Publish Date:Jun 27, 2022
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా కు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశా రు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ వేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ, తమకు తోచిన విధంగా పాలన సాగించేవారికి, ఇతరుల సంగతి పట్టని వారికి ఎప్పుడూ వ్యతిరేకతే ఎదుర వుతుందన్నారు. తాము అద్భుతంగా పరిపాలిస్తున్నామని భజన చేసుకోవడంలోనే బిజెపీ కాలం గడుపుతోందే గాని తెలంగాణా ప్రభుత్వం అభ్యర్ధనలు బొత్తగా పట్టించుకోవడంలేదన్నది తెలంగాణ ప్రజల అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా బిజెపీ కూటమి ద్రౌపది ముర్మును నిలబెట్టింది. ఆమె ఒరిస్సా వెనుకబడిన తరగతు లకు చెందిన మహిళ అయినా తెలంగాణా ప్రభుత్వం ఆమెకు మద్దతునీయడానికి నిరాకరించిం ది. అయితే అది ఆమె పట్ల వ్యతిరేకత కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుకి నిరస నగానే ముర్ముకి మద్దతు ఇవ్వడంలేదని కేటీఆర్ అన్నారు.
కేంద్రం గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయడానికి అందరి మద్దతు కోరుతున్నారు కానీ తెలంగాణా ప్రభుత్వం తెలంగాణాలోని ఏడు గిరిజన మండలాలను తమకు తిరిగి ఇవ్వాలని చేస్తున్న డిమాండ్‌ను మాత్రం కేంద్రం పెద్దలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అలాగే అత్యంత కీలకమైన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు గురించి తెలంగాణా ప్రభుత్వ అభ్యర్ధనను కూడా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.
ఈ పరిస్థితుల్లో బిజెపి కూటమి నిలబెట్టిన అభ్యర్ధికి తెలంగాణా ప్రభుత్వం ఏ విధంగా మద్దతునిస్తుందని ప్రశ్నించారు. అందుకే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు టీఆర్ ఎస్ మద్దతునిస్తున్నదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ద్రౌపది ముర్ముపై తమకు ఎలాంటి వ్యతి రేకత లేదని, బీజేపీ నిరంకుశ వైఖరిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ అక్రమాలకు అడ్డూ అదుపూ లే కుండా పోతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. యశ్వంత్ సిన్హా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు నామా నాగేశ్వరరావు, డాక్టర్ రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, వెంకటేష్, రవిచంద్ర, పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/we-are-not-against-to-murmu-opposing-bjp-says-ktr-39-138560.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.