అయినా తగ్గేదేలే.. కేసీఆర్ జంగ్ సైరన్

Publish Date:Feb 6, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ మర్యాద మరిచారా? జాతీయ రాజకీయాల్లో,తనకంటూ ఒక స్థానం, గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అందుకోసంగా, బీజేపీ,మోడీ వ్యతిరేక శక్తులలో,  ‘నేను సైతం’  నిజంగానే మోడీని వ్యతిరేకిస్తున్నాను అనే ‘విశ్వాసం’ కలిగించేందుకే, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను ఉపయోగించుకున్నారా? అందుకే, ప్రధాని పర్యటన సందర్భంగా పాటించవలసిన ప్రోటోకాల్ నిబంధనలను, రాజ్యాంగ విధులను బహిష్కరించారా? ఆ విధంగా ‘నిరసన’ తెలిపారా? అంటే, తెరాస నాయకులు సహా రాజకీయ పండితులు అందరూ అవుననే అంటున్నారు. 

ముఖ్యమంత్రికి జ్వరం వచ్చింది, అదుకే ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం  పలకలేదు, ఆయన వెంట ఇక్రిసాట్. ముచ్చింతల్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, అని లీకులు అల్లినా అది ఎవరూ నమ్మడం లేదు. నవ్వుకుంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రధాని మోడీ పర్యటనలో ఎందుకు పాల్గొనలేదు? ఎందుకు  ‘డుమ్మా’ కొట్టారు అనే దానికి, ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి అధికారిక వివరణ ఇచ్చినట్లు లేదు. బహుశా, అలా వివరణ ఇవ్వక పోవడం కూడా, ‘నిరసన’ లో భాగమో, ఏమో ఎవరికీ తెలియదు.  

అయితే,ముఖ్యమంత్రి ఎందుకోసం అయితే, జ్వరం తెచ్చుకున్నారో, ఎందుకు ‘రిస్క్’ తీసుకున్నారో ఆ ఫలితం అయినా దక్కిందా అంటే, అదీ లేదని అంటున్నారు. ప్రధానివి కురచ బుద్దులని దెప్పిపొడిచిన ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసం, రాజ్యంగ విధులను విస్మరించడమే కాకుండా, దైవ కార్యాన్ని ఉపేక్షిచడం విమర్శలకు అవకాశం  కలిపించిందని తెరాస నాయకులే అంటున్నారు.”ముఖ్యమంత్రి ఒకే మాట మీద ఉంటె అదో రకంగా ఉండేది.అలా కాకుండా ఒకసారి వెలుతున్నారని, ఒక సారి లేదని ద్వంద వైఖరి చూపడం వలన జనంలో పలచని పోయాం” ని తెరాసనాయకుడొకరు అన్నారు. నిజానికి, కేంద్రంఫై యుద్ధం ప్రకటించడం, అంతలోనే యూ టర్న్ తీసుకోవడం వల్లనే జాతీయ స్థాయిలో ఎవరూ కేసీఆర్’ను అంట సీరియస్ గా తీసుకోవడం లేదని తెరాస వరగాల్లోనే చర్చ జరుగుతోంది.  మరో వంక రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ముచ్చింతల్’లో  ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల వేదికను చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. తిరునామాలు, దీక్షా వస్త్రాలతో..సమతామూర్తి క్షేత్రంలో అడుగుపెట్టింది మొదలు తిరిగి వెళ్లే వరకు ప్రధాని మోడీ అడుగడుగునా ఆధ్యాత్మిక స్పూర్తితో కనిపించారు.ఇలా వేషధారణ మొదలు, ప్రవచనంలా సాగిన  ప్రసంగం వరకు, అందరినీ ఆకట్టుకునే విధంగా మోడీ అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. 

చివరకు, కేసీఆర్  తమ ఆధ్యాత్మిక గురువుగా బావించే చిన జీయర్ స్వామి,  ప్రధాని మోడీని ఏకంగా శ్రీ రామ చంద్ర ప్రభువుతో రాముడితో పోల్చారు. రామునిది లోనో సుగుణాలు అన్నీ మోదీలో ఉన్నాయని అన్నారు. అయోధ్య రాముడు తల వంచుకున్నప్పుడైనా.. తల ఎత్తుకున్నప్పుడైనా ధర్మాన్ని ఆశ్రయించే ఉన్నాడని, మోడీ కూడా అలాంటి రాముడేనంటూ ఆనందం వ్యక్తం చేశారు. 

అదలా ఉంటే, మోడీని అవమానించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని అనుకోవడం అంత శ్రేయస్కరం కాదని, బీజేపీయేతర పార్టీల నాయకులు కూడా అంటున్నారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో రాహుల్  గాంధీ, ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ మోడీ లక్ష్యంగా చేసిన ప్రచారం బూమ్రాంగ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆదేబాబ్ నుంచి కాంగ్రెస్ పార్టీ  ఇప్పటివరకు కోలుకోలేదని, రాహుల్ రాజీనామాకు,మూడేళ్ళుగా పూర్తి స్థాయి అధ్యక్షుని ఎన్నుకోలేని స్థితికి,అదే కారణమని అంటున్నారు. 

అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం, తగ్గేదేలే’ అంటూ మోడీ ఫై యుద్హాన్ని ముందుకు తీసుకుపోయే దిశలోనే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, ఈనెల (ఫిబ్రవరి) 11 నుంచి కేసీఆర్ జిల్లా పర్యటనలకు బయలుదేరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన  అన్యాయాన్ని ఎండగట్టడమే కేసీఆర్ జిల్లా పర్యటనల లక్ష్యమని తెరాస నాయకులు చెపుతున్నారు. మరో వంక బీజేపీ కూడా, కారును ‘ఢీ’ కొనేందుకు రె...ఢీ అంటోంది. మొత్తానికి రాష్ట్రంలో ఎండలతో పాటుగా రాజకీయ ఉష్ణోగ్రతలు కూడా వేదక్కనున్నాయి అనేది నిజం.

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.