సేవలు నిలిపేసిన రా ఎన్టీఆర్ టీమ్.!

Publish Date:Jul 23, 2026

Advertisement

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై  చురుగ్గా ఉంటూ, నిరంతరం సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తూ నందమూరి అభిమానులకు కొండంత అండగా నిలిచిన   రా ఎన్టీఆర్ టీమ్.. తన సామాజిక మాధ్యమ  కార్యకలాపాలను   శాశ్వతంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. రా ఎన్టీఆర్ టీమ్ నిర్ణయం నెటిజన్లను, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 

సామాజిక మాధ్యమాల్లో  ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు   నిర్వహించడంలో  రా ఎన్టీఆర్  తనదైన ప్రత్యేక ముద్ర వేసింది.   ఇన్నాళ్లుగా  చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా   సేవలను నిలిపివేయడంపై   సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే సేవల నిలిపివేత నిర్ణయానికి కారణాలేమిటన్నది రాఎన్టీఆర్ వెల్లడించలేదు.  ఇలా ఉండగా.. ఇప్పటికే రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎటువంటి సంబంధం లేదనీ,  ఆ గ్రూప్ చేసే ప్రకటనలు,  సోషల్ మీడియా పోస్టులు సేవా కార్యక్రమాలలతో తమకు ఎటువంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ టీమ్ గతంలోనే విస్పష్టంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  జూనియర్ ఎన్టీఆర్ నుంచి  ఈ స్పష్టత వచ్చిన రోజుల వ్యవధిలోనే  రా ఎన్టీఆర్   తమ సేవలను నిలిపియడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

Jr NTR Social Media, RAW NTR Decision, Tollywood News, NTR Official Statement

By
en-us Political News

  
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవని పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను కూడా నిలిపివేసినట్లు తెలిపింది.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 27.65 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకోగా, మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు ఉండోచ్ని అంచనా.
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
ధవళేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ.. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు చేరిన ప్రయాణం ప్రతీ చిన్నారికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
లోహియా కార్ప్ ఐపీఓ ప్రారంభమైంది. రూ. 404 425 ధరల శ్రేణి, 8.47% జిఎంపి లాభాలు, ఆఫర్ ఫర్ సేల్ వివరాలు, కేటాయింపు డేట్లు మరియు బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.