు ఉప ముఖ్యమంత్రి నిరుత్తరుడయ్యారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడ నుంచి తన మందీ మార్బలంతో జారుకున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు, ఆందోళనలతో గడప గడప కూ కార్యక్రమంలో అడుగు బయటకు పెట్టాలంటేనే వైసీపీ ప్రజా ప్రతినిథులు జంకుతున్నారు.
http://www.teluguone.com/news/content/what-gocernment-did-in-three-years-people-question-mla-25-136007.html





