51 వేల మందికి ‘అమ్మ ఒడి’ ఎగనామం!

Publish Date:Jun 27, 2022

Advertisement

దేవుడి స్క్రిప్ట్ అలా ఉంది. నేనేం చేయగలను అంటూ జగన్ అమ్మ ఒడిపై చేతులెత్తేశారు.  రాష్ట్రంలో అమ్మ ఒడి పథకానికి 51 వేల మందిని దూరం చేసేశారు. పైగా ఇందులో నా తప్పేమీ లేదు... మీ పిల్లల హాజరు 75శాతం లేదు.. అది మీ తప్పేనంటూ నెపం తల్లుల మీదకు నెట్టేశారు. ఒక విధంగా 51 వేల మంది అమ్మలను అమ్మఒడి పథకానికి దూరం చేయడం ద్వారా  జగన్ తనకు చాతకాదని బహిరంగంగా ఓప్పుకున్న సందర్భమింది. రాష్ట్రంలో  51 వేల మంది అమ్మలకు అమ్మఒడి ఇవ్వడం లేదని జగన్ బహిరంగంగా అంగీకరించారు. అయితే వారు అమ్మ ఒడికి దూరం కావడానికి మాత్రం తను కారణం కాదని అంటున్నారు.  విద్యార్థుల హాజరు శాతం 75 లేకపోవడం వల్లే  ఆ  తల్లులందరికీ అమ్మ ఒడి ఇవ్వలేదని సాకు చెబుతున్నారు.

ఇది ఎంత వరకూ సమంజసమనే   ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. రాష్ట్రంలో ఈ  సారి 51 వేల అమ్మలకు అమ్మ ఒడి ఎగ్గొట్టినట్టు ఏ మాత్రం సంకోచం లేకుండా జగన్ చెప్పడాన్ని పలువురు గర్హిస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా సీఎం జగన్ స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో అమ్మ ఒడి పథకం మూడో విడత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 శాతం హాజరు ఉండాలని అమ్మ ఒడి జీవోలోనే  పొందుపర్చామని చెప్పారు. ఆ జీఓ ప్రకారం 51 వేల మంది తల్లుల పిల్లల హాజరు శాతం నిర్దేశించిన దాని కంటే తగ్గిందని, అందుకే వారికి అమ్మ ఒడి అందించ లేదని చెప్పుకొచ్చారు. పైగా భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి పరిస్థితి తెలత్తకూడదంటే తల్లులు తమ పిల్లల్ని బడికి పంపాలంటూ సలహా పారేశారు.  జగన్ చెప్పిన ప్రకారమే చూసుకుంటే.. అంత మంది విద్యార్థులకు హాజరు శాతం ఎందుకు తగ్గింది? వారంతా ఎందుకు పాఠశాలలకు హాజరు కాలేదు? అనే విషయాన్ని సమీక్షించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి లేదా? అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  

ఒక పక్కన కరోనా వచ్చి విద్యా సంస్థలు సరిగా నడవలేదు. ఆన్ లైన్ తరగతుల పేరుతో ఎందరో విద్యార్థులు ఇళ్ల నుంచే క్లాసులకు హాజరయ్యారు. గత విద్యా సంవత్సరం పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. బయటికి వెళ్తే   ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితుల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గిన మాట వాస్తవమే కావచ్చు. దొరికిందే సందు అనే విధంగా ఎప్పుడు ఏ వంక దొరికితే..   హామీల లబ్ధిదారుల సంఖ్యను కుదించేద్దామా అన్న  రీతిలో జగన్  సర్కార్ వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు శాతం నెపంతో వేలాది మంది తల్లులను అమ్మ ఒడి పథకాకి జగన్ సర్కార్ దూరం చేసిందని పలువురు విమర్శిస్తున్నారు.

పథకాలను ఎగ్గొట్టే దురాలోచన చేస్తూనే.. అమ్మ ఒడి పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అమ్మ ఒడి పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా.. పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించడాన్ని తప్పుపడుతున్నారు. స్కూలుకు తమ పిల్లల్ని పంపించే తల్లులకు అమ్మ ఒడి అందిస్తామని హామీ ఇచ్చింది జగన్ అయితే.. విమర్శకులు డబ్బులు ఇచ్చారా? అని అనడంమేమిటని అంటున్నారు.   

తన హామీలకు కోతలు పెట్టేందుకు, ఎగ్గొట్టేందుకు దారులు తానే వెదికిన జగన్ రెడ్డి ఇప్పడు ‘అంతా మీరే చేశారు’అన్న రీతిలో విద్యార్థులు, వారి తల్లులపైనే నెపం నెట్టేయడం దారుణం అంటున్నారు. అంత మంది తల్లులకు అమ్మ ఒడి ఎగ్గొట్టడమే కాకుండా.. ‘తనకు ప్రజల అండ ఉన్నంత వరకు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరం’టూ మరోసారి తన అక్కసును, అసహనాన్ని బహిరంగంగా వెళ్లగక్కడం విస్మయానికి గురిచేస్తోందంటున్నారు. ఇప్పుడు అమ్మ ఒడి పథకం డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా.. ‘తల్లికి కూడు పెట్టనోడు.. పినతల్లికి గాజులు చేయించాడు’ అన్న చందంగా పేద విద్యార్థుల కోసం బైజూస్ యాప్ తీసుకొచ్చామంటున్నారు. 4.7 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తారట. ఉన్నది పీకేసి లేనిది ఇవ్వడం అంటే ఇదేనేమో అంటున్నారు.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.