పశ్చిమ బెంగాల్‌కు తొలి కాషాయ సీఎం.. ఛాన్స్ ఎవరికో?

Publish Date:May 4, 2026

Advertisement

 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. సీఎం అభ్యర్ధిని ప్రకటించకుండా ఎన్టీఏ ఎన్నికల బరిలోకి దిగింది. దాంతో రాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్ బీజేపీ దిగ్గజ నేతలు సువేందు అధికారి,  ఘోష్ పేర్లు సీఎం రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి ముఖ్యమంత్రి పదవి రేసులో మొదటి వరుసలో ఉన్నారు. మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో సవాలు చేసి, గట్టి పోటీని ఇచ్చారు. నందిగ్రామ్‌లో గతంలో మమతను ఓడించడం, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలపై పట్టు, దూకుడుగా ఉండే రాజకీయ శైలి ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఎన్నికల ప్రచారంలో హిందూ ఓట్ల ఏకీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు.

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత దిలీప్ ఘోష్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖరగ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు ఉండటం, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసిన అనుభవం ఆయనకు అండగా ఉన్నాయి. స్థానిక నేతగా ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు ప్లస్ అయ్యే అవకాశముందంటున్నారు. అయితే బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయమే ఫైనల్. ముఖ్యంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, అధిష్ఠానం ఎవరైనా ఊహించని పేరును తెరపైకి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఆ క్రమంలో ఆ ఇద్దరితో పాటు మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.


 

By
en-us Political News

  
ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.
ప్రజా రాజధాని నిర్మాణానికి రాయపూడి రైతు కుటుంబం ఉదారత.. !
జగన్నాథుడి రథోత్సవంలో విషాదం.. వంద మందికి గాయాలు..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు. అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది.
గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.