ఉద్యోగ సంఘాల నేతలు అమ్ముడు పోయారా?

Publish Date:Feb 6, 2022

Advertisement

సున్నకు సున్నా .. హళ్లికి హళ్లి ...
సింగన్న అద్దంకి పోనూ ..పోయాడు
రానూ వచ్చాడు ..వట్టి చేతులతో
సుమారు 20 రోజులకు పైగా, ‘పీఅర్సీ సాధన సమితి’ పేరిట డ్రామా నడిపిన ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు, చివరకు ఏమి సాధించారు అంటే సున్నకు సున్నా .. హళ్లికి హళ్లి ... ఉప్పెనలా ఎగసి పడిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల, ‘చలో విజయవాడ’ ఆందోళన ఫలాలు నోటికి చెరక ముందే పీఆర్సీ సాధన సమితి నేతలు పంచేసుకున్నారు,అమ్మేసుకునంరు అనే మాటే, ఈరోజు ఉద్యోగుల నోట వినవస్తోంది.  

ఏ కమిటీకి అయితే ఏ అధికాలు లేవు .. అధికారాలు లేని మంత్రుల కమిటీతో చర్చలు ఏమిటి ... ముందు పీఆర్సీ నివేదిక ఇవ్వడి ఆ తర్వాతనే చర్చలు .. అంటూ ఏ కమిటీని అయితే తూలనాడారో.. అదే కమిటీతో... పీఆర్సీ  నివేదికను కంటితో చూడకుండానే .. రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. చర్చలకు మూడు షరతులు అన్నారు .. సర్కార్ ఒక్క షరతుకు ఒప్పుకోలేదు. అయినా తగడునమ్మా అంటూ కట్టకట్టుకుని చర్చలు వెళ్లారు. రెండు రోజులు చర్చించారు.

కానీ, ఏమి సాధించారు. వ్రతం చెడ్డ ఫలితం దక్కిందా అంటే అదీ లేదు. అమ్ముడు పోయారన్న నిందను, తమ ఆశలను, హక్కులను అమ్మేశారాన్న,ఉద్యోగుల ఆవేదన తప్ప,నలుగు సంఘాలు కలిసి ఒకటైన పీఆర్సీ సాధన సమితి సాదించింది శూన్యం. ఇది ఎవరో గిట్టని వాళ్లు, ఉద్యోగుల ఆందోళన నుంచి రాజకీయ ప్రయోజనం ఆశించిన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ అసలే కాదు, నేతలను నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్న ఉద్యోగులు వ్యక్త పరుస్తున్న ఆవేదన, ఆగ్రహం.

అంతే కాదు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాద్యాయ సంఘాలను కలుపుకుని ఏదో చేస్తారు సాధిస్తారు అనుకుంటే, తాచెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్నట్లుగా, ఉపాధ్యాయ సంఘాలను నిలువునా ముంచేశారు. కాదు, అమ్మేశారు. ఇది కూడా ఎవరో చేసిన ఆరోపణ కాదు, ఉపాద్యాయ సంఘాల నాయకులే పోరాటం పేరుతో ఉద్యోగ సంఘాల నాయకులు  తమను కూడా ప్రభుత్వానికి అమ్మేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు, పీఆర్సీ సాధన సమితిలో సభ్యులుగా ఉన్నఉపాధ్యాయ ప్రతినిధులు, తాము అమ్ముడుపోయందుకు సిద్దంగా లేమని తేల్చిచెప్పారు.

ఉద్యోగ సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలోనే నల్ల బ్యాడ్జిలు తీసీసి, ‘సమ్మె ప్రతిపాదనను వెనక్కితీసుకుంటున్నట్లు ప్రకటించి.,సర్కార్’కు సలాం చేశారు. ప్రభుత్వాన్ని స్తోత్ర గీతాలతో ప్రశంసించారు. ఆందోళన సమయంలో పొరపాటున నోరుజారి ముఖ్యమంత్రిని ఒక మాటన్నా పెద్ద మనసు చేసుకుని క్షమించాలని వేడుకున్నారు. అందుకే, కావచ్చు  గతంలో ఎప్పుడు ఉద్యోగ  సంఘాలు ఈ స్థాయిలో సర్కార్’ దాసోహం అనలేదు అనేమాట ఉద్యోగుల నుంచి వినవస్తోంది.

అయితే, ఏపీటీఎఫ్, యూటీఫ్,ఎస్టీయు, ఏపీ ఉపాద్యాయ సంఘాల నాయకులు మాత్రం  ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందాన్ని నిరశిస్తూ, 30 శాతం ఫిట్మెంట్ సహా తమ డిమాండ్ల సాధన కోసం తమతో కలిసి వచ్చే సంఘాలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు, భానుమూర్తి, పాండురంగా రావు ఒక ప్రకటన విడుదళ చేశారు.అయితే, ఉద్యోగ సంఘాల నాయకులు  మాత్రం ఉపాద్యాయ సంఘాల నాయకులను ఒప్పించే, బాధ్యత (కొందరు ఉద్యోగులు  ‘కాంట్రాక్టు’ అంటున్నారు) కూడా తామే తీసుకున్నారు. 

సరే ఉపాధ్యాయ సంఘాల నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులు ఒప్పించగలరా? లేదా? అన్నది పక్కన పెడితే, ఇప్పటికే ‘సర్కారీ’ నేతలుగా పేరుపడిన ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగుల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని, సోషల్ మీడియాలో వస్తున్న, పోస్టులు, కామెంట్స్’ బట్టి తెలుస్తోంది. అంతే కాదు, ఉద్యోగ సంఘాల నాయకులతో ఉన్న సన్నిహత సంబంధాలను, ఇతర అనుబంధాలను అడ్డుపెట్టుకుని, ఇప్పటికి ప్రభుత్వం పైచేయి సాధించినా, ఈ మోసానికి అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల ‘సర్కారీ’ నేతలు మూల్యం చెల్లించక తప్పదని  అంటున్నారు. ఇల్లు అలక గానే పండగ రాదు ... సమయం వచ్చినప్పుడు సరైన సమాదానం చెపుతామని అంటున్నారు.

ఆదలా ఉంటే ఏపీ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషులు, 2003లో తమిళనాడులో ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి జయలిత  70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులఫై డిస్మిస్ కొరడా ఝులిపించి చెల్లించిన మూల్యాన్ని గుర్తుచేస్తున్నారు.అప్పట్లో జయలలిత , ఇలాగే  ఉద్యోగుల ఆందోళను ఉక్కు పాదంతో అణచివేశారు.. విజయ గర్వాన్ని ప్రదర్శించారు .. కానీ,, ఆ తర్వాత జరిగిన  ఎన్నికల్లో ... చిత్తు చిత్తుగా ఓడి పోయారు. తమిళనాడు అసెంబ్లీ లోని మొత్తం 234 స్థానాలకు గానూ జయలిత పార్టీ అన్నాడిఎంకే కేవలం 37 స్థానలతోనే  సరిపెట్టుకోవలసి వచ్చిందని, విశ్లేషకులు గుర్తు చేస్తునారు. మరి ఏపీలో ఏమి జరుగుతుంది? చివరకు ఏమవుతుంది? చూడాలి.

By
en-us Political News

  
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.