Publish Date:May 31, 2023
పాతబస్తీ వోటర్లు విభిన్న శైలి. ఇక్కడి ముస్లింలు వోటు వేసేది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేసేది మాత్రం బిఆర్ఎస్ కు. పాతబస్తీలో ఈ రెండు పార్టీలు తప్పితే మరే ఇతర పార్టీలు పాతబస్తీలో కనీసం కాలు పెట్టజాలవు. ఇది బిజెపికి మింగుడుపడడం లేదు. మజ్లిస్ టార్గెట్ గా బిజెపి ఇవ్వాళ ఆరోపణలు చేసింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సింహంలా సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. దారుస్సలాంలో కూర్చొని మాట్లాడడం కాదు.. దమ్ముంటే ఎంఐఎం రాష్ట్రమంతటా పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ను సంకలేసుకొని వస్తారో.. కాంగ్రెస్ సహా గుంట నక్కలా పార్టీలతో కలిసి పోటీ చేస్తారో చూద్దామని కౌంటర్ వేశారు బండి. ప్రస్తుతం బిఆర్ఎస్ మిత్ర పక్షాలలో మజ్లిస్ పార్టీకి తప్పితే మరో పార్టీకి స్థానం లేదు. బిఆర్ఎస్ కంటే ముందు మజ్లిక్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. బిజెపితో ఉన్న శత్రుత్వంతో మజ్లిస్ అప్పట్లో కాంగ్రెస్ తో జత కట్టింది. కాంగ్రెస్ మాత్రమే సెక్యులర్ పార్టీ అని ఓవైసీ కితాబిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ హాయం నుంచి మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో బాబ్రీ మసీదు కూలి పోయింది. బిజెపి, సంఘ్ పరివార్ ను దూషించిన మజ్లిస్ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో దోషిగా నిలబెట్టలేకపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లిస్ పార్టీకి ఊపిరిపోశారు. మజ్లిస్ కోరిక మేరకు పాతబస్తీలో పునర్ విభజన చేపట్టారు. ఈ పునర్ విభజనతో పాత బస్తీలో మెజారిటీ సీట్లు మజ్లిస్ దక్కించుకుంది. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. అదే సాంప్రదాయాన్ని బిఆర్ఎస్ కొనసాగిస్తుంది. పాత బస్తీలో మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు బలమైన వారు లేకపోవడంతో బిఆర్ఎస్ అధికారంలో వచ్చిన రెండు పర్యాయాలు మజ్లిస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. షాదీ ముబారక్ వంటి స్కీంతో పేద ముస్లి అమ్మాయిలు లక్షలాది మందికి పెళ్ళిళ్లు జరుగుతున్నాయని గాజిబండకు చెందిన హజ్మత్ భాయ్ అంటున్నారు. బిఆర్ఎస్ ను పాతబస్తీ వాసులు ఓన్ చేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/we-are-support-brs-onlly--25-156134.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!