ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్ రెడ్డి

Publish Date:Apr 13, 2026

Advertisement

 

ఆదివాసీ, గిరిజ‌న ,ఏజెన్సీ ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కు అడ్డంకిగా ఉన్న స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారం పైన ప్ర‌త్యేక దృష్టి సారిస్తాన‌ని ఆయ‌న తెలిపారు. ఆదివాసీ, గిరిజ‌న‌,ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి ప‌నుల పైన  మంత్రి సీత‌క్క నేతృత్వంలో గిరిజన,ఆదివాసీ ఎమ్మెల్యేల బృందం ముఖ్య‌మంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో క‌లిసి ప‌లు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతు ఆదివాసీ, గిరిజ‌నుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. 

ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాం ల నిర్మాణంపైన దృష్టి సారిస్తామ‌ని వారికి సీఎం హామీ ఇచ్చారు. వీటి ద్వారా తాగు, సాగు నీటి అవ‌స‌రాల‌ను తీర్చ‌వ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు. చెక్ డ్యాం లు, ర‌హ‌దారుల నిర్మాణం కోసం అట‌వీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. వీలైనంత త్వ‌ర‌గా అట‌వీ శాఖ నుంచి అనుమ‌తులు వ‌చ్చేలా చూస్తాన‌న్నారు. ఆదివాసీ,గిరిజ‌న రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయ‌డానికి అనుమ‌తులు ఇవ్వాల‌ని చేసిన విజ్ఞప్తికి ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించారు. 

అట‌వీశాఖ అభ్యంత‌రాల వ‌ల్ల ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌త్తులు ఆల‌స్యం అవుతాయ‌ని, కొన్ని చోట్ల కొత్త ర‌హ‌దారులకు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని వారు సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. వీలైనంత త్వ‌ర‌గా వీటిపైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అట‌వీ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. ఆదివాసీ, గిరిజ‌న ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల కోటా పెంచే విష‌యాన్ని ప‌రిశీలిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వారికి హామీ ఇచ్చారు. ఐటీడీఏ ల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌న్న ముఖ్య‌మంత్రి ఆదివాసీ, గిరిజ‌నులకు అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పిన‌పాక ఎమ్మెల్యే పాయం వెంక‌టేశ్వ‌ర్లు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసిన వారిలో ఉన్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.