ఎర్రసముద్రంలో యుద్ధ జ్వాలలు.!

Publish Date:Jul 23, 2026

Advertisement

అంతర్జాతీయ వాణిజ్య మార్గమైన ఎర్రసముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.  ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే కీలక సముద్ర మార్గంలో  రాకెట్లు, డ్రోన్ దాడుల మోత మోగుతోంది. సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 

యునైటెడ్ కింగ్‌డమ్ మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల మేరకు..  సౌదీ అరేబియాలోని అల్ షుకైక్ ప్రాంతానికి నైరుతి దిశలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో  నౌకలో ఉవ్వెత్తున భారీగా మంటలు చెలరేగాయి.   అదృష్టవశాత్తూ ఈ క్షిపణి దాడిలో   ప్రాణనష్టం సంభవించలేదు.  

ఈ వినాశకర దాడికి బాధ్యత వహిస్తూ యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ వర్గం   ప్రకటన విడుదల చేసింది. సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ఒడిగట్టినట్లు హౌతీలు పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను దిగ్బంధించినందుకే  ఆ దేశ నౌకలపై సముద్ర నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. సౌదీ అరేబియా నౌకలపై సముద్ర నిషేధం విధించినట్లు  హౌతీ తిరుగుబాటుదారులు రెండు రోజుల కిందటే హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలు జారీ చేసిన రెండు రోజులకే  బాబ్ ఎల్-మండేబ్ జలసంధికి  సమీపంలో దాడికి పాల్పడ్డారు. 

ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో నౌకాయానం దాదాపుగా నిలిచిపోగా, ఇప్పుడు హౌతీ దాడితో  బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా నౌకాయానం భద్రత కాదని తేలడంతో   అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెట్రోలియం రవాణాపై సందిగ్దత నెలకొంది.  ఈ దాడులకు అడ్డుకట్ట పడకపోతే, ప్రపంచ ద్రవ్యోల్బణం పెరిగి  ఆర్థిక సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్త మౌతోంది. 

wares in  Red Sea, Houthi Rebels, Saudi Oil Tanker Attack, Bab el Mandeb Strait, Global Shipping Crisis, Maritime Security

By
en-us Political News

  
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.