Publish Date:May 31, 2023
హైద్రాబాద్ లో సెల్ఫీ సుసుడ్ కలకలం రేపింది. జగిత్యాల జిల్లాకు చెందిన హీరో షోరూం యజమాని నరేష్ హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు నరేష్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేసినట్లు వివరించారు. వ్యాపారంలో నష్టం రావడానికి తనే కారణమని ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వీడియోలు వైరల్ కావడంతో అప్పటికే డిప్రెషన్లో ఉన్న వ్యక్తులను ప్రోత్సహించే విధంగా ఈ వీడియోలు ప్రేరణ ఇస్తాయని సైకియాట్రిస్ట్ లు అంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణలో మెడికో ఆత్మహత్య చేసుకున్న తర్వాత తెలంగాణ జిల్లాల్లో ఆత్మహత్యలు పెరిగాయి. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు వైరల్ అవడం వల్ల మనస్థాపంతో మెడికో ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులు వచ్చి ఆ మెడికోను గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడంతో మెడికో తీవ్ర మనస్థాపానికి గురైంది. పరువు పోయింది నేను బతకడం అనవసరం అనుకుంది ఆ మెడికో. వెంటనే ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు నుంచి తెలంగాణలో కొందరు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదా చేసుకోవడం నేరం. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులకు శిక్షలు ఉంటాయి.
ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాగానే ఇతర సబ్జెక్టు మీద మనసును డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలను నిరోధించవచ్చని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు. యూట్యూబ్ లలో ఇలాంటి వీడియోలు వెంటనే డిలీట్ అయ్యే టెక్నాలజీ ప్రవేశ పెడితే కొంతవరకు ఆత్మహత్యలను నిరోధించవచ్చని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dont-post-that-type-of-posts-25-156128.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!